జనగామ :
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం చాగల్లు శివారులో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీలు ఢీకొన్నాయి. హన్మకొండ నుండి హైదరాబాద్ వైపుకు వెళ్తున్న వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, హైదరాబాద్ నుండి హన్మకొండకు వస్తున్న లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్తో పాటు మహిళా ప్రయాణికురాలు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ను అర్.ఎల్.రెడ్డిగా గుర్తించారు. గాయాలపాలైన పలువురిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉదయం 4 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment