తీజ్‌ వేడుకల్లో అపశృతి | two groups clashes in teej celebrations at nalgonda district | Sakshi
Sakshi News home page

తీజ్‌ వేడుకల్లో అపశృతి

Published Thu, Aug 10 2017 1:02 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

two groups clashes in teej celebrations at  nalgonda district

నల్లగొండ: తీజ్‌ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నేరుడుగోమ్ము మండలం పడమటితండాలో గురువారం వెలుగుచూసింది.
 
తండాలో తీజ్‌ పండుగ జరుపుకుటున్న సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement