ఏకేబీఆర్ గేట్లకు మరమ్మతులేవీ? | to kbr gate repair where? | Sakshi
Sakshi News home page

ఏకేబీఆర్ గేట్లకు మరమ్మతులేవీ?

Published Tue, May 13 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM

ఏకేబీఆర్ గేట్లకు మరమ్మతులేవీ?

ఏకేబీఆర్ గేట్లకు మరమ్మతులేవీ?

హెడ్‌రెగ్యులేటర్ గేట్లకు రబ్బర్‌సీళ్లు అరిగిపోయి భారీగా లీకేజీలు
- ఆనకట్టపై పూర్తిగా తొలగించని చెట్లు
- పట్టింపులేని ప్రాజెక్టు అధికారులు
 
 పెద్ద అడిశర్లపల్లి, న్యూస్‌లైన్ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఏకేబీఆర్) అధికారుల నిర్లక్ష్యంతో కునారిల్లుతోంది. హెడ్‌రెగ్యులేటర్‌కు ఏర్పాటు చేసిన షట్టర్లకు రబ్బరుసీళ్లు అరిగి పోయాయి. వాటికి కొత్తవి బిగించలేదు. దీంతో గేట్లు ఎత్తకుండానే సందుల్లోంచి భారీగా  ప్రధానకాల్వలోకి నీళ్లు లీకవుతున్నాయి. నీటి విడుదల క్రమబద్ధీకరణ లేకుండానే నీటి విడుదల జరుగుతోంది. గేట్ల నిర్వహణ నుడివిజన్-4 అధికారులు ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టు ఇచ్చారు. వారు బిల్లులు డ్రా చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యతను నిర్వహణకు ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

ఏకేబీఆర్ గేట్లు పూర్తిగా మూసివేసి ప్రధానకాల్వకు నీటి విడుదల నిలిపివేయడం సాధ్యం కావడం లేదు. గత మార్చి 29న అక్కంపల్లికి చెందిన చెందిన తల్లీకొడుకులు రిజర్వాయర్‌లో బట్టలు ఉతకడానికి వెళ్లి నీళ్లలోపడిపోయిన సమయంలో గేట్లను మూయడానికి అధికారులకు సాధ్యపడలేదు. నీటి విడుదల జరుగుతుం డగా మృతదేహాలను వెతకడం కష్టసాధ్యమైంది. కాల్వలకు మరమ్మతుల సమయంలోనూ  నీటి విడుదల ఆపివేయలేకపోతున్నారు.

జంటనగరాలకు కోదండపురం ప్లాంటులో శుద్ధిచేసేందుకు ప్రతిరోజూ 350 క్యూసెక్కులు లీకేజీల నీటినే వాడుతున్నారు. రబ్బర్‌సీల్ బిగించి నీటి విడుదల క్రమబద్ధీకరించని పక్షంలో గేట్లు ఆపరేటింగ్ చేయడం భవిష్యత్తులో ఇబ్బందికరమే. ప్రమాదకర పరిస్థితుల్లో పూర్తిగా ఏకేబీఆర్ నుంచి నీటివిడుదల  ఆపివేయడం సాధ్యంకాదు. అలాగే ఆనకట్టపై కంపచెట్లు పెరిగిపోతున్నా అధికారులు తొలగించడానికి చర్య లు తీసుకోవడంలేదు. రిజర్వాయర్ రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్య త ఇచ్చి పటిష్టతకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement