తెలంగాణ గురుకుల పీజీటీ, టీజీటీ, పీడీ మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
హైదరాబాద్ : తెలంగాణ గురుకుల పీజీటీ, టీజీటీ, పీడీ మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అభ్యర్థులు, విద్యార్థి సంఘాల విజ్ఞప్తితో పరీక్షలు వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. జూలై 18, 19 తేదీల్లో పీజీటీ, 20,22న టీజీటీ, 19న పీడీ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 4 నుంచి 6 వరకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) మెయిన్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.