సాక్షి, హైదరాబాద్: వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్‌గా గుండా ప్రకాశ్‌రావు పేరును టీఆర్‌ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ పదవి కోసం టీఆర్‌ఎస్‌లోని పలువురు కార్పొరేటర్లు ప్రయత్నాలు చేసినా.. పార్టీలో సీనియర్ నేత అయిన ప్రకాశ్‌రావుకే టీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చింది. వరంగల్ మేయర్ పదవికి ఈ నెల 27న ఎన్నిక జరగనుంది. ఎన్నికకు ఒకరోజు ముందుగా టీఆర్‌ఎస్ ప్రకాశ్‌రావు పేరును అధికారికంగా ప్రకటించనుంది. గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయ్యింది. 2016 ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన నన్నపునేని నరేం దర్‌కు పార్టీ అవకాశం కల్పించింది. నరేందర్ తాజాగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యం లో మేయర్ పదవికి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment