మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ప్రహ్లాద్
సంగారెడ్డి మున్సిపాలిటీ: మున్సిపల్ ఉద్యోగులను సస్పెండ్ చేసే అధికారం ఇతర శాఖల అధికారులకు లేదని మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రహ్లాద్ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపాల్టీలో నిధులు దుర్వినియోగమయ్యాయనే ఆరోపణపై కమిషనర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించడాన్ని ఆయన తప్పుబట్టారు.
అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, స్పెషల్ ఆడిట్ నిర్వహించాకే చర్యలు చేపట్టాలన్నారు. ఇన్‌చార్‌జలుగా పనిచేసిన శరభలింగం, వీణాకుమారి కేవలం 15 రోజులు మాత్రమే ఇంచార్‌జలుగా ఉన్నారని అంత తక్కువ సమయంలో ఎలా అవినీతికి పాల్పడతారన్నారు. ఉద్యోగులు ప్రజాప్రతినిధుల వత్తిడికి లొంగవద్దని సూచించారు. ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు సిబ్బందిని సరెండర్ చేసే అధికారం లేదని కేవలం కమిషనర్‌కు మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాబేర్‌అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రావు, కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.
సస్పెండ్ చేసే అధికారం వారికి లేదు
Published Sun, Dec 21 2014 10:38 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM
Advertisement