ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొన్ని స్టేషన్లలో కూర్చునేందుకు బెంచీలు కూడా లేవు. ఇక మరుగుదొడ్ల గురించి చెప్పనలవే కాదు. దక్షిణ మధ్యరైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ పగిడిపల్లి– నడికుడి– గుంటూరు జిల్లా మధ్యలోని పలు స్టేషన్లను గురువారం పరిశీలించనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలు స్టేషన్లలో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్
శిథిలావస్థలో క్వార్టర్లు
వలిగొండ :వలిగొండ రైల్వేస్టేష న్‌లో అన్ని రైళ్లూ ఆపాలనేది మండల ప్రజల డిమాండ్. ఇక్కడ రేపల్లే, పుష్‌పుల్ రైళ్లు మాత్రమే ఆపుతున్నారు. ఈ స్టేషన్‌లో కనీస వసతులు కరువయ్యాయి. క్వార్టర్లు, మూత్రశాలలు శిథిలావస్థకు చేరాయి. నీటి ట్యాంక్ కూలిపోయింది. డ్రమ్ములు ఏర్పాటు చేసి నీటిని అందిస్తున్నారు.
దశాబ్దాలుగా ప్రయాణికుల అవస్థలు
దామరచర్ల: దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్‌లో వసతులు లేక ప్రయాణికులు దశాబ్దాలుగా అవస్థలు పడుతున్నారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న నీటి ట్యాంక్ పనిచేయక పోవడంతో ప్రయాణికులు తాగునీటిని కొనుగోలు చేసి దాహం తీర్చుకునే దుస్థితి ఏర్పడింది. ఈ స్టేషన్‌లో క్యాంటీన్ సౌకర్యం కూడా లేదు. రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో వీధిదీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రయాణికులకు నరకప్రాయంగా మారుతోంది. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
అదనపు ప్లాట్‌ఫాం నిర్మించరూ..
రామన్నపేట:రామన్నపేట రైల్వేస్టేషన్‌లో అదనపుఫ్లాట్‌పాం నిర్మించాలని ప్రయాణికులు ఎన్నోఏళ్లుగా కోరుతున్నారు. రైళ్లు క్రాసింగ్ అయ్యే సమయంలో ప్రస్తుతమున్న ప్లాట్‌ఫాం దిగి కంకరగుండా నడిచి హాల్ట్ అయిన రైలును ఎక్కడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైల్వేస్టేషన్‌లో నారాయణాద్రి, పలక్‌నుమా జన్మభూమి సూపర్‌పాస్ట్‌రైళ్లు, కాచిగూడ, రేపల్లే ప్యాసింజర్‌రైళ్లు ఆగుతాయి. డెల్టా ప్యాసింజర్‌రైలు రాత్రి హైదరాబాద్ నుంచి గుంటూరువైపు వెళ్లేటప్పుడు మాత్రమే రామన్నపేట స్టేషన్‌లో ఆగుతుంది. పలక్‌నుమా, జన్మ«భూమి ప్యాసింజర్‌రైళ్లు వారంలో నాలుగైదుసార్లు రామన్నపేటలో క్రాసింగ్ అవుతాయి. వీటిలో ఒకటిమాత్రమే ప్లాట్‌ఫామ్ మీదకు వస్తుంది. మరోదానిని ప్రయాణికులు లగేజీతోసహా మీటరు దిగువన ఉన్న ఫ్లాట్‌ఫామ్‌ను దిగి కంకరగుండా నడిచి ఎక్కవలసి వస్తోంది. వృద్ధులు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్ రెండోవైపున కూడా ప్లాట్‌ఫాం నిర్మించి పూట్‌ఓవర్ బ్రిడ్జీలను ఏర్పాటు చేయడమే సమస్యకు శాశ్వత పరిష్కారం. ఈ స్టేషన్‌లో మౌలిక వసతులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
దశాబ్దాలుగా ప్రయాణికుల అవస్థలు
దామరచర్ల: దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్‌లో వసతులు లేక ప్రయాణికులు దశాబ్దాలుగా అవస్థలు పడుతున్నారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న నీటి ట్యాంక్ పనిచేయక పోవడంతో ప్రయాణికులు తాగునీటిని కొనుగోలు చేసి దాహం తీర్చుకునే దుస్థితి ఏర్పడింది. ఈ స్టేషన్‌లో క్యాంటీన్ సౌకర్యం కూడా లేదు. రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో వీధిదీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రయాణికులకు నరకప్రాయంగా మారుతోంది. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
రైల్వేస్టేషన్లలో సమస్యల తిష్ట
Published Thu, Mar 16 2017 4:06 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement