రిజిస్ట్రేషనే లేదు.. సస్పెండ్‌ ఎలా చేస్తారు? | Registration is not how to be suspended? | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషనే లేదు.. సస్పెండ్‌ ఎలా చేస్తారు?

Published Thu, Mar 9 2017 5:01 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రిజిస్ట్రేషనే లేదు.. సస్పెండ్‌ ఎలా చేస్తారు? - Sakshi

రిజిస్ట్రేషనే లేదు.. సస్పెండ్‌ ఎలా చేస్తారు?

టీజేఏసీ నుంచి తొలగించడంపై పిట్టల రవీందర్, ప్రహ్లాద్‌ ప్రశ్న  
హైదరాబాద్‌: టీజేఏసీ ఎన్నికల సంఘం వద్దనో, ప్రభుత్వం వద్దనో రిజిస్టర్‌ అయినది కాదని, అటువంటి సంస్థ నుంచి తమనెలా సస్పెండ్‌ చేస్తారని పిట్టల రవీందర్, ప్రహ్లాద్‌ ప్రశ్నించారు. అధికార పార్టీకో, ఇంకొ కరికో అమ్ముడుపోయేవారమైతే గత రెండున్నరేళ్లలో జేఏసీలో ఎలా కొనసాగుతామన్నారు. తమపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం మానుకోవాలన్నారు. ఆయన అహంకార ధోరణి తమను బాధించిందన్నారు. జేఏసీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ఉద్యమ స్ఫూర్తిని కోదండరాం మంటగలుపుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యను పక్కనపెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిరుద్యోగుల ర్యాలీని ఉపయోగిం చుకున్నారన్నారు. బుధ వారం తన్వీర్‌ సుల్తానాతో కలసి వారు మీడియాతో మాట్లాడారు.

జేఏసీ నుంచి తనను, ప్రహ్లాద్‌ను బహిష్కరించడం పట్ల రవీందర్‌ విస్మయం వ్యక్తంచేశారు. త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. జేఏసీలో అసలు రాజకీయాలే మాట్లాడవద్దన్న కోదండరాం ఇప్పు డు పార్టీగా అవతరిస్తే తప్పేంటన్న వైఖరితో మాట్లాడుతు న్నారన్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలను ఎందుకు కలుస్తున్నారో... కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారో లేదో కోదండరాం చెప్పాలన్నారు. తన్వీర్‌ సుల్తానా మాట్లాడుతూ జేఏసీలో ఉన్న ఏకైక మహిళను తానేనని, సమావేశాల్లో కనీస మర్యాద కూడా ఇవ్వకుండా తనను అవమానించారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement