సాక్షి, మంచిర్యాల : మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో నామినేషన్ల దాఖలు ఊపందుకుంది. ఆయా పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసి బీ-ఫారాలు అందజేయడంతో గురువారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు శుక్రవారమే చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇదీ కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకే నామినేషన్లు తీసుకుంటారు. ఇప్పటివరకు 731 నామినేషన్లు దాఖలు కాగా 1,978 దరఖాస్తులు అమ్ముడుపోయాయి.
శుక్రవా రం చివరిరోజు కావడంతో బీ-ఫారాలు దక్కించుకున్న అభ్యర్థులతోపాటు అ సంతృప్తుల ఇండిపెండెట్లుగా ఆయా మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేసే అవకాశం ఉంది. కాగా, శనివారం పరిశీలన ఉండగా, మార్చి 18న ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు బరిలో నిలిచ్చే అభ్యర్థులను అధికారులు ప్రకటిస్తారు.
త్వరపడండి!
Published Fri, Mar 14 2014 12:29 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement