కోదాడటౌన్ : ప్రమాదాలు జరిగినపుడు క్షతగాత్రుల ప్రా ణాలు కాపాడటానికి మొదటి అరగంట సమయం ఎంతో కీలకం. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు వైద్యసౌకర్యాలు అందజేయడం వల్ల విలువైన ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెపుతున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న 65వనంబర్ జాతీయ రహదారిపై తక్షణం స్పందించేందుకు హైదరాబాద్‌కు చెందిన మైఅఫిసియెట్ అనే సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్) కింద నూతనంగా ‘ఎన్‌హెచ్-65’ పేరుతో నూతన మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. దీనిని మరో రెండువారాల్లోగా అందుబాటులోకి ఈ సంస్థ తేనుంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎలాపని చేస్తుందంటే...
ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్న వారు విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు 270 కిలోమీటర్ల దూరం ఉన్న జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు ఎక్కడ ప్రమాదానికి గురైన, పక్కవారు ప్రమాదానికి గురైన వెంటనే చిన్న బటన్ నొక్కడం ద్వారా కంట్రోల్‌రూంకు సమాచారం అందుతుంది. కేవలం సమాచారమే కాకుండా ప్రమాద చిత్రాన్ని, ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కూడ తెలుపుతుంది. అంతే కాకుండా అంబులెన్స్ అక్కడకు ఎలా చేరుకోవాలో కూడ గైడ్ చేస్తుంది.
హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇచ్చినపుడు ప్రమాదం వివరాలు వివరించడంతోపాటు ప్రమాదం జరిగిన ప్రదేశం చెప్పడం.. వారు దానిని నమోదు చేసుకొని స్పందించే వరకు విలువైన సమయం వృథా అవుతుంది. దీని వల్ల అలాంటి విలువైన సమయం వృథా కాకుండా కాపాడుకోవచ్చని వైద్యులు, ఆప్ డెవలపర్స్ చెపుతున్నారు. అదే విదంగా నేరాలు జరిగినపుడు, కిడ్నాప్ వంటి సంఘటనలు జరిగినపుడు బాధితులు తక్షణమే దీని ద్వారా పోలీసులకు, కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వవచ్చు.
దీనికి వచ్చే స్పందనను బట్టి ఇతర హైవేలలో దీనిని ఉపయోగంలోకి తేనున్నారు. దీంతోపాటు ఇదే సంస్థ మరో కొత్త ఆప్‌ను డ్రైవర్ల కోసం అభివృద్ధి చేస్తోం ది. ఈ అప్లికేషన్ ఉన్న డ్రైవర్ స్పీడ్ లిమిట్స్ దాటగానే ఇది హెచ్చరిస్తుంది. ప్రమాదం జరిగే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్‌ను హెచ్చరిస్తుందని, దీనిని కూడా త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెపుతున్నారు.
ఎంతో ఉపయోగం
ప్రమాదాలు జరిగినపుడు వెంటనే తగిన సమాచారం అందడంలో కొంత ఆలస్యం అవుతుంది. దీనివల్ల క్షతగాత్రులు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. అందుబాటులోకి రానున్న నూతన అప్ ద్వారా వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొనే అవకాశం ఉంది. అందే విధంగా దోపిడీలు జరిగినపుడు కూడ దీనిని ఉపయోగించుకొనే అవకాశం పరిశీలించాలి.
కొత్త ఆప్.. ఎన్‌హెచ్-65
Published Wed, Sep 2 2015 4:58 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement