అభివృద్ధి పేరుతో అణచివేస్తే ఎలా?
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన కోదండరాం
సమైక్య రాష్ట్రంలో ఉన్నట్లుగానే ఇప్పుడూ ఉంటే ఎట్లా?
త్యాగాలు చేయక తప్పదనడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో ఉన్న ట్టుగానే ఇప్పుడు కూడా కొందరిని పట్టించుకో కుంటే ఎట్లాగని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం ప్రభుత్వాన్ని నిలదీశారు. అభివృద్ధి కోసం కొందరు త్యాగాలు చేయక తప్పదని ప్రభుత్వం చెప్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు. త్యాగం చేస్తున్నవారి పట్ల ప్రభుత్వం కూడా త్యాగం చేయాలనే బుద్ధితో, మానవతా కోణంలో ఆలోచించాలని సూచించారు. త్యాగం చేసేవారి పట్ల ప్రభు త్వానికి బాధ్యత ఉందని గుర్తు చేశారు. గురువారం జేఏసీ ముఖ్యనేతలు పిట్టల రవీం దర్, ఇటిక్యాల పురుషోత్తం, నల్లపు ప్రహ్లాద్, వెంకటరెడ్డి, ఖాజా మొయిను ద్దీన్‌లతో కలిసి కోదండరాం విలేకరులతో మాట్లాడారు. ‘‘నిర్వాసితుల పట్ల ప్రభుత్వానికి కనీస సాను భూతి ఉండనవసరం లేదా? బాధ్యత ప్రభుత్వానికి లేదా? భూములు కోల్పోయి, బతుకుదెరువు కోల్పోయినవారిని అభివృద్ధి పేరుతో అణచివేయడం సరికాదు. అందరికీ న్యాయం జరిగే విధంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది..’’ అని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ తీరు సరికాదు...
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, అభివృద్ధిలో భాగస్వామ్యం లేదని మాట్లాడిన విషయాన్ని కోదండరాం గుర్తు చేశారు. ‘‘మీ ప్రయోజనాలు తప్ప తెలంగాణ ప్రయోజనాలు పట్టవా అని సమైక్య పాలకులను ప్రశ్నించాం. ఇప్పుడు కూడా అదే కొనసాగితే ఎట్లా..? అభివృద్ధిలో నిర్వాసితులను పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లడం సరికాదు.. సంపద పెరగడం ఒక్కటే కాదు.. పెరిగిన సంపదను ఎలా పంపిణీ చేస్తారనేదీ ప్రధాన మే’’ అన్నారు. కొందరి అభివృద్ధి కోసం మరికొందరు త్యాగం చేయాలని నిర్బంధించే ఆలోచన సరికాదని.. అది అభివృద్ధికి అవరో« దాలు సృష్టిస్తుందన్నారు. అభివృద్ధి పేరిట తీసుకుంటున్న చర్యలపై సమీక్షించుకుంటే చాలా అంశాలు అర్థమవుతాయన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి
నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన కారణంగా కార్మికులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని.. కార్మికులకు 13 నెలల వేతన బకాయిలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోదండరాం కోరారు. నిజాం షుగర్స్‌లో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని, ఆ ఫ్యాక్టరీని తెరిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందని చెప్పారు. ఇక సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరం టూ అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన వాదన తప్పని... సింగరేణిలో కాంట్రాక్టు పద్ధతిన ఇంకా కార్మికులు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. సింగరేణిలో ఓపెన్ కాస్టులపై త్వరలోనే సదస్సును నిర్వహి స్తామని చెప్పారు. ఓపెన్ కాస్టుల వల్ల తీవ్ర ఇబ్బం దులున్నాయని.. పర్యావరణ అసమ తుల్యం వంటి సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఓపెన్‌కాస్టుల పద్ధతిని సమీక్షించుకోవాలని సూచించారు. ముస్లిం రిజర్వేషన్లపై సుధీర్ కమిటీ సిఫా ర్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సమస్యలపై త్వరలోనే విద్యాయాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. భూసేకరణ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సవరణలను ఆమో దించవద్దంటూ రాష్ట్రపతిని కలుస్తామని టీజేఏసీ కన్వీనర్ పిట్టల రవీందర్ తెలిపారు. సింగరేణిలో ఓపెన్‌కాస్టులు ఉండవని చెప్పిన సీఎం కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక కొత్తగా ఓపెన్ కాస్టులు వస్తాయని చెప్పడం దారు ణమని వ్యాఖ్యానించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈ నెల 16న సదస్సును నిర్వహిస్తున్న ట్టుగా ఖాజా మొయినుద్దీన్ వెల్లడించారు.