- విప్లవ రచయితల సంఘం ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: తీవ్రవాదుల పేరిట తెలంగాణలోనూ, స్మగ్లర్ల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోనూ పోలీసులు ఒకే రోజు 25 మందిని హత్య చేశారని, ఈ ఎన్‌కౌంటర్‌లు ఇద్దరు సీఎంల నెత్తుటి పాలనను త లపిస్తున్నాయని విప్లవ రచయితల సంఘం ఒక ప్రకటనలో ఆరోపించింది. హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు విరసం కార్యదర్శి వరలక్ష్మీ, కార్యవర్గ సభ్యులు పాణి, వరవరరావు, కల్యాణ్‌రావులు తెలిపారు. రాయలసీమలో చాలామంది నాయకులు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతుండగా, కేవలం పొట్ట చేత పట్టుకొని వచ్చిన కూలీలను చంపేశారని ఆరోపించారు.