
సాక్షి, హైదరాబాద్: ప్రగతి పథంలో పయనిస్తూ ఆదర్శంగా నిలిచిన మూడు గ్రామాలను ఉత్తమ గ్రామ పంచాయతీలుగా కేంద్ర ప్రభుత్వం ఎం పిక చేసింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తుల్లాపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం పంచాయతీలను ‘నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ పురస్కార్’కింద అవార్డులకు ఎంపిక చేసింది. శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని పలు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు గ్రామాల్లో తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే డ్రోన్‌ల సహకారంతో ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ‘స్వమిత్వ’ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు.
పల్లెసీమలకు పెద్దపీట: ఎర్రబెల్లి
గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామీణ సంస్థల ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment