sujana group of companies
-
సుజనా గ్రూప్ కంపెనీలకు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: సుజనా గ్రూప్ బినామీలంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వీఎస్ ఫెర్రస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, భరణి కమోడిటీస్, బీఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ అండ్ ట్రేడింగ్ లిమిటెడ్‌లకు ఊరటనిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా రద్దు చేసింది. తాజాగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయొచ్చంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ చట్టంలోని 69(1), 132లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని ఆ కంపెనీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో సదరు కంపె నీలు ఇచ్చే సమాధానాలను బట్టి తదుపరి చర్య లు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను రద్దు చేయాలంటూ అడిషినల్ సొలిసిటర్ జనరల్ కె.నటరాజ్, జీఎస్టీ స్టాండింగ్ కౌన్సిల్ బి.నర్సింహశర్మలు బుధవారం హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. బోగస్ ఇన్వాయిస్లతో రూ.225 కోట్ల మేర సదరు కంపెనీలు లబ్ధి పొందాయని జీఎస్టీ అధికారులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పంజాగుట్టలోని సుజనా గ్రూప్ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరపగా, ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని, అందుకే ఆ కంపెనీలకు నోటీసులు ఇచ్చామని, చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని నర్సింహశర్మ చెప్పారు. దీంతో మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
‘సుజనా’ చిరునామాలో మరో 20 కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం జీఎస్టీ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరు కంపెనీలతోపాటు మరో 20 కంపెనీలు కూడా సుజనా గ్రూపు కంపెనీలున్న చిరునామాలోనే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. ఈ ఆరు కంపెనీల టర్నోవర్ రూ.1,289 కోట్లుగా ఉందని, ఆ కంపెనీల నుంచి రూ.224 కోట్లు పన్నుల రూపంలో రావాల్సి ఉందని తెలిపింది. పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరిపే అధికారం సెంట్రల్ ట్యాక్స్ అధికారులకు ఉందని, విచారణకు సహకరించాల్సిన బాధ్యత ఆ కంపెనీలపై ఉందని వివరిం చింది. సాక్ష్యాలను తారుమారు చేసే అవ కాశం ఉన్నప్పుడు, కంపెనీలకు సంబం ధించిన వారిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పోలీసు అధికారులకు ఉండే అధికారాలన్నీ జీఎస్టీ అధికారులకు కూడా ఉంటాయని వివరించింది. జీఎస్టీ ప్రత్యేక చట్టమని, అరెస్ట్‌కు సీఆర్పీసీ వర్తిం చదని తెలిపింది. అయితే ఆ తరువాత ప్రక్రియ అంతా కూడా సీఆర్పీసీ ప్రకారమే జరుగుతుందని తెలిపింది. అంతకు ముందు ఆరు కంపెనీల డైరెక్టర్ల తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, ఆర్.రఘునందన్‌రావులు వాదనలు వినిపిస్తూ, జీఎస్టీ కింద అధికారాలు న్నంత మాత్రాన వారేమీ పోలీసులు కాదన్నారు. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసు ఇచ్చి తీరాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నా కూడా పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం పిటిషనర్లు ఎదుర్కొం టున్న ఆరోపణలన్నీ కూడా జరిమానా విధించదగ్గవేనని, ఈ ఆరోపణలకు వారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని వివ రించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూ ర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తీర్పు వెలువరించేంత వరకు పిటి షనర్లను అరెస్ట్ చేయవద్దని సెంట్రల్ ట్యాక్స్ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. జీఎస్టీ చెల్లింపుల విషయంలో సెంట్రల్ ట్యాక్స్ అధికారులు జారీ చేసిన సమన్లను రద్దు చేయడం తోపాటు తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సుజనా గ్రూపునకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ జి.శ్రీనివాసరాజు, హిందుస్తాన్ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ బి.వెంకటసత్య ధర్మావతార్, ఇన్ఫినిటీ మెటల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ పి.వి.రమణారెడ్డి, ఈబీసీ బేరింగ్స్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ బాలకృష్ణమూర్తిలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
ఈడీ ముందు హాజరు కావాల్సిందే...
