టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు
► గడాఫీ బాటలో సీఎం కేసీఆర్
► అప్పుల రాష్ట్రంగా తెలంగాణ
► డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి
హసన్‌పర్తి : ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ కాం గ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హసన్‌పర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టా రు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడని ధ్వజమెత్తారు. కేసీఆర్.. లిబియూ అధ్యక్షుడిగా పనిచేసిన గడాఫీ బాటలోనే పయనిస్తున్నాడని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఓ వైపు కరువు విల య తాండవం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
ఇప్పటి వరకు బిహర్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా నుంచి మన రాష్ట్రానికి వలసలు వచ్చేవారని.. అరుుతే కరువు కారణంగా ప్రస్తుతం మన రాష్ర్టం నుం చి కూడా ఇతర రాష్ట్రాలకు వలసలు మొదల య్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న వరంగల్‌కు చేసింది ఏమీ లేదన్నారు. సర్కార్ నిర్లక్ష్యంతోనే స్మార్ట్ సిటీ వరంగల్‌కు చేజారిందన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ర్టంగా మార్చాడని ఆరోపిం చారు. నయవంచక పాలన చేపడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
అనంతరం తహసీల్దార్ రవికి నాయకులు వినతిపత్రం అందజేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి మదన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే కొండేటి శ్రీధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌రావు, నగర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, టీపీసీసీ శాశ్వత ప్రతినిధి నమిండ్ల శ్రీనివాస్, టీపీసీసీ కార్యదర్శులు బత్తిని శ్రీని వాస్, ఈవీ శ్రీనివాస్‌రావు, పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, గుడెప్పాడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పింగిలి వెంకట్రాంనర్సింహారెడ్డి, నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, పుల్లా దుర్గారాం, బల్సుకూరి శ్రీనివాస్, ఆరెల్లి వెంకటస్వామి, తోకల లక్ష్మారెడ్డి, బూర సురేందర్‌గౌడ్, నగేష్, యూత్ కాంగ్రెస్ వరంగల్ పార్లమెంటరీ నియోకవర్గ అధ్యక్షుడు రమాకాంత్‌రెడ్డి, శ్రీమాన్, తది తరులు పాల్గొన్నారు.