టవర్‌సర్కిల్: మున్సిపాలిటీలకు గుదిబండ గా మారిన విద్యుత్ చార్జీలను తగ్గించేం దుకు ప్రభుత్వం ప్ర వేశపెట్టాలని భావిం చిన ఎల్‌ఈడీ బల్బుల ప్రక్రియ అటకెక్కినట్లయింది. సెప్టెంబర్ తె లంగాణలోని 12 మున్సిపాలిటీలను ఎంపికచేసి ప్రయోగాత్మకంగా ఎల్‌ఈ డీ బల్బులను అమర్చాలని ఢిల్లీకి చెందిన ఈఈఎస్‌ఎల్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది.
కంపెనీయే ఎల్‌ఈడీ బల్బులను అమర్చుకొని పాత బల్బులు ఉన్నప్పుడు ఎంత బిల్లుచెల్లిస్తున్నారో అంత బిల్లులను మున్సిపాలిటీల నుంచి వసూలు చేసుకోవాలి. ఎల్‌ఈడీ బల్బులు అమర్చడం ద్వారా 50 శాతం విద్యుత్ ఆదా అవుతుందని, అంటే సగం విద్యుత్ బిల్లు మిగిలే అవకాశముంది. బిల్లులు చెల్లించగా మిగతా సొమ్మును బల్బులు అమర్చినందుకు కంపెనీకి జమచేసుకునే విధంగా ఒప్పందం కుదిరింది.
ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టే పైలట్ ప్రాజెక్ట్‌లో జిల్లాలోని కరీంనగర్, రామగుండం కార్పొరేషన్‌లతోపాటు సిరిసిల్ల మున్సిపాలిటీని ఎంపిక చేశారు. ఈ ప్రక్రియం జరిగి మూడు నెలలు పూర్తవుతున్నా ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా ఎక్కడా ఎల్‌ఈడీ బల్బులు అమర్చిన దాఖలాలు లేవు. ఈఈఎస్‌ఎల్ కంపెనీ ప్రతినిధులు పలుమార్లు ఆయా మున్సిపాలిటీలలో పర్యటించినప్పటికీ ఎక్కడా బల్బులు అమర్చలేదు. దీంతో ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా మారింది. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే దశలవారీగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఎల్‌ఈడీ బల్బులు అమర్చాలన్నది ప్రభుత్వం యోచన. కానీ ఈ ప్రక్రియకు ఆదిలోనే అవంతరాలు ఎదురవుతున్నాయి.
ఎల్‌ఈడీ బల్బుల ఖర్చు ఎక్కువే...
మున్సిపాలిటీలలో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుకు ప్రస్తుతం వాడుతున్న హైమాస్ట్ బల్బుల ధర కంటే రెండింతలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎల్‌ఈడీ బల్బును ఒకసారి బిగిస్తే పది సంవత్సరాల వరకు మన్నిక ఉంటుందని, ఎక్కువ ఖర్చుపెట్టి కొనుగోలు చేసినా నష్టం లేదనేది అధికారుల వాదన. అయితే బల్బుల ఏర్పాటుకు ఖర్చు ఎక్కువ కావడం, మున్సిపాలిటీల నుంచి వచ్చే విద్యుత్ బిల్లుల నుంచే తమను ఆదా చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో ఆ సంస్థ వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈఈఎస్‌ఎల్ కంపెనీ చెతులెత్తేసినట్టు తెలుస్తోంది.
జాడలేని ఎల్‌ఈడీ
Published Sat, Dec 27 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement
Advertisement