మంచిర్యాల సిటీ (ఆదిలాబాద్) : సింగరేణిలో సంక్షేమ అధికారుల(వెల్ఫేర్ ఆఫీసర్) పోస్టుల భర్తీకి నేడు యాజమాన్యం పరీక్ష నిర్వహించనుంది. కంపెనీ పరిధిలోని మూడు రీజియన్లలో కలిపి ఖాళీగా ఉన్న 23 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం సంస్థలో పనిచేస్తున్న వారే దరఖాస్తు చేసుకోవడానికి ప్రధాన అర్హతగా పేర్కొంది. గని సంక్షేమ అధికారులుగా ఉన్నతమైన ఉద్యో గం కావడంతో ఆశించిన మేరకు వేతనం, సకల సౌకర్యాలు ఉంటా యి.
దీంతో సర్వీసులో ఉన్న ఉద్యోగులు ఈ పోస్టు దక్కించుకోడానికి ఆశపడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వారు పైరవీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ప్రధాన కార్మిక సంఘాలకు చెందిన ముగ్గురు ముఖ్య నాయకులతో పాటు కోల్‌బెల్ట్‌లోని అధికార పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. సింగరేణి డెరైక్టర్ల స్థాయిలో సైతం పలువరు ఉన్నతాధికారులు పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే అదనుగా ద్వితీయ శ్రేణి నాయకులు పనిచేసిపెడుతామంటూ భారీస్థాయిలో డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
ఒక్కో పోస్టు రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సగం డబ్బు ముట్టజెప్పినట్లు తెలుస్తోం ది. పైరవీల ప్రచారం జోరందుకోవడంతో ప్రతిభగల కార్మికులు, ఉ ద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. అవినీతికి తావులేకుం డా పరిపాలన ఉంటుందని ప్రకటించిన సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని అర్హులకు న్యాయం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
అంగట్లో ‘వెల్ఫేర్’ పోస్టులు
Published Sun, Nov 23 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement
Advertisement