కొండా దంపతుల రాకతో రగడ | TRS worker attempts suicide over konda surekha couple join party | Sakshi
Sakshi News home page

కొండా దంపతుల రాకతో రగడ

Published Tue, Mar 18 2014 3:37 PM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

కొండా దంపతుల రాకతో రగడ - Sakshi

కొండా దంపతుల రాకతో రగడ

వరంగల్ : టీఆర్ఎస్లో కొండా సురేఖ దంపతుల రాక వరంగల్ జిల్లాలో చిచ్చు రేపింది. కొండా దంపతుల చేరికను ఆపార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను కొండా దంపతులు మంగళవారం కలిసినట్లు వార్తలు రావటంతో... దాన్ని వ్యతిరేకిస్తూ ప్రేమ్ అనే  టీఆర్ఎస్ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో అతడి ఇతర కార్యకర్తలు అడ్డుకున్నారు.  

గతంలో తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినట్లు మాట్లాడిన కొండా దంపతులు ఇప్పుడు...పదవుల కోసమే టీఆర్ఎస్ను ఆశ్రయించారని ఆరోపించారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారిని గుర్తించాలని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పేర్కొన్నారు. కాగా కొండా సురేఖకు వరంగల్ తూర్పు నియోజకవర్గ టిక్కెట్తో పాటు, ఆమె భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని...కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement