నేడు, రేపు భారీ వర్షాలు | Today, tomorrow is heavy rains | Sakshi
Sakshi News home page

నేడు, రేపు భారీ వర్షాలు

Published Mon, Jul 17 2017 2:11 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

నేడు, రేపు భారీ వర్షాలు

నేడు, రేపు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం
► వాతావరణ కేంద్రం వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: వాయవ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, వచ్చే రెండు రోజుల్లో ఇది మరింత బలపడుతుం దని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపిం ది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురు స్తాయని వెల్లడించింది. ఆ తర్వాత రెండ్రోజు లు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంది. 18వ తేదీన కోస్తాంధ్రకు ఆనుకుని ఉన్న.. తెలం గాణలోని కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు (20 సెంటీమీటర్ల వరకు) కురిసే అవకాశ ముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపిం ది.

అల్పపీడన ప్రభావంతో కురిసే భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణం కంటే 12 శాతం అధిక వర్షపాతం నమోదైనా వరదలు రాక పోవడంతో ఎక్కడా జలాశయాలు, చెరువులు, కుంటలు నిండలేదు. జూన్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణంగా కురవా ల్సిన వర్షం 245.5 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటి వరకు 275.8 మి.మీ. నమోదైంది.

మణుగూరులో 7 సెంటీమీటర్ల వర్షం...
గత 24గంటల్లో మణుగూరులో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పినపాక, శాయం పేటల్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయిం ది. ఆత్మకూర్, నల్లబెల్లిల్లో 5 సెంటీమీటర్లు, కోయిదా, భద్రాచలంలలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. బిక్నూరు, నర్సం పేట, మెదక్, చెన్నారావుపేట, గూడూరు, హుజూరాబాద్, దుమ్ముగూడెం, ధర్మాసాగర్, హసంపర్తి, పాల్వంచ, నాగారెడ్డిపేట, గార్ల, బూర్గుంపాడు, అశ్వాపురం, కొత్తగూడెం, ఖానాపూర్, మహబూబాబాద్‌లలో 3 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

చెరువులు, కుంటలు నిండితేనే నాట్లు
అధిక వర్షపాతం నమోదైనా రైతులు ఆరుతడి పంట విత్తనాలు మాత్రమే చల్లుకున్నారు. వరి నాట్లు మాత్రం ఊపందుకోలేదు. బోర్లు, బావుల కిందే వరి నాట్లు పడుతున్నాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.35 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 2.32 లక్షల ఎకరాల్లో (10%) మాత్రమే సాగైంది. అలాగే ఆరుతడి పంటలు వేసినా ప్రస్తుతం వర్షాలు అనుకున్నంత మేర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 41.90 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 35.12 లక్షల ఎకరాల్లో (84%) సాగైంది. సోయాబీన్‌ 58 శాతం సాగైంది. వీటికి కీలకమైన సమయంలో వర్షాలు కావల్సి ఉంది. ఆయా పంటలు సాగు చేసిన రైతులంతా ఇప్పుడు భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement