మదిలోనే రాజన్న | Today YS Jayanthi | Sakshi
Sakshi News home page

మదిలోనే రాజన్న

Published Tue, Jul 8 2014 3:54 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

మదిలోనే రాజన్న - Sakshi

మదిలోనే రాజన్న

* ఆయన సేవలు అమోఘం
* నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి
* సంక్షేమానికి ప్రతిరూపం పథకాల రూపంలో సజీవం
* జిల్లా ప్రజల మదిలోనే వైఎస్సార్ జ్ఞాపకాలు
2004లో వైఎస్ అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజే రైతులకు ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. అప్పటి వరకున్న విద్యుత్ బకాయిలు మాఫీచేశారు. ఇప్పుడు జిల్లాలో 3,42,000 వ్యవ సాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందుతోంది. ప్రతిసంవ త్సరం ఉచిత విద్యుత్‌కు రూ.326.83 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం భరిస్తోంది. అంతేకాదు..వ్యవసాయరంగానికి నిరంతరాయంగా తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనతా ఆ మహానేతదే.
 
గతంలో వితంతువులు, వృద్ధులకు రూ.75ల పెన్షన్ అందేది. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభయహస్తం కింద 60 వయసు పైబడిన వారికి పెన్షన్ వర్తింపజేసి వారితో పాటు వికలాంగులకు ప్రతినెలా రూ. 500 పింఛన్ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులకిచ్చే పింఛన్ రెండొందలకు పెంచారు. ప్రస్తుతం జిల్లాలో 1,78,914 మంది వృద్ధులు, 94,567 మంది వితంతువులు, 64, 855 మంది వికలాంగులు, 11, 668 మంది చేనేత, 60,333 మంది గీత కార్మిక, 40,846 మంది అభయహస్తం మొత్తం 4,51,183 మందికి పెన్షన్ అందుతోంది.
 
కరీం‘నగరం’లోని మానేరు డ్యాం సమీపంలో వైఎస్సార్ 11 ఏప్రిల్ 2008న శాతవాహన యూనివర్సిటీ ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పరిధిలో 1,020 మంది పీజీ విద్యార్థులు చదువుతున్నారు. అంతకుముందు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఫార్మసీ కాలేజీలు వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పనిచేసేవి. ప్రతి అవసరానికి విద్యార్థులు ఇబ్బంది పడేవారు.

జిల్లాలో 15 ఏప్రిల్ 2008న.. నిరుపేదలందరికి రూ.2 లక్షలు విలువ చేసే వైద్యం ఉచితంగా అందించేలా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. తొమ్మిది వందలకు పైచీలుకు రోగాలకు వైద్యం అందించి.. దానికయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ కింద జిల్లాలో 20 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. పథకం ప్రారంభం నుంచి ఈ నెల 7వ తేదీ వ రకు జిల్లాల్లో 3, 19, 111 మంది రోగులను పరీక్షించారు. 1,19, 056 మందికి శస్త్ర చికిత్స అందించారు. ఇందుకోసం రూ. 314.19 కోట్లు ఖర్చు చేశారు. 108, 104 వంటి సర్వీసులు లక్షలాది మంది ప్రాణాలు కాపాడుతున్నారుు. వైఎస్సార్ ప్రజల మధ్య లేకున్నా..పథకాలతో లబ్ధిపొందుతున్న జనం గుండెల్లో మాత్రం పదిలంగా ఉన్నారు.
 
రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయడంతో పాటు 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి పావలా వడ్డీ రుణాలు అందించేందుకు నిర్ణరుుంచారు. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా రూ. 3 కోట్లకుపైగా రుణాలు మాఫీ అయ్యాయి. ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 76 వేల మంది రైతులకు పావలా వడ్డీ రుణాలిచ్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం రైతులకు వడ్డీలేని రుణాలిస్తున్నట్టు ప్రకటించింది. ఆచరణలో విఫలమైంది.

పంట నష్టం వాటిల్లి.. రైతు ఆత్మహత్య చేసుకుంటే రెవెన్యూ అధికారులతో విచారణ జరిపించి.. చనిపోయిన రైతు కుటుంబానికి వెంటనే లక్షన్నర రూపాయల ఎక్స్‌గ్రేషియా అందించారు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోయినరైతు కుటుంబాల కోసం వైఎస్ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఆయన మరణాంతరం ఆ ప్యాకేజీ ఊసేలేకుండాపోయింది.

ఇప్పటికీ జిల్లాలో నెలకు సగటున నలుగురి చొప్పున ఏడాదికి 50 మందికిపైగా రైతులు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భూమి లేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ రైతులు.. వ్యవసాయ కూలీలకు భూపంపిణీ చేయాలని నిర్ణయించిన వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాలుగు విడతలుగా భూపంపిణీ చేశారు. 34 వేల మందికి లబ్ధిచేకూరింది.
 
నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింపజేసి వైఎస్ విద్యావిప్లవం సృష్టించారు. తొలిసారిగా.. 2008-09 విద్యాసంవత్సరంలో 30వేల మంది బీసీ విద్యార్థులకు రూ. 25 కోట్లు విడుదల చేశారు. ఇందులో రూ.18 కోట్లు ఫీజురీరుంబర్స్‌మెంట్ ఉండగా రూ.7 కోట్లు ఉపకారవేతనాలున్నాయి. 2009-10 విద్యాసంవత్సరంలో 23,090 బీసీ విద్యార్థులకు రూ.15 కోట్లు పంపిణీ చేశారు. ఇందులో రూ.10 కోట్లు ఫీజురీరుంబర్స్‌మెంట్, రూ.5 కోట్లు ఉపకారవేతనాలు ఉన్నాయి.

 చివరకు 2013-14లో జిల్లా వ్యాప్తంగా 1,03,233 మంది బీసీ, 8,136 మంది ఈబీసీ, 34,554 మంది ఎస్సీ, 1500 మంది ఎస్టీ విద్యార్థులు మొత్తం 147423 మంది ఫీజురీయింబర్స్‌మెంట్ పొందారు. చదువుకు దూరమవుతున్న  మైనార్టీ విద్యార్థులకు బాసటగా నిలిచిన వైఎస్ విద్య, ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు సమకూర్చారు. ఈ రిజర్వేషన్‌తో ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులు లబ్ధిపొందారు.
 
2008-09 విద్యా సంవత్సరంలో కోరుట్ల, కాటారం మండలాల్లో డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్, మంథనిలో హార్టికల్చర్, కరీంనగర్ జిల్లా కేంద్రంలో వెటర్నరీ పాలిటెక్నిక్‌లు ఏర్పాటయ్యాయి. కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, కోహెడ, ధర్మారం, తాడిచర్ల, కథలాపూర్, సారంగపూర్, జూలపల్లి, కమాన్‌పూర్, మానకొండూరు మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు గంభీరావుపేటలో డిగ్రీ కళాశాల వైఎస్ హయూంలోనే మంజూరయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement