తొలగనున్న ‘ఇరుకు’ | The Narrows bridges, construction of bridges highlevel place | Sakshi
Sakshi News home page

తొలగనున్న ‘ఇరుకు’

Published Tue, Jan 6 2015 1:23 AM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

The Narrows bridges, construction of bridges highlevel  place

ఇరుకు వంతెనల స్థానంలో హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం
జిల్లాలోని ఆర్‌అండ్‌బీకి రూ.50.20 కోట్లు
పనుల అంచనాల రూపకల్పనలో అధికారులు

 
వరంగల్ రూరల్ :రహదారులు-భవనాల శాఖ పరిధిలో నిడివి తక్కువగా ఉండి ఇరుకుగా ఉన్న బ్రిడ్జీల స్థానంలో హైలెవల్ బ్రిడ్జీలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధు లు కేటాయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం జిల్లాకు రూ.50.20 కోట్లు మంజూరు చేసింది. వి విధ పథకాల కింద రహ దారులను వెడ ల్పు చేసినా పలు బ్రిడ్జీల నిడివి తక్కువగా ఉండడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఇటీవల రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు నిధు లు కేటాయించింది. రహదారులు-బ్రిడ్జిలు కలిపి ని ధులు కేటాయిస్తే పనులు నత్తనడకన జరిగే అవకాశాలున్నందున వేర్వేరుగా నిధులను కేటాయిం చినట్లు తెలిసింది. మంజూరైన బ్రిడ్జీల వివరాలు..
     
తాడ్వాయి మండలం నుంచి బయ్యారం వరకు ఉన్న రహదారి మధ్య గల 15/4-6 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.5 కోట్లు.  పసరా నుంచి భూపాలపల్లి రహదారి మధ్య గల 22/8-10, 24/0-2 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.4 కోట్లు. పసరా నుంచి భూపాలపల్లి రహదారి మధ్య గల 21/4-6కి.మీ. మధ్య గల బ్రిడ్జి నిర్మాణానికి రూ.10 కోట్లు.. భూపతిపేట-కొత్తగూడ రహదారి మధ్య గల 3/4-6 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటి.. భూపతిపేట-కొత్తగూడ రహదారి మధ్య గల 8/2-4 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటి..

ఊరుగొండ-పసరుగొండ రహదారి మధ్య గల 2/8-3/0కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.50 కోట్లు..మందారిపేట-పోచారం రహదారి మధ్య గల 4/6-5/0 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.50 కోట్లు.. రఘునాథపల్లి-కంచనపల్లి రహదారి మధ్య గల 1/2-4 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటి.. తొర్రూరు-వలిగొండ మధ్య గల 0/0 నుంచి 9/3 వరకు 21/750 నుంచి 26/6 వరకు ఉన్న బ్రిడ్జీల సీడీ వర్క్స్ కోసం రూ.2 కోట్లు.. పీడబ్ల్యూడీ రోడ్ కొలుకొండ వయా చిన మడూర్-అప్పిరెడ్డిపల్లిల మధ్య ఉన్న రహదారిలో 5/4 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.20 కోట్లు..
     
మహబూబాబాద్-నెల్లికుదురుల మధ్య ఉన్న రహదారిలోని 21/2 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.50 కోట్లు.. మహ్మద్‌గౌస్‌పల్లి-గిర్నిబావిల మధ్యగల రహదారిలోని 9/6-8 కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు.. మహ్మద్‌గౌస్‌పల్లి-గిర్నిబావిల మధ్య గల రహదారిలోని 10/2-4కి.మీ. వద్ద బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు.. ఆకేరువాగు-పర్వతగిరి బైపాస్ నుంచి కల్లెడ రహదారిలోని 1/180కి.మీ./ కల్లెడ-కొత్తూరు రహదారిలోని 0/6-8కి.మీ. వద్ద బ్రిడ్జీల నిర్మాణానికి రూ.5 కోట్లు..  గొల్లచర్ల-ముల్కలపల్లిల మధ్య గల రహదారిలోని 4/0 కి.మీ. వద్ద బ్రిడ్జి అభివృద్ధి కోసం రూ.1.50 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ పనులు చేపట్టేందుకు పూర్తి స్థాయిలో అంచనాలు రూపొందించి టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement