
ప్రొ.జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఆచార్య జయశంకర్ ఎక్కడున్నా.. ఆయన ఆశీస్సులు సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌లకే ఉంటాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణభవన్‌లోని విగ్రహానికి గురువారం మంత్రులు కేటీఆర్, తలసాని, సి.లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆ ర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం సుదీర్ఘ కాలం పోరాడిన జయశంకర్ సార్ ఇప్పుడు లేకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో ఎంపీలు బీబీ పాటిల్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment