సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను గురువారం సచివాలయంలో పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ ఆవిష్కరించారు. కాళేశ్వరం టూర్‌లో భాగంగా రంగనాయకుల సాగర్ ప్రాజెక్టు, సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్ హౌస్ ప్రాంతాలను చూపిస్తారు. సాధారణ సమయంలో ఇక్కడికి అనుమతించరు. ప్రత్యేక ప్యాకేజీ నేపథ్యంలో పర్యాటక శాఖ ఈ యాత్రను అందుబాటులోకి తెచ్చింది. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చొప్పున టిక్కెట్ ధర నిర్ణయించింది. ఉదయం 7.30 గంటలకు బషీర్‌బాగ్‌లోని సీఆర్‌ఓ కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లోని యాత్రి నివాస్‌కు చేరుకుంటుంది. తర్వాత అక్కడ్నుంచి కాళేశ్వరం చేరుకుంటుంది. ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు గైడ్ కూడా ఉంటాడు.
Comments
Please login to add a commentAdd a comment