సాక్షిప్రతినిధి, నల్లగొండ : సెప్టెంబర్‌లోనే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళతారని ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం ఈ వార్తలు నిజమని నమ్మేలా చేస్తున్నా యి. ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నత అధికారులను బదిలీ చేస్తున్న తీరు కూడా ముం దస్తు జాగ్రత్తలుగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నాళ్లుగానో పెండింగ్‌లో ఉన్న కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ నిర్ణయాలు తీసుకుం టోంది.
ఫలితంగా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రజల సమస్యలపై దృష్టి పెట్టిందని, ఎమ్మెల్యేల వారీగా అభివృద్ధి నిధులు విడుదల చేస్తోందని చెబుతున్నారు. ఒక్కో ఎమ్మెల్యే పరిధిలో కనీసం రూ.3 కోట్ల నిధులు మంజూ రుకు పచ్చజెండా ఊపిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల మనసు చూరగొనేందుకు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
వడ్డీలేని రుణాలు తీసుకున్న మహిళా స్వయం సహాయక సంఘాలు క్రమం తప్పకుండా తమ అప్పులను వడ్డీ సహా బ్యాంకులకు చెల్లిస్తున్నాయి. ప్రభుత్వం ఆ తర్వాత ఈ వడ్డీ మొత్తాన్ని సంఘాలకు తిరిగి చెల్లిం చాల్సి ఉంటుంది. కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచి ఇప్పటివరకు వడ్డీ మొత్తాలను పైసా కూడా చెల్లించలేదు. కానీ, ముందస్తు ఎన్నికలు ముం చుకొస్తున్నాయని భావిస్తున్న తరుణంలో మహిళా సంఘాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని అభిప్రాయ పడుతున్నారు.
రెండేళ్లకు రూ.71.51కోట్ల విడుదల
మూడున్నర సంవత్సరాలుగా మహిళ సంఘాలు ప్రతినెలా క్రమం తప్పకుండా వడ్డీతో కలిపి తాము తీసుకున్న రుణాలు చెల్లిస్తూ వస్తున్నాయి. క్రమం తప్పకుండా అసలు, వడ్డీ చెల్లించిన మహిళ సంఘాలకు ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తుంది. కానీ, ఆయా సంఘాలకు రావాల్సిన వడ్డీకి సంబంధించిన డబ్బులు మూడున్నర సంవత్సరాలుగా విడుదల చేయకపోవడంతో మహిళ సంఘాలు ఆందోళనలో ఉన్నాయి. గత వారం ప్రభుత్వం రెండేళ్లకు సంబంధించిన వడ్డీ మాఫీ మొత్తాన్ని విడుదల చేయడంతో మహిళ సంఘాల్లో ఆనందం నెలకొంది. జిల్లాలో సెర్ప్ ద్వారా వడ్డీ లేని రుణాలు పొందిన సంఘాలు సకాలంలో తిరిగి చెల్లిస్తే వారికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని మొదలుపె ట్టింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దానిని కొనసాగిస్తానని ప్రకటించింది. సకాలంలో అసలు, వడ్డీ చెల్లించే సంఘాలకు ప్రతీ మూడు నెలలకో మారు వడ్డీల మొత్తాన్ని విడుదల చేయాలి. నేరుగా సంఘా ల ఖాతాల్లోనే ఈ డబ్బులను జమ చేయాల్సి ఉంటుంది. కానీ, మూడున్నరేళ్లుగా పైసా కూడా విడుదల చేయలేదు. ఫలితంగా తీసుకున్న రుణాలను, వాటికయ్యే వడ్డీ డబ్బును చెల్లించలేని పరిస్థితికి సంఘాలు వచ్చాయి. జిల్లాలో క్రమం తప్పకుండా 44,134 సంఘాలు ప్రతి నెలా అసలు, వడ్డీ చెల్లిస్తూ వచ్చాయి. ప్రస్తుతం ఈ సంఘాలకే ప్రభుత్వం వడ్డీ మాఫీ కింద రూ.71,51,76,502 విడుదల చేసింది.
రెండేళ్ల వడ్డీ మాఫీ విడుదల
బ్యాంకు లీంకేజికి ద్వారా రుణాలు పొంది క్రమం తప్పకుండా తిరిగి చెల్లించిన మహిళ సంఘాలకు వడ్డీ మాఫీకి సంబంధించి∙డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. 2015–16, 2016–17 సంవత్సరాలకు సంబంధించి రూ.71.51 కోట్ల వడ్డీ బకాయిలను జిల్లాలో అర్హత పొందిన సంఘాలకు విడుదల చేశాం.
– ఎస్.రామలింగయ్య, బ్యాంకు లీంకేజి డిస్ట్రిక్ ప్రాజెక్ట్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment