yarcp
-
గొల్లపూడి ప్రమాదం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విజయవాడ: గొల్లపూడి సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బస్సు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వైఎస్ జగన్ కోరారు. గొల్లపూడి సమీపంలోని సురయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆరుగురు ఐసీయూలో ఉండగా, ఇద్దరు విద్యార్థులకు శస్త్రచికిత్సలు జరిగాయి. మరికొందరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది. -
చినమండవ సొసైటీ వైఎస్ఆర్ సీపీ కైవసం
చింతకాని: చినమండవ పెద్దచెరువు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానల్ విజయం సాధించింది. శనివారం స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్నికలు నిర్వహించగా..సీపీఐ మద్దతుతో వైఎస్ఆర్సీపీ తొమ్మిది మంది డెరైక్టర్ అభ్యర్థులు, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఎం మద్దతుతో కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది తలపడ్డారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించగా..49 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా..వైఎస్ఆర్సీపీ ప్యానల్లోని తొమ్మిది మందీ గెలిచారు. ఎన్నికల అధికారిగా వైరా ఎఫ్డీఓ శివప్రసాద్ వ్యవహరించారు. కొణిజర్ల ఎస్సై కృష్ణ, చింతకాని ఏఎస్సై ప్రభాకర్‌రావు, పోలీస్‌సిబ్బంది బందోబస్తును నిర్వహించారు. జనవరి 21న ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటికీ చేతులెత్తే పద్ధతిన ఎన్నికను మత్స్యశాఖ అధికారులు రద్దు చేశారు. రెండోసారి కూడా రద్దయ్యే సూచనలు ఉండడంతో..వైఎస్ఆర్ సీపీ ప్యానల్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో..కోర్టు ఆదేశంతో బ్యాలెట్ పద్ధతిన ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. సొసైటీ అధ్యక్షుడిగా సైదులు.. చిన మండవ మత్స్య పారిశ్రామిక సొసైటీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీకి చెందిన తుపాకుల సైదులు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా డోకుపర్తి నాగభూషణం, ఉపాధ్యక్షుడిగా గుండ్ల కాటయ్య, డెరైక్టర్లుగా గంగుల వెంకటేశ్వర్లు, ఈర్ల పుల్లయ్య, గుండ్ల వెంకటేశ్వర్లు, లింగం నాగేశ్వర రావు, తుపాకుల వెంకయ్య, ఆత్మకూరి జాలయ్య ఎన్నికయ్యారు. -
జగన్ పర్యటనను జయప్రదం చేద్దాం
కొయ్యలగూడెం : వర్జీనియా పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారని, ఆయన పర్యటనను జయప్రదం చేయూలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. కొయ్యలగూడెంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆడిటోరియంలో గురువారం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు అధ్యక్షతన ఎన్ఎల్ఎస్ పరిధిలోని వర్జీనియా పొగాకు రైతుల సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా కొత్తపల్లి మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటలకు దేవరపల్లి పొగాకు వేలం కేంద్రానికి జగన్మోహన్రెడ్డి రానున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు పాలనలో రైతులు అధోగతి పాలయ్యారని ధ్వజమెత్తారు. 60 వేల హెక్టార్లలో పొగాకు పండించిన రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతుల రుణాలను మాఫీ చేస్తానన్న చంద్రబాబు దగా చేశారని విమర్శించారు. చంద్రబాబును నమ్మడం రైతుల బలహీనత అని, నమ్మకం ద్రోహం చేయడం చంద్రబాబు నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పొగాకు రైతులతో పాటు వరి, మొక్కజొన్న, ఆరుుల్‌పామ్, రొయ్య రైతుల కష్టాలకు సీం చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. రైతుల ఎదురుచూపు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకకోసం రైతులు వేరుు కళ్లతో ఎదురుచూస్తున్నారని తమ గోడును ఆయన ముందు వెళ్లబోసుకునేందుకు వేలాది మంది రైతులు దేవరపల్లి రానున్నారని తెల్లం బాలరాజు అన్నారు. రూ.600 కోట్ల రుణమాఫీ అంటూ టీడీపీ నాయకులు నమ్మించి రైతులు బిచ్చమెత్తుకునే పరిస్థితి కల్పించారని గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకటరావు ఆరోపించారు. సీఎం గద్దెనెక్కాక సుమారు 30 సార్లు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతు సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. ఆయనకు పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ఉన్న ప్రేమ రైతులపై లేదని అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, జిల్లా అధికార ప్రతినిధులు పోల్నాటి బాబ్జి, ముప్పిడి సంపత్, నాయకులు చెలికాని రాజబాబు, యడ్ల తాతాజీ, ఇళ్ల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
అధైర్యపడకండి..
తొండంగి :సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సోమవారం పరామర్శించారు. తీరంలోని ఎల్లయ్యపేట, హకుంపేట తదితర గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి పర్యటించారు. ఎల్లయ్యపేటలో చొక్కా రాజు, కోడా సత్యనారాయణ, మడదా మహేశ్వరరావు, చింతకాయల కాశీరావు, సిరిపిన గోవిందు, దైలపల్లి రాజు తదితరుల కుటుంబాలను.. హుకుంపేటలో బోటు యజమానులు పెరుమాళ్ల పెదకోదండం, సూరాడ మసేనులతోపాటు 23 మత్స్యకార కుటుంబాలను ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల మహిళలు మాట్లాడుతూ, గల్లంతైన తమవారికి సంబంధించి ఏ ఒక్క అధికారీ సమాచారం ఇవ్వడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వాలని కోరారు. వారం రోజులుగా తమవారి కోసం నిద్రాహారాలు మాని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, గల్లంతైనవారి ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా ఇప్పటికే కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశామని వివరించారు. కొందరి బోట్లు దగ్గరలో ఉన్నట్టు సమాచారం అందిందన్నారు. అధైర్య పడవద్దని బాధితులను ఓదార్చారు. అనంతరం ఆయా కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు కోడా వెంకట రమణ, తొండంగి సొసైటీ డెరైక్టర్ అంబుజాలపు పెదసత్యనారాయణ తదితరులున్నారు. -
నేడు వైఎస్ జయంతి
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 65వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాల ప్రదాతగా పేద, బడుగుల హృదయాల్లో నిలిచిపోయిన వైఎస్‌కు నివాళులర్పించేందుకు పలు చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ వరుణ యాగాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పార్టీ కేంద్ర, జిల్లా కార్యాలయాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఇడుపులపాయకు చేరుకున్నారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల తదితరులు కూడా ఇడుపులపాయకు వెళ్లారు. ఆక్కడ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తారు. -
మదిలోనే రాజన్న
* ఆయన సేవలు అమోఘం * నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి * సంక్షేమానికి ప్రతిరూపం పథకాల రూపంలో సజీవం * జిల్లా ప్రజల మదిలోనే వైఎస్సార్ జ్ఞాపకాలు 2004లో వైఎస్ అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజే రైతులకు ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. అప్పటి వరకున్న విద్యుత్ బకాయిలు మాఫీచేశారు. ఇప్పుడు జిల్లాలో 3,42,000 వ్యవ సాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందుతోంది. ప్రతిసంవ త్సరం ఉచిత విద్యుత్‌కు రూ.326.83 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం భరిస్తోంది. అంతేకాదు..వ్యవసాయరంగానికి నిరంతరాయంగా తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనతా ఆ మహానేతదే. గతంలో వితంతువులు, వృద్ధులకు రూ.75ల పెన్షన్ అందేది. వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభయహస్తం కింద 60 వయసు పైబడిన వారికి పెన్షన్ వర్తింపజేసి వారితో పాటు వికలాంగులకు ప్రతినెలా రూ. 500 పింఛన్ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులకిచ్చే పింఛన్ రెండొందలకు పెంచారు. ప్రస్తుతం జిల్లాలో 1,78,914 మంది వృద్ధులు, 94,567 మంది వితంతువులు, 64, 855 మంది వికలాంగులు, 11, 668 మంది చేనేత, 60,333 మంది గీత కార్మిక, 40,846 మంది అభయహస్తం మొత్తం 4,51,183 మందికి పెన్షన్ అందుతోంది. కరీం‘నగరం’లోని మానేరు డ్యాం సమీపంలో వైఎస్సార్ 11 ఏప్రిల్ 2008న శాతవాహన యూనివర్సిటీ ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పరిధిలో 1,020 మంది పీజీ విద్యార్థులు చదువుతున్నారు. అంతకుముందు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఫార్మసీ కాలేజీలు వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పనిచేసేవి. ప్రతి అవసరానికి విద్యార్థులు ఇబ్బంది పడేవారు. జిల్లాలో 15 ఏప్రిల్ 2008న.. నిరుపేదలందరికి రూ.2 లక్షలు విలువ చేసే వైద్యం ఉచితంగా అందించేలా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. తొమ్మిది వందలకు పైచీలుకు రోగాలకు వైద్యం అందించి.. దానికయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద జిల్లాలో 20 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. పథకం ప్రారంభం నుంచి ఈ నెల 7వ తేదీ వ రకు జిల్లాల్లో 3, 19, 111 మంది రోగులను పరీక్షించారు. 1,19, 056 మందికి శస్త్ర చికిత్స అందించారు. ఇందుకోసం రూ. 314.19 కోట్లు ఖర్చు చేశారు. 108, 104 వంటి సర్వీసులు లక్షలాది మంది ప్రాణాలు కాపాడుతున్నారుు. వైఎస్సార్ ప్రజల మధ్య లేకున్నా..పథకాలతో లబ్ధిపొందుతున్న జనం గుండెల్లో మాత్రం పదిలంగా ఉన్నారు. రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయడంతో పాటు 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి పావలా వడ్డీ రుణాలు అందించేందుకు నిర్ణరుుంచారు. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా రూ. 3 కోట్లకుపైగా రుణాలు మాఫీ అయ్యాయి. ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 76 వేల మంది రైతులకు పావలా వడ్డీ రుణాలిచ్చారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం రైతులకు వడ్డీలేని రుణాలిస్తున్నట్టు ప్రకటించింది. ఆచరణలో విఫలమైంది. పంట నష్టం వాటిల్లి.. రైతు ఆత్మహత్య చేసుకుంటే రెవెన్యూ అధికారులతో విచారణ జరిపించి.. చనిపోయిన రైతు కుటుంబానికి వెంటనే లక్షన్నర రూపాయల ఎక్స్‌గ్రేషియా అందించారు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోయినరైతు కుటుంబాల కోసం వైఎస్ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఆయన మరణాంతరం ఆ ప్యాకేజీ ఊసేలేకుండాపోయింది. ఇప్పటికీ జిల్లాలో నెలకు సగటున నలుగురి చొప్పున ఏడాదికి 50 మందికిపైగా రైతులు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భూమి లేని నిరుపేద ఎస్సీ, ఎస్టీ రైతులు.. వ్యవసాయ కూలీలకు భూపంపిణీ చేయాలని నిర్ణయించిన వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాలుగు విడతలుగా భూపంపిణీ చేశారు. 34 వేల మందికి లబ్ధిచేకూరింది. నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేసి వైఎస్ విద్యావిప్లవం సృష్టించారు. తొలిసారిగా.. 2008-09 విద్యాసంవత్సరంలో 30వేల మంది బీసీ విద్యార్థులకు రూ. 25 కోట్లు విడుదల చేశారు. ఇందులో రూ.18 కోట్లు ఫీజురీరుంబర్స్మెంట్ ఉండగా రూ.7 కోట్లు ఉపకారవేతనాలున్నాయి. 2009-10 విద్యాసంవత్సరంలో 23,090 బీసీ విద్యార్థులకు రూ.15 కోట్లు పంపిణీ చేశారు. ఇందులో రూ.10 కోట్లు ఫీజురీరుంబర్స్మెంట్, రూ.5 కోట్లు ఉపకారవేతనాలు ఉన్నాయి. చివరకు 2013-14లో జిల్లా వ్యాప్తంగా 1,03,233 మంది బీసీ, 8,136 మంది ఈబీసీ, 34,554 మంది ఎస్సీ, 1500 మంది ఎస్టీ విద్యార్థులు మొత్తం 147423 మంది ఫీజురీయింబర్స్‌మెంట్ పొందారు. చదువుకు దూరమవుతున్న మైనార్టీ విద్యార్థులకు బాసటగా నిలిచిన వైఎస్ విద్య, ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు సమకూర్చారు. ఈ రిజర్వేషన్‌తో ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులు లబ్ధిపొందారు. 2008-09 విద్యా సంవత్సరంలో కోరుట్ల, కాటారం మండలాల్లో డిప్లొమా ఇన్ పాలిటెక్నిక్, మంథనిలో హార్టికల్చర్, కరీంనగర్ జిల్లా కేంద్రంలో వెటర్నరీ పాలిటెక్నిక్‌లు ఏర్పాటయ్యాయి. కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, కోహెడ, ధర్మారం, తాడిచర్ల, కథలాపూర్, సారంగపూర్, జూలపల్లి, కమాన్‌పూర్, మానకొండూరు మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు గంభీరావుపేటలో డిగ్రీ కళాశాల వైఎస్ హయూంలోనే మంజూరయ్యాయి. -
జిల్లా ప్రజలకు అండగా ఉంటాం
వైరా: జిల్లా ప్రజల కష్టసుఖాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, తాను తోడుగా ఉంటామని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం వైరాలోని శబరి గార్డెన్లో జరిగిన వైఎస్ఆర్సీపీ వైరా నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు భరోసానిస్తామని, ప్రజా సమస్యలే ఎజెండాగా పనిచేస్తామని అన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ ఉండదని విమర్శలు చేసిన వారికి ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలిపించుకొని సత్తా చాటామని అన్నారు. తాము పార్టీలు మారుతున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలు కేవలం దుష్ర్పచారమేనని విమర్శించారు. భగవంతుడి దీవెనలు, రాజన్న ఆశీస్సులతో ఇచ్చిన హామీలను నేరవేరుస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు చేస్తామని, జిల్లాలో వైఎస్సార్సీపీ నూతన వరవడి సృష్టించేందుకు మదన్‌లాల్, శ్రీనన్నలు కృషి చేస్తారని ఈ సందర్భంగా అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా..: మదన్‌లాల్ వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని, వైరాను ఐదేళ్లలో మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ అన్నారు. గిరిజన గ్రామాల్లో సాగు, తాగునీటితో పాటుగా వ్యవసాయ ఆధార భూములకు చెక్‌డ్యాంల నిర్మాణం కోసం కృషి చేస్తానని అన్నారు. పొంగులేటికి, మదన్‌లాల్‌కు ఘనసన్మానం.. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మాన్మిం చారు. అనంతరం పొంగులేటి స్థానిక హరిహరసుత అయ్యప్ప క్షేత్రాన్ని సందర్శించారు. పార్టీ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, వైరా జెడ్పీటీసీ బొర్రా ఉమాదేవి, వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల కన్వీనర్లు షేక్ లాల్‌మహ్మద్, రాయల పుల్లయ్య, నల్లమల్ల శివకుమార్, పొన్నెకంటి వీరభద్రం, రావూరి శ్రీనివాసరావు, నాయకులు గుమ్మా రోషయ్య, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, తన్నీరు నాగేశ్వరరావు, ఇమ్మడి తిరుపతిరావు, పూర్ణకంటి నాగేశ్వరరావు, పాముల వెంకటేశ్వర్లు, తేలప్రోలు నర్సింహరావు, గరికపాడు సర్పంచ్ శీలం కరుణాకర్‌రెడ్డి, గుండ్రాతిమడుగు సర్పంచ్ అప్పం సురేష్, ధార్న శేఖర్, ధార్న రాజా తదితరులు పాల్గొన్నారు.