ఈ సంవత్సరం ఎండలకు కాస్త వయసు పైబడినవారు పిట్టల్లా రాలిపోతున్నారు.
కరీంనగర్ (భీమదేవరపల్లి) : ఈ సంవత్సరం ఎండలకు కాస్త వయసు పైబడినవారు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో వడదెబ్బకు తాళలేక బుధవారం ఇద్దరు మృతిచెందారు. మండలంలోని రత్నగిరి గ్రామానికి చెందిన కుడితాడి జననమ్మ(55) అనే మహిళ, మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన కె.కొమరయ్య(60) అనే వ్యక్తి వడదెబ్బతో మరణించారు.