నేటినుంచి ‘సదరమ్’ | today from sadaram camp | Sakshi
Sakshi News home page

నేటినుంచి ‘సదరమ్’

Published Mon, Dec 22 2014 11:46 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

నేటినుంచి ‘సదరమ్’ - Sakshi

నేటినుంచి ‘సదరమ్’

తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో నిర్వహణ
మండలాల వారీగా తేదీలు ఖరారు
తాండూరు రూరల్: మళ్లీ సదరమ్ క్యాంపు నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం నుంచి ఫిబ్రవరి 21 వరకు తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో శిబిరం నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల సదరమ్ క్యాంపులు ఎత్తివేయడంతో జిల్లాలోని పలుచోట్ల వికలాంగులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నెల 18న వివిధ మండలాల నుంచి భారీగా తాండూరులోని జిల్లా ఆస్పత్రికి వచ్చిన వికలాంగులు సదరమ్ క్యాంపు ఎత్తివేశారని తెలుసుకుని ధర్నాకు దిగారు. ఆగ్రహంతో ర్యాలీగా వెళ్లి మంత్రి మహేందర్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ నేపథ్యంలో అధికారులు సదరమ్ క్యాంపును తిరిగి నిర్వహించాలని మండలాల వారీగా తేదీలను ఖరారు చేశారు.
 
శారీరక వైకల్యం, అంధులు, చెవుడు, మూగ వారికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సదరమ్ ఇన్‌చార్జి బాలకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన మరికొన్ని విషయాలు..
ఈ నెల 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 21 వరకు క్యాంపు కొనసాగుతుంది.
సదరం క్యాంపునకు వచ్చే వికలాంగులు ఆయా మండలాల్లోని ఐకేపీ సిబ్బంది వద్ద టోకెన్ తీసుకుని రావాలి.
టోకెన్‌పై ఎంవీఎస్ ముద్రతోపాటు సీసీ సంతకం తప్పనిసరి.  
గతంలో వికలాంగత్వ సర్టిఫికెట్లు ఉన్నవారు క్యాంపునకు రావొద్దు.
కేటాయించిన తేదీల్లో మాత్రమే ఆయా మండలాలకు చెందిన వారు క్యాంపునకు హాజరుకావాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement