సిద్దిపేట రూరల్: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి గాను ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న ఎంట్రెన్‌స టెస్ట్ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని 26 మోడల్ స్కూళ్లలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల మంది ఈ పరీక్ష రాయనున్నారు.
అభ్యర్థులను గంట ముందు నుంచే లోనికి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని మోడల్ స్కూల్ డిప్యూటీ కన్వీనర్ భాస్కర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆయా కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు వీలుగా ఫర్నిచర్ అందుబాటులో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
సిద్దిపేట పాత బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు...
సిద్దిపేట మండలం ఇర్కోడ్ మోడల్ స్కూల్‌లో పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగరాజు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే వారి కోసం స్థానిక పాత బస్టాండ్‌లో రెండు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఇర్కోడ్‌లో 368 మంది అర్హత పరీక్ష రాయనున్నట్టు ఆయన చెప్పారు.
నేడు మోడల్ స్కూల్ ఎంట్రెన్స్
Published Sat, Jun 13 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM
Advertisement
Advertisement