Prahalad
-
వేములవాడలో ప్రధాని సోదరుడు
వేములవాడ: భాతర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ శుక్రవారం రాత్రి వేములవాడ చేరుకున్నారు. ఆయన శనివారం ఉదయం 6.30 గంటలకు రాజన్నను దర్శించుకోనున్నారు. ప్రహ్లాద్ మోదీకి వేములవాడ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాపరామకృష్ణ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. -
రిజిస్ట్రేషనే లేదు.. సస్పెండ్ ఎలా చేస్తారు?
టీజేఏసీ నుంచి తొలగించడంపై పిట్టల రవీందర్, ప్రహ్లాద్ ప్రశ్న హైదరాబాద్: టీజేఏసీ ఎన్నికల సంఘం వద్దనో, ప్రభుత్వం వద్దనో రిజిస్టర్ అయినది కాదని, అటువంటి సంస్థ నుంచి తమనెలా సస్పెండ్ చేస్తారని పిట్టల రవీందర్, ప్రహ్లాద్ ప్రశ్నించారు. అధికార పార్టీకో, ఇంకొ కరికో అమ్ముడుపోయేవారమైతే గత రెండున్నరేళ్లలో జేఏసీలో ఎలా కొనసాగుతామన్నారు. తమపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని టీజేఏసీ చైర్మన్ కోదండరాం మానుకోవాలన్నారు. ఆయన అహంకార ధోరణి తమను బాధించిందన్నారు. జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ఉద్యమ స్ఫూర్తిని కోదండరాం మంటగలుపుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యను పక్కనపెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిరుద్యోగుల ర్యాలీని ఉపయోగిం చుకున్నారన్నారు. బుధ వారం తన్వీర్ సుల్తానాతో కలసి వారు మీడియాతో మాట్లాడారు. జేఏసీ నుంచి తనను, ప్రహ్లాద్‌ను బహిష్కరించడం పట్ల రవీందర్ విస్మయం వ్యక్తంచేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. జేఏసీలో అసలు రాజకీయాలే మాట్లాడవద్దన్న కోదండరాం ఇప్పు డు పార్టీగా అవతరిస్తే తప్పేంటన్న వైఖరితో మాట్లాడుతు న్నారన్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను ఎందుకు కలుస్తున్నారో... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారో లేదో కోదండరాం చెప్పాలన్నారు. తన్వీర్ సుల్తానా మాట్లాడుతూ జేఏసీలో ఉన్న ఏకైక మహిళను తానేనని, సమావేశాల్లో కనీస మర్యాద కూడా ఇవ్వకుండా తనను అవమానించారని ఆరోపించారు. -
సస్పెండ్ చేసే అధికారం వారికి లేదు
మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ప్రహ్లాద్ సంగారెడ్డి మున్సిపాలిటీ: మున్సిపల్ ఉద్యోగులను సస్పెండ్ చేసే అధికారం ఇతర శాఖల అధికారులకు లేదని మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రహ్లాద్ స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపాల్టీలో నిధులు దుర్వినియోగమయ్యాయనే ఆరోపణపై కమిషనర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించడాన్ని ఆయన తప్పుబట్టారు. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, స్పెషల్ ఆడిట్ నిర్వహించాకే చర్యలు చేపట్టాలన్నారు. ఇన్చార్జలుగా పనిచేసిన శరభలింగం, వీణాకుమారి కేవలం 15 రోజులు మాత్రమే ఇంచార్జలుగా ఉన్నారని అంత తక్కువ సమయంలో ఎలా అవినీతికి పాల్పడతారన్నారు. ఉద్యోగులు ప్రజాప్రతినిధుల వత్తిడికి లొంగవద్దని సూచించారు. ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు సిబ్బందిని సరెండర్ చేసే అధికారం లేదని కేవలం కమిషనర్‌కు మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాబేర్‌అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు, కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.