సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్‌సీ) ఫైలు గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు చేరింది. జూలై 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ ఆమోద తీర్మానం వెళ్లాక.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, ఏ చట్టం ప్రకారం దీనిని ఏర్పాటు చేయాలి అన్న అంశాలతో కూడిన సాధారణ పరిపాలన శాఖ ఫైలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వస్తే.. ఆయన ఆ ఫైలును గురువారం ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించారు. సీఎం నుంచి ఈ ఫైలు తిరిగి రాగానే.. దానిని గవర్నర్ నరసింహన్‌కు పంపిస్తారు. గవర్నర్ ఆమోద ముద్ర పడిన తరువాత కమిషన్ ఏర్పాటు, చైర్‌పర్సన్, కమిటీ సభ్యులను నియమిస్తారు. ఆగస్టు మొదటి వారంలో ఇది ఏర్పాటు కానున్నట్లు అధికారవర్గాలు వివరించాయి.