మహబూబ్‌నగర్: వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పి రైల్వే గేటును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కాని బస్సు ఢీకొన్న ప్రాంతంలో రైల్వే గేటు విరిగిపోయింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటుచే సుకుంది. వివరాలు.. హైదరాబాద్ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు రైల్వే గేటును ఢీ కొట్టడంతో గేటు సగానికి విరిగింది. దీంతో గేటు వేయడానికి వీల్లేకుండా పోయింది.
అదే సమయంలో నాగర్‌కోయిల్ నుంచి కాచిగూడ వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. ఆ సమయంలో గేటు వేయకపోవడంతో సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో గంటకు పైగా రైలు పట్టాలపైనే ఉండిపోయింది. ఇది గమనించిన మెసెంజర్ పచ్చజెండా ఊపడంతో రైలు బయలు దేరింది.
గేటును ఢీకొన్న బస్సు.. ఆగిన రైలు
Published Wed, May 27 2015 5:00 PM | Last Updated on Mon, Oct 8 2018 4:59 PM
Advertisement
Advertisement