సాక్షి, హైదరాబాద్: తమ ముందు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్లను గౌరవించాలని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి)కి ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సమన్ల ప్రకారం డిసెంబర్ 3న ఈడీ ముందు హాజరు కావాల్సిందేనని ఆయనకు తేల్చిచెప్పింది. అయితే సుజనాపై కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఈడీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ముక్తా గుప్తా శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమ నుంచి తీసుకున్న రూ.364 కోట్ల అప్పును చెల్లించకుండా ఎగవేశారంటూ కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఇటీవల హైదరాబాద్‌లోని సుజనాచౌదరి కార్యాలయం, నివాసంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, అనేక కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. అలాగే సుజనా గ్రూప్ కింద 120 సూట్‌కేసు కంపెనీలున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. రూ.5,700 కోట్ల మేరకు రుణాలు ఎగవేసినట్లు గుర్తించి, అందుకు సంబంధించిన కీలక పత్రాలనూ స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేసు కంపెనీల పేరిట ఆరు ఖరీదైన కార్లు రిజిస్టరైనట్లు గుర్తించి వాటినీ జప్తు చేశారు. ఈ నేపథ్యంలో స్వయంగా తమ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. ఈ సమన్లను కొట్టేయాలని అభ్యర్థిస్తూ సుజనాచౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ముక్తా గుప్తా శుక్రవారం విచారించారు. వాస్తవాలు తెలుసుకునేందుకే సమన్లు.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈడీ నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్)లో సుజనాచౌదరి పేరు లేదన్నారు. అందువల్ల ఆయనకు జారీచేసిన సమన్లు చట్టప్రకారం చెల్లవన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంతో కేంద్రప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని, అందులో భాగంగానే సుజనాపై ఈడీ దాడులు జరిగాయని చెప్పారు. ఈ వాదనలను కేంద్రప్రభుత్వ న్యాయవాది అనిల్ సోనీ తోసిపుచ్చారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టస్ లిమిటెడ్‌లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఆ కంపెనీ డైరెక్టర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుజనాచౌదరి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయన్నారు. సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాస్తవాలను తెలుసుకునేందుకు ఆయనకు సమన్లు ఇచ్చినట్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. డిసెంబర్ 3న ఈడీ ముందు హాజరు కావాల్సిందేనని సుజనాచౌదరిని ఆదేశించారు. అయితే సుజనాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఈడీకి స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర ఆర్థిక శాఖను ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేశారు. -
‘సుజనా’ క్రియేటివ్స్.. మాయారాజ్యం
సాక్షి, బిజినెస్ ప్రత్యేక ప్రతినిధి: బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్!! కేమన్ ఐలాండ్స్!! ఐల్ ఆఫ్ మ్యాన్!! మారిషస్!! పన్ను కట్టకుండా నల్లడబ్బును సొంత ఖాతాల్లోకి మళ్లించడానికి ఆర్థిక మోసగాళ్లు ఉపయోగించే పన్ను స్వర్గాలివి. అక్కడ కంపెనీలు పెట్టిన కొందరి పేర్లను గతంలో ప్యారడైజ్ పేపర్స్, పనామా పేపర్స్ వెల్లడించాయి!!. వారిపై దేశీయంగా దర్యాప్తు కూడా జరుగుతోంది! చిత్రమేంటంటే సుజనా చౌదరి అలియాస్ యలమంచిలి సత్యనారాయణ చౌదరి వీటిలో ఏ ఒక్క దేశాన్నీ వదల్లేదు. దాదాపు అన్ని పన్ను స్వర్గాల్లోనూ పదుల కొద్దీ కంపెనీలు పెట్టేశారు. బినామీలను పెట్టి తాను బయటపడకుండా నడిపిస్తున్నారు. దేశంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో కొల్లగొట్టిన రూ.వేల కోట్ల రూపాయల్ని ఈ గొలుసుకట్టు కంపెనీల ద్వారా తన సొంత ఖాతాల్లోకి మళ్లించారనే ఆరోపణలకు ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జరిపిన సోదాల్లో ఆధారాలు దొరికినట్లుగా తెలిసింది. తన రాజకీయ భాగస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమితంగా ఇష్టపడే సింగపూర్‌తో ప్రారంభిస్తే... ప్రపంచంలో ఏ దేశాన్నీ వదలకుండా సుజనా చౌదరి పలు కంపెనీలు పెట్టారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న దాదాపు రూ.9,500 కోట్ల మేర రుణాల్లో అత్యధిక మొత్తాన్ని ఈ కంపెనీల ద్వారా తన సొంత ఖాతాల్లోకి, కావాల్సిన వారి ఖాతాల్లోకి మళ్లించారు. అందుకు ఎంచుకున్న మార్గమేంటి? ఏఏ దేశాల్లో ఏ కంపెనీలున్నాయి? వాటికి సుజనా తరఫున ప్రస్తుతం ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్నదెవరు? ఈ వివరాలన్నీ ఇవిగో... సుజనా చౌదరి దేశంలోని బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.9,500 కోట్లపైనే. వీటిలో చాలా రుణాల చెల్లింపుల్లో ఇప్పటికే డిఫాల్టయ్యారు. కానీ దేశంలోని ఏ ఒక్క బ్యాంకూ ఆయన్ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించలేదు. ఆయనపై దివాలా పిటిషన్ వేయటంగానీ, న్యాయస్థానాల్ని ఆశ్రయించటం గానీ చెయ్యలేదు. పరిస్థితులు దెబ్బతిని ఇంటి రుణం తిరిగి చెల్లించలేని వారిని సైతం ఎగవేతదారులుగా ప్రకటిస్తూ పత్రికల్లో ఫోటోలు వేసే బ్యాంకులు సుజనాపై ఉదారంగా వ్యవహరించటానికి ప్రధాన కారణం ఆయన రాజకీయ సంబంధాలే. ఆయన వెనకున్న చంద్రబాబు నాయుడే. దేశంలోనే కాదు! విదేశీ బ్యాంకులకూ భారీగా రుణాలు ఎగవేయటంతో మారిషస్ కమర్షియల్ బ్యాంకు ఇక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. పైపెచ్చు ఈ రుణాలపై ఎప్పుడు ఎవరేం అడిగినా... ‘‘నాకేం సంబంధం? నేను ఏ కంపెనీలోనూ డైరెక్టరుగా లేనే?’’ అని సుజనా ఎదురు తిరుగుతారు. బహుశా! అది తన రాజకీయ, వ్యాపార భాగస్వామి చంద్రబాబునాయుడి నుంచి నేర్చుకుని ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. ప్రధానంగా ఈ అప్పులన్నీ తీసుకున్నది మూడు లిస్టెడ్ కంపెనీల పేరిటే. అవి... 1. సుజనా యూనివర్సల్ లిమిటెడ్ (ఎస్‌యూఐఎల్) 2. సుజనా టవర్స్ లిమిటెడ్ (ఇపుడు న్యుఆన్ టవర్స్) 3. సుజనా మెటల్ ప్రొడక్టŠస్ లిమిటెడ్ (ఇపుడు స్ల్సెండిడ్ మెటల్స్). ఈ మూడింటికీ ఇప్పుడు డైరెక్టరుగా సుజనా చౌదరి రాజీనామా చేసి ఉండొచ్చు. కానీ వీటిని పెట్టింది ఆయన. ఇవి తీసుకున్న రూ.వేల కోట్ల రుణాలపై హామీదారుగా సంతకం చేసింది ఆయన. ఇప్పటికీ ఈ కంపెనీల్లో ఆయనకు, ఆయన భార్య పద్మజతో పాటు కుటుంబీకులకు వాటాలున్నాయి. ఈ కంపెనీల్లో వాటాలను హోల్డ్ చేస్తున్న ఇతర కంపెనీల్లోనూ సుజనా కుటుంబానిదే మెజారిటీ వాటా. అలాంటి ఓ నాలుగు కంపెనీల్లో ఇప్పటికీ సత్యనారాయణ చౌదరి డైరెక్టరే!. మరి ఈ అప్పులతో తనకు సంబంధం లేదని ఎలా బుకాయిస్తారు? ఆ రుణాలు ఏమయ్యాయి? ఇక్కడ సుజనా చౌదరి డైరెక్టరా? కాదా? అనేది పక్కనబెడితే... ఆయన బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.వేల కోట్ల రుణాలు ఏమయ్యాయన్నదే అసలు ప్రశ్న. నిజానికిలా తీసుకున్న అప్పుల్లో వ్యాపారానికి ఖర్చుపెట్టిందేమీ లేదు. ఇవన్నీ దేశంలో సుజనాకు చెందిన పలు షెల్ కంపెనీల్లోకి అడ్వాన్సులు, లోన్లు, ఇంటర్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ల పేరిట మళ్లిపోయాయి. అక్కడి నుంచి విదేశీ అనుబంధ సంస్థల్లోకి వెళ్లాయి. మొదట అనుబంధ సంస్థల్లోకి మళ్లించటం... తరవాత తనకు సంబంధించిన వేరే ప్రైవేట్ కంపెనీల్లోకి మళ్లించటం... అక్కడి నుంచి సొంత ఆస్తులు పెంచుకోవటానికి వాడటం. ఇదే కథ. ఎందుకంటే 2015 మార్చి 31 నాటికే... వివిధ అనుబంధ సంస్థల నుంచి సుజనా సంస్థలకు రావాల్సిన మొత్తం ఏకంగా రూ.9,365 కోట్లు. దీనికి ఆ కంపెనీలు చెప్పే పేరు... ట్రేడ్ రిసీవబుల్స్!!. అంతా అనుబంధ కంపెనీల మధ్యే... నిజానికి గడిచిన రెండేళ్లుగా సుజనా గ్రూపు ఆర్వోసీకి కూడా బ్యాలెన్స్ షీట్లు, వార్షిక రిటర్నులు సమర్పించటం లేదు. ఎందుకంటే వాటిని అందజేస్తే మొత్తం వాస్తవాలు తెలియజేయాల్సి ఉంటుంది కనుక. అందుకోసం 2015 నాటి బ్యాలెన్స్ షీట్నే చూస్తే... ఆ ఏడాది టవర్స్, మెటల్స్, యూనివర్సల్ ఈ మూడు సంస్థలూ కలిసి ఏకంగా రూ.11,510 కోట్ల టర్నోవరు నమోదు చేశాయి. అంటే ఇవి రూ.11 వేల కోట్లకుపైగా వ్యాపారం చేశాయి. ఇంత వ్యాపారంపై చిత్రంగా వాటికి రూ.7 కోట్ల నష్టం వచ్చింది. ఇక ఈ టర్నోవర్‌లో ట్రేడింగ్ ఆదాయంగా చూపించింది రూ.6,998 కోట్లు. ఈ ట్రేడింగ్ జరిగింది కూడా అనుబంధ కంపెనీల మధ్యే. అంటే కాగితాలపైనే. ఎందుకంటే ఈ ట్రేడింగ్ పరిమాణాన్ని చూపించి బ్యాంకుల నుంచి మరిన్ని రుణాలు పొందటానికి. ట్రేడ్ రిసీవబుల్స్... గోల్మాల్ నిజానికి ఈ ట్రేడ్ రిసీవబుల్స్ అనేదే పెద్ద గోల్మాల్. ఏ కంపెనీకైనా చేసే వ్యాపారంలో కొన్ని అరువుపై ఇవ్వాల్సి వస్తుంది, కొందరికి అడ్వాన్సులు చెల్లించాల్సి వస్తుందనేది కాదనలేం. కానీ ఇది కంపెనీ టర్నోవర్‌లో రెండు నెలల మొత్తానికి మించి ఉండకూడదు. విలువలో చూసినా 15 శాతానికి మించి ఉండకూడదు. కానీ సుజనా గ్రూపులో మాత్రం ఇది 10 నెలల టర్నోవరుకు సమానంగా... విలువలో దాదాపు 85–90 శాతంగా ఉంది. దీన్నిబట్టి గోల్మాల్ ఇక్కడే జరిగిందని తెలియటం లేదూ? విదేశీ కంపెనీలు... ఇన్వెస్ట్మెంట్లు సుజనా కంపెనీల ఖాతాలు చూస్తే... అనుబంధ కంపెనీల ద్వారా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు కనిపిస్తుంది. కానీ ఆ పెట్టుబడులు తీసుకున్న కంపెనీల కార్యకలాపాలు మాత్రం కనిపించవు. చివరికి అంత పెట్టుబడి తీసుకున్న కంపెనీలు కూడా నష్టాలు ప్రకటించటం... మెల్లగా వాటిని మూసేయటం... అంతా పద్ధతి ప్రకారం జరిగిపోతుంది. చివరికి ఆ డబ్బులు చేరాల్సిన వారికి చేరిపోతాయి. కార్పొరేట్ గ్యారంటీలు, ఎల్వోసీలు కూడా... బ్యాంకు రుణాలకే పరిమితం కాకుండా సుజనా గ్రూపు సంస్థలు పలు కార్పొరేట్ గ్యారంటీలను జారీ చేశాయి. బ్యాంకు గ్యారంటీలు, స్టాండ్ బై లెటర్ ఆఫ్ క్రెడిట్లు (ఎల్ఓసీ– నీరవ్ మోడీ పీఎన్బీని ముంచేసింది వీటి పేరిటే) కూడా పొందాయి. వీటి విలువ దాదాపు రూ.992 కోట్లు. దీంతో పాటు డాలర్లలో కూడా రూ.350 కోట్లకు సమానమైన గ్యారంటీలు జారీ చేశాయి. ఇవన్నీ కాక ఆదాయపు పన్ను శాఖ, ఎక్సైజ్, కస్టమ్స్ వంటి ప్రభుత్వ విభాగాలు సుజనా సంస్థలపై వేసిన కేసుల ఖరీదు రూ.962 కోట్లు. అంటే ఈ కేసుల్లో ఓడిపోతే ఇంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్న మాట. ఈ లెక్కన చూస్తే సుజనా కథ ఎన్ని వేల కోట్లతో ఆగుతుందన్నది ఈడీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బయటపెడితే తప్ప మానవమాత్రులెవరూ ఊహించటం కష్టం. కొన్ని అనుబంధం... కొన్ని సంబంధం అధికారికంగా సుజనా యూనివర్సల్, సుజనా మెటల్స్, సుజనా టవర్స్‌కు విదేశాల్లో కొన్ని అనుబంధ సంస్థలున్నాయి. ఇవి కాక బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కేమన్ ఐలాండ్స్, ఐల్ ఆఫ్ మ్యాన్ వంటి పన్ను స్వర్గాల్లోనూ తనకు ‘సంబంధించిన’ సంస్థలున్నాయి. సుజనా తండ్రి యలమంచిలి జనార్ధనరావు సింగపూర్ పర్మనెంట్ రెసిడెంట్ కనక అక్కడి కంపెనీలన్నీ ఆయన పేరిటే ఉన్నాయి. ఇతర దేశాల్లోని సంస్థల్ని మాత్రం పలువురు ‘సంబంధీకుల’ ద్వారా సుజనా నడిపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన సంస్థలివీ... విదేశీ కంపెనీలు (ఇన్‌ఛార్జులుగా ఉన్న వ్యక్తులు) బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ 1. బ్రిస్టోలా ఏసియా ఇంక్ – వై.జనార్ధనరావు 2. ఆడ్రాయిట్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ – వి.రమేష్ 3. లాండ్ఫోర్డ్ (ఏసియా) లిమిటెడ్ – వై.జనార్ధనరావు కేమన్ ఐలాండ్స్ 1. ఆల్ఫా వెంచర్స్ లిమిటెడ్ – హేమంత్ (ఎస్‌ఎంపీఎల్) 2. సన్ ట్రేడింగ్ లిమిటెడ్ – హేమంత్ (ఎస్‌యూఐఎల్) సెంట్రల్ అమెరికా 1. స్టార్‌లైన్ హోల్డింగ్స్ లిమిటెడ్ దుబాయ్ 1. సుజనా హోల్డింగ్స్ లిమిటెడ్ – రామ్ ఇది సుజనా యూనివర్సల్‌కు అనుబంధ సంస్థ. దీన్లో భారీ పెట్టుబడులు పెట్టినట్లు చూపించారు. హాంకాంగ్ 1. నాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ – వి.రమేష్ ఇది సుజనా యూనివర్సల్‌కు అనుబంధ సంస్థ. దీనికి స్టాండర్డ్ బ్యాంకు రుణమిచ్చింది. 2. డిజిటెక్ బిజినెస్ సిస్టమ్స్ లిమిటెడ్– వి.రమేష్ ఇది సుజనా టవర్స్ అనుబంధ సంస్థ. దీన్లో భారీ పెట్టుబడులున్నా పెట్టినట్లు చూపించారు. 3. ఏసియన్ టైడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ – వి.రమేష్ ఇది సుజనా మెటల్స్‌కు అనుబంధ సంస్థ. భారీ పెట్టుబడులు పెట్టినట్లు చూపించారు. 4. అసోసియేటెడ్ ఏసియా 5. ఇండ్చిన్ కార్పొరేషన్ – వి.రమేష్ 6. రైన్, హాంకాంగ్ – వి.రమేష్ 7. యునైటెడ్ ఇండస్ట్రియల్ గ్రూప్ – వి.రమేష్ ఐల్ ఆఫ్ మ్యాన్ 1. మ్యాగ్నమ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ – వి.రమేష్ మారిషస్ 1. హెస్టియా హోల్డింగ్స్ – హేమంత్ ఇది సుజనా యూనివర్సల్‌కు అనుబంధం. మారిషస్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుంది. 2. ఆప్టిమిక్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఇది సుజనా మెటల్స్‌కు చెందిన ఏసియన్ టైడ్ ఎంటర్‌ప్రైజెస్‌కు అనుబంధ సంస్థ. స్టాండర్డ్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుంది. 3. గ్లోబల్ వయొలెట్ లిమిటెడ్ 4. ఇంటిగ్రల్ ఏజెన్సీస్ లిమిటెడ్ 5. ఎస్టీఎల్ ఆఫ్రికా లిమిటెడ్ – సుజనా టవర్స్ ఉద్యోగుల పేరిట ఉంది. 6. టెలీ సూపర్కాన్ లిమిటెడ్ – – సుజనా టవర్స్ ఉద్యోగుల పేరిట ఉంది. 7. సెలీన్ హోల్డింగ్స్ లిమిటెడ్ – హేమంత్ ఇది స్టాండర్డ్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుంది. సింగపూర్ 1. పీఏసీ వెంచర్స్ పీటీఈ లిమిటెడ్ – వై.జనార్ధనరావు ఇది సుజనా యూనివర్సల్‌కు అనుబంధం. ఎగ్జిమ్ బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. 2. అపైస్ వెంచర్స్ పీటీఈ లిమిటెడ్ – వై.జనార్ధనరావు 3. అర్ష సొల్యూషన్స్ పీటీఈ లిమిటెడ్ – వై.జనార్ధనరావు 4. ఎవర్గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్ 5. ఫోస్టర్ వెంచర్స్ పీటీఈ లిమిటెడ్ – వై.జనార్ధనరావు ఇది ఫోస్టర్ ఇన్‌ఫిన్‌కు అనుబంధ సంస్థ. 6. గామా మెర్షినరీ అండ్ ఎక్విప్మెంట్ పీటీఈ లిమిటెడ్ – వై.జనార్ధనరావు ఇది కూడా ఫోస్టర్ ఇన్‌ఫిన్‌కు అనుబంధమే. 7. ఇన్ఫ్రా ఏసియా ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్ – వై.జనార్ధనరావు 8. మంటన్ రిసోర్సెస్ పీటీఈ లిమిటెడ్ – వై.జనార్ధనరావు 9. యలమంచిలి వెంచర్స్ పీటీఈ లిమిటెడ్ – వై.జనార్ధనరావు 10. సన్ గ్లోబల్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్ – హేమంత్ ఇది సుజనా యూనివర్సల్‌కు చెందిన సన్ ట్రేడింగ్‌కు అనుబంధ సంస్థ. సీషెల్స్ 1. మైక్రోపార్ట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 2. ఏసియా పసిఫిక్ వెంచర్స్ లిమిటెడ్ యూఏఈ 1. ఎంపైర్ గల్ఫ్ ఎఫ్జెడ్ఈ – రామ్ ఇది సుజనా యూనివర్సల్‌కు అనుబంధ సంస్థ. 2. మ్యాక్స్ అరేబియన్ ఎఫ్జెడ్ఈ – రామ్ 3. పాన్ అరేబియన్ ఇంటర్నేషనల్ ఎఫ్జెడ్ఈ – రామ్ 4. ప్రాస్పరిటీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్జెడ్ఈ – రామ్ 5. సుప్రీమ్ ఇంటర్నేషనల్ ఎఫ్జెడ్ఈ – రామ్ -
బ్యాంకులకు కుచ్చుటోపీ: సుజనాకు ఈడీ షాక్..
సాక్షి, హైదరాబాద్ : బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరి చుట్టు ఉచ్చు బిగుస్తోంది. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం దాడులు నిర్వహించింది. ఈ నెల 27న తమ విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. సుజనా చౌదరి మొత్తం 120 డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 5,700 కోట్లు కొల్లగొట్టారని ఈడీ వెల్లడించింది. ఇప్పటికే సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. పలు విడతలుగా సుజనా కార్యాలయాలపై ఈడీ, సీబీఐ దాడులు జరిపింది. టీడీపీకి ఆర్థిక వనరుగా పేరొందిన సుజనా నిన్నమొన్నటివరకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఆయనపై ఇప్పటికే డీఆర్ఐ, ఫెమా, సీబీఐ కేసులు ఉన్నాయి. సుజనాకు బినామీ పేర్లతో ఉన్న ఫెరారీ, రేంజ్ రోవర్, బెంజ్ తదితర ఆరు కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున హిల్స్‌లో ఉన్న సుజనా కంపెనీపై శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈడీ తనిఖీలు కొనసాగాయి. గత అక్టోబర్‌లోనూ ఆయన కంపెనీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి.. సుజనా చౌదరి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన కంపెనీ ఉద్యోగులను డైరెక్టర్లుగా పెట్టి.. షెల్ కంపెనీలు ఆయన ప్రారంభించినట్టు తెలుస్తోంది. గంగా స్టీల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేటు లిమిటెడ్, భాగ్యనగర్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేటు లిమిటెడ్, తేజస్విని ఇంజినీరింగ్ ప్రైవేటు లిమిటెడ్, ఫ్యూచర్ టెక్ ఇండస్ట్రీస్ తదితర డొల్ల కంపెనీలకు ఆయన పెద్ద ఎత్తున డబ్బు తరలించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండానే.. కేవలం రశీదుల రూపంలో భారీగా డబ్బుగా మళ్లించినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై 2016 ఫిబ్రవరిలోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో 2017 ఫిబ్రవరి, 2018 జులైలో మరోసారి ఎఫ్ఐఆర్లు దాఖలు చేసింది. గత అక్టోబర్‌లో ఈ కేసులకు సంబంధించి ఈడీ సోదాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున హార్డ్‌డిస్క్‌లు, ఫైల్స్‌తోపాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇక, మూడు బ్యాంకుల నుంచి రూ. 304 కోట్ల రూపాయల రుణం తీసుకొని.. వాటిని దుర్వినియోగపరిచినట్టు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఆంధ్రా బ్యాంకు నుంచి రూ. 304 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ. 120 కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుంచి రూ. 124 కోట్లు సుజనా అప్పుగా తీసుకొని.. చాలావరకు నిధులను డొల్ల కంపెనీలకు తరలించారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లోనూ ఈ విషయం తేటతెల్లమైంది. ఆయన బినామీ కంపెనీలు కేవలం రశీదులు రూపొందించి డబ్బు తరలించుకుపోయినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. గత మూడేళ్లుగా సాగుతున్న ఈ విచారణ ప్రస్తుతం కీలకదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈడీ చేసిన సోదాల్లోనూ పెద్ద ఎత్తున డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
మారిషస్ బ్యాంకులో అప్పు తీసుకోలేదు
కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడి సాక్షి,హైదరాబాద్: మారిషస్ బ్యాంకులో తాను అప్పు తీసుకోలేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. కోర్టు నుంచి అరెస్టు వారెంటు జారీ అయిన నేపథ్యంలో శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. వేరే కంపెనీకి తమ కంపెనీ కార్పోరేట్ గ్యారంటీ మాత్రమే ఇచ్చిందని, తాను వ్యక్తిగతంగా గ్యారంటీ ఇవ్వలేదన్నారు. తనకున్న ఒత్తిడి ప్రకారం..తమ లీగల్ కౌన్సిల్ సలహా మేరకు కోర్టు తనకు మినాహాయింపు ఇవ్వాలని కోరానని, అయినా వారంట్ ఇష్యూ చేశారని చెప్పారు. తాను సుజనా గ్రూప్‌కు వ్యవస్థాపకుడిని మాత్రమేనని, 2010 వరకు దానికి చైర్మన్‌గా ఉన్నానని చెప్పారు. 2010 నుంచి 2014 వరకు అందులో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నాని చెప్పారు. 2012లో అప్పు తీసుకున్నారని, 2014లో డిఫాల్ట్ అయ్యారని తెలిసిందన్నారు. ఆఫ్రికాకు చెందిన కంపెనీలో తా ను డెరైక్టర్ని కూడా కాదని, అందులో తనకు ఒక శాతం కంటే తక్కువ వాటా మాత్రమే ఉందని చెప్పారు. ఆ కంపెనీ అప్పు తీసుకున్న మాట వాస్తవమేనని, వ్యాపారంలో నష్టం వచ్చింది కాబట్టి కట్టలేకపోతున్నామని తెల్పారన్నారు. బ్యాంక్ లోన్ ఎప్పుడు కట్టాలో కంపెనీ బోర్డు చూసుకుంటుందని, తన దృష్టిలో ఇది చాలా చిన్న విషయమన్నారు. దీని వల్ల తన రాజకీయ భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదన్నారు. తన రాజ్యసభ పదవి పార్టీ అవసరాన్ని బట్టి అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని, దానికి కట్టుబడి ఉంటామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. -
వ్యాపారం అన్నాక కింద, మీద అవుతుంది: సుజనా
వ్యాపారం అన్నాక కింద, మీద అవుతుందని... లాభనష్టాలు సర్వ సాధారణమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. కోర్టు నుంచి ఆయనకు అరెస్టు వారంటు జారీ అయిన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తాను సుజనా గ్రూపు వ్యవస్థాపకుడిని మాత్రమేనని, 2010 వరకు దానికి చైర్మన్‌గా ఉన్నానని చెప్పారు. 2010 నుంచి 2014 వరకు అందులో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నాని అన్నారు. 2012లో అప్పు తీసుకున్నారని, 2014లో డిఫాల్ట్ అయ్యారని తెలిసిందన్నారు. ఇక మారిషస్ బ్యాంకులో తాను అప్పు తీసుకోలేదని, తమ కంపెనీ గ్యారంటీ కింద మాత్రమే ఉందని చెప్పారు. తాను వ్యక్తిగతంగా కూడా గ్యారంటీ ఇవ్వలేదన్నారు. పైగా ప్రస్తుతం తనకు ఆ కంపెనీలో 1 శాతం కంటే తక్కువ షేర్ ఉందని చెప్పారు. వాళ్లు డబ్బు తీసుకున్న మాట వాస్తవమేనని, వ్యాపారంలో నష్టం వచ్చింది కాబట్టి కట్టలేకపోతున్నారని తెలిపారు. మోసం చేయాల్సిన అవసరం, చేసే అవకాశం కూడా లేవని ఆయన అన్నారు. వేరే కంపెనీకి తమ కంపెనీ ష్యూరిటీగా మాత్రమే ఉందన్నారు. ఈ విషయంలో కూడా తమ పార్టీ అధినేత సూచనల మేరకే నడుచుకుంటానని సుజనా చౌదరి అన్నారు. పార్టీ అవసరాన్ని బట్టి రాజ్యసభ అవకాశం ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబే నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.