బెజ్జూర్: వ్యవసాయ భూమిలో ఓ రైతుకు లభ్యమైన గుప్తనిధిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మొర్లిగూడకు చెందిన రైతు జగదీష్ గత ఏడాది తన పొలం దున్నుతుండగా ఓ రాగి పాత్ర లభించింది. అందులో ఏడు గ్రాముల బంగారం, 3 తులాల వెండి ఉన్నాయి. వాటితో ఆయన ఆభరణాలు చేయించుకున్నాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా రెవెన్యూ అధికారులు, పోలీసులకు చేరింది. దర్యాప్తులో నిజం నిర్ధారణ కావటంతో గురువారం ఉదయం ఎస్సై రాజు, తహశీల్దార్ సూర్యనారాయణ గ్రామానికి చేరుకున్నారు. రైతు జగదీష్ నుంచి ఆ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వానికి వాటిని అప్పగించనున్నట్లు వారు తెలిపారు.
గుప్త నిధి సొత్తు స్వాధీనం
Published Thu, Mar 31 2016 12:34 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement