భగ్గుమంటున్న ఓసీలు | the Singareni Open Cost Burning OCs | Sakshi
Sakshi News home page

భగ్గుమంటున్న ఓసీలు

Published Sat, Mar 26 2016 3:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

భగ్గుమంటున్న ఓసీలు - Sakshi

భగ్గుమంటున్న ఓసీలు

 కొత్తగూడెం(ఖమ్మం) :  సాధారణంగా మే నెలలో ఉండాల్సిన ఎండలు మార్చిలోనే పెరగడంతో ముఖ్యంగా సింగరేణి ఓపెన్‌కాస్టు గనులు భగ్గుమంటున్నాయి. విపరీతమైన వేడి, వడగాల్పులకు తట్టుకోలేక కార్మికులు విలవిల్లాడుతున్నారు. ఓసీపీల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థారుుకంటే అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని గౌతంఖని ఓపెన్‌కాస్టు, సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీలలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నా యూజమాన్యం ఎప్పటి మాదిరిగానే ఏప్రిల్ ఒకటి నుంచి వేసవి ఉపశమన చర్యలు చేపట్టడానికి వేచి చూస్తోందని కార్మిక నాయకులు మండిపడుతున్నారు. అత్యధిక వేడి కారణంగా కార్మికులు విధులు నిర్వహిం చేందుకు భయపడుతున్నారని, మార్చి 31 వరకు నిర్దేశి త ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరవుతున్నారని పేర్కొంటున్నారు.

 రక్షణ చర్యలు చేపట్టాలి
ఎండల నుంచి రక్షించుకునేందుకు రక్షణ చర్యలు చేపట్టాలని ఓపెన్‌కాస్టు గనుల కార్మికులు యూజమాన్యా న్ని కోరుతున్నారు. గనుల్లో కనీసం చల్లని తాగునీటి సదుపాయం లేదని దాహార్తితో గొంతెండిపోతోందని అంటున్నారు. నీడలో సేదదీరడానికి షెడ్లు కూడా ఏర్పా టు చేయలేదని, ఏసీతో కూడిన షెడ్లు ఏర్పాటు చేయాల ని డిమాండ్ చేస్తున్నారు. మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు నిరంతరం అందజేయూలని, ఎండలు మరింత పెరిగే అవకాశమున్నందున మధ్యాహ్నం సమయంలో కొంత సమయం బ్రేక్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయమై కార్మిక సంఘాలు సైతం యాజ మాన్యంతో చర్చించాల ని విజ్ఞప్తి చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement