రెండోరోజూ అదే తీరు | The same pattern rendoroju | Sakshi
Sakshi News home page

రెండోరోజూ అదే తీరు

Published Wed, Mar 11 2015 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

The same pattern rendoroju

ఖమ్మం: ఇంటర్మీడియెట్ పరీక్షల రెండో రోజు కూడా విద్యార్థులకు ఇక్కట్లు తప్పలేదు. సెకండియర్ పరీక్షలకు వసతులను కల్పించడంలోనూ అధికారులు విఫలం అయ్యూరు. తొలిరోజు అవస్థలపై ‘సాక్షి'లో వచ్చిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా అడిషనల్ జాయింగ్ కలెక్టర్ బాబూరావు మంగళవారం పలు కేంద్రాలను పరిశీలించారు. సెకండియర్ పరీక్షలకు తొలిరోజు 22,931 మంది విద్యార్థులు హాజరుకాగా 1,769 మంది గైర్హాజరయ్యూరయ్యూరని జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు.
 
వెంటాడిన వసతుల లేమి
 ఎప్పటి మాదిరిగానే వసతుల లేమి వెంటాడింది. ఇల్లెందు సెంటర్లో ఇరుకు గదుల్లో విద్యార్థులను కూర్చోబెట్టడంతో ఎంచక్కా మాస్‌కాఫీరుుంగ్‌కు పాల్పడ్డారు. దీనిపై స్పందించిన అధికారులు ఇతర గదులకు మార్చాలని ఆదేశాలు జారీ చేసినా సెంటర్ అధికారులు బుధవారం మారుస్తామని మిన్నకున్నారు.

గుండాల ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎర్రుపాలెం సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో ఫర్నిచర్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. నేలపై, స్టూల్స్‌పై కూర్చొని పరీక్షలు రాశారు. ఖమ్మంలోనూ పలు కళాశాలల్లో కుర్చీలపై కూర్చొని పరీక్ష రాయూల్సి వచ్చింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల టేకులపల్లి, అశ్వారావుపేట సెంటర్లలో అందుబాటులో ఉన్న ఫర్నిచర్‌ను తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించారు. అరుునా విద్యార్థులకు సరిపడా బల్లలు సమకూర్చలేకపోయూరు.
 
ఏజేసీ విస్తృత తనిఖీ
పరీక్షలు సక్రమంగా సాగడం లేదని మంగళవారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా అధికారులు ఆర్‌వోను ఆదేశించినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బాబూరావు నేతృత్వంలో పలు సెంటర్లను తనిఖీచేశారు. నయూబజార్, ఎక్స్‌లెంట్, గాయత్రి కళాశాలలను సందర్శించారు. గుర్తింపుకార్డుల్లేని ఇన్విజిలేటర్లను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.


 భారీగానే గైర్హాజరు
 ఇంటర్ సెకండియర్ పరీక్షలకు తొలిరోజు 1,769 మంది విద్యార్థులు గైర్హాజరయ్యూరు. జనరల్ విభాగంలో 21,747 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సిఉండగా 20,397 మంది హాజరయ్యూరు. 1,350 మంది గైర్హాజరయ్యూరు. ఒకేషనల్ విభాగంలో 2,953మందికి 419మంది గైర్హాజరయ్యూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement