సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం జీఎస్‌టీ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరు కంపెనీలతోపాటు మరో 20 కంపెనీలు కూడా సుజనా గ్రూపు కంపెనీలున్న చిరునామాలోనే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ఈ ఆరు కంపెనీల టర్నోవర్ రూ.1,289 కోట్లుగా ఉందని, ఆ కంపెనీల నుంచి రూ.224 కోట్లు పన్నుల రూపంలో రావాల్సి ఉందని తెలిపింది. పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరిపే అధికారం సెంట్రల్ ట్యాక్స్ అధికారులకు ఉందని, విచారణకు సహకరించాల్సిన బాధ్యత ఆ కంపెనీలపై ఉందని వివరిం చింది. సాక్ష్యాలను తారుమారు చేసే అవ కాశం ఉన్నప్పుడు, కంపెనీలకు సంబం ధించిన వారిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పోలీసు అధికారులకు ఉండే అధికారాలన్నీ జీఎస్‌టీ అధికారులకు కూడా ఉంటాయని వివరించింది. జీఎస్‌టీ ప్రత్యేక చట్టమని, అరెస్ట్‌కు సీఆర్‌పీసీ వర్తిం చదని తెలిపింది. అయితే ఆ తరువాత ప్రక్రియ అంతా కూడా సీఆర్‌పీసీ ప్రకారమే జరుగుతుందని తెలిపింది.
అంతకు ముందు ఆరు కంపెనీల డైరెక్టర్ల తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, ఆర్.రఘునందన్‌రావులు వాదనలు వినిపిస్తూ, జీఎస్‌టీ కింద అధికారాలు న్నంత మాత్రాన వారేమీ పోలీసులు కాదన్నారు. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద నోటీసు ఇచ్చి తీరాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నా కూడా పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం పిటిషనర్లు ఎదుర్కొం టున్న ఆరోపణలన్నీ కూడా జరిమానా విధించదగ్గవేనని, ఈ ఆరోపణలకు వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని వివ రించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూ ర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
తీర్పు వెలువరించేంత వరకు పిటి షనర్లను అరెస్ట్ చేయవద్దని సెంట్రల్ ట్యాక్స్ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. జీఎస్‌టీ చెల్లింపుల విషయంలో సెంట్రల్ ట్యాక్స్ అధికారులు జారీ చేసిన సమన్లను రద్దు చేయడం తోపాటు తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సుజనా గ్రూపునకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ జి.శ్రీనివాసరాజు, హిందుస్తాన్ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బి.వెంకటసత్య ధర్మావతార్, ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ పి.వి.రమణారెడ్డి, ఈబీసీ బేరింగ్స్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ బాలకృష్ణమూర్తిలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
‘సుజనా’ చిరునామాలో మరో 20 కంపెనీలు
Published Wed, Mar 20 2019 2:35 AM | Last Updated on Wed, Mar 20 2019 2:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment