మరో వారం పాటు ఇదే పరిస్థితి
హన్మకొండ : ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు తోడు వాతావరణంలో తేమ శాతం తగ్గిపోవంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉష్ణోగ్రత 42 సెల్సియస్ డిగ్రీలకు పైగా నమోదైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో రెండు మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నుంచి అసలుసిసలైన వేసవి వచ్చేయడంతో ఉష్ణోగ్రతలుపెరిగిపోయాయి.
ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎండ తీవ్రత ఉంటోంది. రానున్న రోజుల్లో ఎండలు ఇంకా పెరగనున్నారుు. 46 సెల్సియల్ డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పెరిగితే బటయ వాతావరణంలో కొద్దిసేపు ఉన్నా తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు వస్తారుు. సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా ఎక్కువ సమయం ఎండలో తిరిగే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.