కేడర్‌ను పెంచుకునే దిశగా టీఆర్‌ఎస్ అడుగులు
ఇప్పటికే ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీఆర్‌ఎస్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించి సర్కారును ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ఇప్పుడు కేడర్‌ను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బీఎస్పీ ఎమ్మెల్యేలు ఐకే రెడ్డి, కోనప్పను పార్టీలో చేర్చుకున్నారు. అలాగే ద్వితీయ శ్రేణి ాయకత్వంపై దృష్టి సారించింది. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ కేడర్‌ను పూర్తి స్థాయిలో టీఆర్‌ఎస్‌లోకి లాగేందుకు పావులు కదుపుతోంది. ఇతర పార్టీలతో పోల్చితే టీఆర్‌ఎస్‌కు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగలేదనే అభిప్రాయం ఉంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. తాజాగా బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరగా, మిగిలిన ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డితో కూడా సన్నిహిత సంబంధాలు పెంచుకునే దిశగా ఆ పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది.
పార్టీలో ఉన్న పాత నాయకులను, కార్యకర్తలను కలుపుకుని పోవడంతోపాటు, కొత్త వారికి పార్టీ పదవులను ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు ఒకరు అభిప్రాయ పడ్డారు. ద్వితీయ శ్రేణి నాయకులకు మార్కెట్ కమిటీ డెరైక్టర్లు వంటి నామినేట్ పదవులను ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. జెడ్పీతోపాటు మండల పరిషత్‌లపై కూడా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాని మండలాల్లో ఎంపీపీ పదవులను కైవసం చేసుకునేలా పావులు కదుపుతున్నారు. ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కాగా, టీఆర్‌ఎస్ అధికారంలో ఉండటంతో ఇతర పార్టీలకు చెందిన వారు ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. అధికార పార్టీలో ఉంటే పనులు చేసుకోవచ్చనే యోచనలో ఉన్నవారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావచ్చనే భావనలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.
ఇక నిర్మాణంపై నజర్
Published Sat, Jun 7 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM
Advertisement