సమావేశంలో మాట్లాడుతున్న గండ్ర
మొగుళ్లపల్లి : టీఆర్‌ఎస్ పాలనకు రైతులు, అన్ని వర్గాల ప్రజలు చరమగీతం పాడాలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.గురువారం మండలంలోని రంగాపురం, మేదరమెట్ల, అంకుషాపూర్ గ్రామాల్లో రైతు భరోసా యాత్ర జరిగింది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేస్తే కేసీఆర్, కేటీఆర్‌లు విజ్ఞానయాత్ర, విహారయాత్ర అంటూ ఎద్దేవా చేయడం సరికాదన్నారు. మహానేత వైఎస్‌ఆర్ పాలనలో రైతులకు న్యాయం జరిగిందన్నారు. అనంతరం మేదరమెట్లకు చెందిన సూమారు 30 మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోల్నేని రాజేశ్వర్‌రావు, నాయకులు లింగారావు, సంపెల్లి నర్సింగరావు, యార మల్లారెడ్డి, నరహరి వెంకట్‌రెడ్డి, బెల్లంకొండ శ్యాంసుందర్‌రెడ్డి, గుండారపు తిరుపతి, కుమార్, పులి విప్లవరెడ్డి. తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు.
టేకుమట్ల: రైతులను విస్మరిస్తున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతు భరోసా పాదయాత్ర గురువారం మండలంలోని సుబ్బక్కపల్లికి చేరుకుంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులు పండించిన వరి, మొక్కజొన్నలకు రూ.2వేలు, మిరప రూ.10వేలు, ప్రత్తి రూ.6వేల మద్దతు ధర చెల్లిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు దొమ్మటి సాంబయ్య, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మండల అధ్యక్షుడు రెడ్డి మల్లారెడ్డి, ఎంపీపీ బందెల స్నేహలత, వైస్ ఎంపీపీ సట్ల కొమురయ్య, ఎంపీటీసీ సభ్యుడు భీంపెల్లి సంధ్యారామస్వామి, మండల ప్రధాన కార్యదర్శి బిక్కినేని సంపత్‌రావు, పెరుమాండ్ల మొగిళి, బాబురావు, రవీందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సట్ల రవిగౌడ్, కొండ్ర ఓదెలు, గువ్వాడి లక్ష్మణ్, పిన్నింటి విజేందర్‌రెడ్డి, దాసారపు సతీష్, ఎండీ అక్రం, ఆడెపు సంపత్, సతీష్‌గౌడ్, నానవేని కుమార్‌యాదవ్, శ్రీకాంత్, రామస్వామి, శ్రీనివాస్, రాజిరెడ్డి, లింగారెడ్డి, పాల్గొన్నారు.
చిట్యాల(భూపాలపల్లి) : రైతు భరోసా యాత్రలో భాగంగా మండలంలోని నవాబుపేటకు వచ్చిన గండ్ర వెంకటరమణారెడ్డికి మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈసందర్భంగా ఆయన టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు గొర్రెసాగర్, పర్లపల్లి భద్రయ్య, ఆరెపల్లి సమ్మయ్య, కాల్వ సమ్మిరెడ్డి, పెరుమాండ్ల రవీందర్, కొక్కుల రాజు, సారంగం, ఓదెలు, ప్రభాకర్, దామెర రాజు, దేవేందర్‌రెడ్డి, ఉపేందర్,పాండ్రాల స్వామి, తౌటం సుదర్శన్, లాండె సాంబశివరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment