చినమండవ సొసైటీ వైఎస్‌ఆర్ సీపీ కైవసం | Fisheries Society cinamandava picked up the YSR CP | Sakshi
Sakshi News home page

చినమండవ సొసైటీ వైఎస్‌ఆర్ సీపీ కైవసం

Published Sun, Feb 7 2016 8:38 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

చినమండవ సొసైటీ వైఎస్‌ఆర్ సీపీ కైవసం - Sakshi

చినమండవ సొసైటీ వైఎస్‌ఆర్ సీపీ కైవసం

చింతకాని: చినమండవ పెద్దచెరువు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యానల్ విజయం సాధించింది. శనివారం స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్నికలు నిర్వహించగా..సీపీఐ మద్దతుతో వైఎస్‌ఆర్‌సీపీ తొమ్మిది మంది డెరైక్టర్ అభ్యర్థులు, టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఎం మద్దతుతో కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది తలపడ్డారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించగా..49 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా..వైఎస్‌ఆర్‌సీపీ ప్యానల్‌లోని తొమ్మిది మందీ గెలిచారు.

ఎన్నికల అధికారిగా వైరా ఎఫ్‌డీఓ శివప్రసాద్ వ్యవహరించారు. కొణిజర్ల ఎస్సై కృష్ణ, చింతకాని ఏఎస్సై ప్రభాకర్‌రావు, పోలీస్‌సిబ్బంది బందోబస్తును నిర్వహించారు. జనవరి 21న ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటికీ చేతులెత్తే పద్ధతిన ఎన్నికను మత్స్యశాఖ అధికారులు రద్దు చేశారు. రెండోసారి కూడా రద్దయ్యే సూచనలు ఉండడంతో..వైఎస్‌ఆర్ సీపీ ప్యానల్ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో..కోర్టు ఆదేశంతో బ్యాలెట్ పద్ధతిన ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు.

 సొసైటీ అధ్యక్షుడిగా సైదులు..
 చిన మండవ మత్స్య పారిశ్రామిక సొసైటీ అధ్యక్షుడిగా వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన తుపాకుల సైదులు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా డోకుపర్తి నాగభూషణం, ఉపాధ్యక్షుడిగా గుండ్ల కాటయ్య, డెరైక్టర్లుగా గంగుల వెంకటేశ్వర్లు, ఈర్ల పుల్లయ్య, గుండ్ల వెంకటేశ్వర్లు, లింగం నాగేశ్వర రావు, తుపాకుల వెంకయ్య, ఆత్మకూరి జాలయ్య ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement