Teej celebrations
-
‘ఆరుద్ర’ను చూస్తే అనువైన వరుడు..
గిరిజనులకు తల్లీ తండ్రి ప్రకృతే. కొరత లేకుండా ధాన్యాన్ని పస్తులు ఉంచకుండా పంటల్ని పుష్కలంగా ఇవ్వడమే కాదు తమకు అనువైన తోడును కూడా ప్రకృతి మాతే తీసుకువస్తుందన్నది ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకం పెళ్లీడుకు వచ్చిన పడతుల్లో కోటి ఆశలను విరబూయిస్తుంది. ఆ ఆశలే ఇంటింటా సంబరమవుతాయి.పంట సాగు నుండి కన్నెపిల్లల పరిణయాల వరకు అంతా ప్రకృతి చెప్పిన విధంగానే నడుచుకుంటారు గిరిజనులు. అంతటి ప్రాధాన్యత కల్గిన వాటిల్లో ‘తీజ్’ పండుగ ముఖ్యమైనది."నాకు అరవై ఏళ్లు. మా చిన్నప్పుడు కూడా తీజ్ పండుగ చేసుకున్నాం. తీజ్ పెరిగిన తీరును చూసి మా అమ్మానాన్నలు, తండా పెద్దలు నాకు పెళ్లి చేశారు. ఇదే ఆనవాయితీ మా పిల్లలు కూడా చేస్తున్నారు0." – భూక్యా వీరమ్మ గన్యాతండ, మహబూబాబాద్తీజ్ అంటే..పెళ్లీడుకు వచ్చిన గిరిజన (లంబాడ) అమ్మాయిలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. గోధుమ నారునే కాదు ఈ కాలాన కనిపించే ఆరుద్ర పురుగులనూ తీజ్ అంటారు. ఎర్రగా అందంగా ఉండే ఆరుద్ర పురుగులను దేవుడు తమకోసం పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు మనసులో కోరుకున్న కోరిక ఫలిస్తుందని వీరి నమ్మకం.ఇంటింటి ఆశీస్సులు..పెళ్లీడుకు వచ్చిన యువతులు తమకు కావాల్సిన వరుడి కోసం చేసే ఈ పండగకు ముందు గా తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. యువతులందరు ఇంటింటికి వెళ్లి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, వారు కానుకగా ఇచ్చే విరాళం తీసుకోవడంతో తండా అంతా సందడిగా మారుతుంది. ఇలా సేకరించిన విరాళం (ధాన్యం) తో తమకు కావాల్సిన గోధుమలు, శనగలు, ఇతర సామాన్లు కొనుగోలు చేస్తారు.గోధుమ మొలకలు..తీజ్ పండుగలో ముఖ్యమైనది తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్ళి దుస్సేరు తీగలు తెచ్చి, బుట్టలను అల్లి, తమ ఆరాధ్య దైవం తుల్జా భవాని, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి, పుట్టమట్టిని తెస్తారు. మేకల ఎరువును కలిపి తండా నాయక్ చేతిలో ఉంచిన బుట్టలో ΄ోస్తారు. అప్పటికే నానబెట్టి ఉంచిన గోధుమలను అందులో వేస్తారు. శనగలకు రేగుముళ్లుతీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనగలకు యువతులు రేగుముళ్లు గుచ్చుతారు. ఈ ప్రక్రియను బావ వరుసయ్యే వారు పడతుల మనస్సు చెదిరేలా వారిని కదిలిస్తూ ఉంటారు.నియమ నిష్టలతో..తండాలోని యువతులందరు తమ బుట్టలను ఒకేచోట పెడతారు. ఈ తొమ్మిది రోజులు పెట్టిన బుట్టలకు నీళ్లు ΄ోస్తూ, వాటి చుట్టూ తిరుగుతూ గిరిజన నృత్యాలు, పాటలు పాడుతూ గడుపుతారు.ఏడవ రోజు ఢమోళీ.. ఏడవరోజు జరిగే ఢమోళీ చుర్మోను మేరామా భవానీకి నివేదిస్తారు. వెండితో చేసిన విగ్రహం, రూపాయి బిళ్ల అమ్మవారి ముందు పెట్టి మేక΄ోతులు బలి ఇచ్చే తంతును‘ఆకాడో’ అంటారు.దేవతల ప్రతిరూపాలకు..ఎనిమిదవ రోజు మట్టితో ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సాంప్రదాయాల ప్రకారం పెండ్లి చేస్తారు. ఆడపిల్లలు పెళ్లి కూతురుగా, మగ పిల్లలు పెళ్లికొడుకుగా ఊహించుకుంటూ ఈ తంతులో పాల్గొంటారు. పెళ్లి తర్వాత తమ కుటుంబ సభ్యులను విడిచి పెడుతున్నట్లు ఊహించుకుని ఏడ్వడం, వారిని కుటుంబ సభ్యులు ఓదార్చడంతో ఈ తంతును నిర్వహిస్తారు.తొమ్మిదవ రోజు నిమజ్జనం..డప్పు చప్పుళ్లు, నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను అందజేస్తారు. యువతులు ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ పూజాఫలంగా పెరిగిన తీజ్‌ను అన్నదమ్ముళ్లకు ఇచ్చి.. వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తర్వాత యువతీ, యువకులు బుట్టలను పట్టుకొని ఊరేగింపుగా వెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. – ఈరగాని భిక్షం, సాక్షి, మహబూబాబాద్, ఫొటోలు: మురళీ కృష్ణ -
తీజ్ సంబరాలు: తీన్మార్ వేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు
అచ్చంపేట: తీజ్ సంబురాలు అచ్చంపేట లో ఆదివారం అంబరాన్నంటాయి. జాగో బంజారా.. బొరావ్ తీజ్ అంటూ.. గిరిజనులు మొలకల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈనెల 21న ప్రారంభించిన తీజ్ వేడుకలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించారు. ఆదివారం ముగింపు వేడుకలు పురస్కరించుకుని సంప్రదాయ వాయిద్యం వాయిస్తూ యువతులు, మహిళలు చేసిన నృత్యాలు చేశారు. ఈ ఉత్సవాల్లో యువతులు తీజ్ బుట్టలను తలపై ఉంచి కుటుంబసభ్యులతో కలిసి బహిరంగ ఊరేగింపులో సంప్రదాయ నృత్యం చేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి గిరిజన బంధువులు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉత్సవాల్లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వర్గీయులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిష్కరించారు. చెరువులో నిమజ్జనం.. గిరిజన భవన్ వద్ద పందిరిపై ఏర్పాటు చేసిన తీజ్ బుట్టలను (మంచెపై) దింపి పీటమీద పెట్టి ఆట,పాటలతో తీజ్ నారును తెంపారు. రేగుచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోధుమనారు(డోనా) చిన్న కర్ర(పీట)లతో యువతీ, యువకులు ఒకరిని ఒకరు ఆటపట్టించారు. మొలకల బుట్టలను తలపై పెట్టుకున్నారు. అమ్మాయిలతో పాటు కుటుంబసభ్యులు, పెద్దమనుషులు అంతాకలిసి ఊరేగింపుగా బయలుదేరారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని గిరిజన తండాల నుంచి భారీగా గిరిజనులు తరలివచ్చారు. బుట్టలతో ఊరేగింపుగా నడింపల్లి చెరువు వద్దకు వెళ్లారు. చెరువు దగ్గర తమ సంప్రదాయ పద్ధతులతో మొలకల బుట్టలకు పూజలు నిర్వహించి చెరువులో నిమజ్జనం చేశారు. పూజలలో పాల్గొన్న అమ్మాయిలు తీసుకున్న రొట్టెలు, ఆకుకూరల ఆహారాన్నే సంప్రదాయ రీతిలో అందరూ అక్కడ తీసుకున్నారు. అనంతరం తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించిన గిరిజన భవన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ పెద్దమనషులకు యువతులు కాళ్లు కడిగి వారి ఆశీర్వాదం పొందారు. అమ్మాయిలకు కూడా పెద్దమనషులు కాళ్లు కడిగి ఆశీర్వదించారు. ఉత్సవాల్లో ఎంపీ, ఎమ్మెల్యే నృత్యం మొలకల పండుగ ఊరేగింపులో ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, బీసీ కమిషన్ సభ్యులు ఆచారి, మనోహర్, మార్కెట్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, బీజేపీ జిల్లా కార్యదర్శి బాలజీ పాల్గొన్నారు. ఎంపీ రాములు గిరిజనులతో పాటు నృత్యం చేశారు. బంజారా గిరిజనులతో పాటు ఎమ్మెల్యేగువ్వల బాలరాజు సతీసమేతంగా పాల్గొన్నారు. అమల మొలకలను తలపై పెట్టుకుని చూపరులను ఆకర్షించారు. -
కాజల్ ఇంట ‘హర్యాలీ తీజ్’వేడుక.. ఫోటోలు వైరల్
Kajal Aggarwal First Teej After Marriage Photos: పెళ్లైన తర్వాత మొదటి వివాహ వార్షికోత్సవం వచ్చే లోపు ఆ నూతన దంపతులు జరుపుకునే ప్రతి పండగ వారికి ప్రత్యేకమే.. ఓ మంచి జ్ఞాపకమే. ఇలాంటి బోలెడు జ్ఞాపకాలను పోగుచేసుకునే పనిలో ఉన్నారు కాజల్ అగర్వాల్. గత ఏడాది అక్టోబరు 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ ఆ వెంటనే సినిమాల షూటింగ్స్‌తో బిజీ అయిపోయారు. ఇప్పుడు కాస్త తీరిక దొరకడంతో ఫ్యామిలీకి టైమ్ కేటాయించారు. పైగా ఇది శ్రావణమాసం కావడంతో తమ దాంపత్య జీవితం బాగుండాలని ‘హర్యాలీ తీజ్’ (భర్త ఆయురారోగ్యాల కోసం పెళ్లయినవాళ్లు, మంచి భర్త రావాలని పెళ్లి కాని అమ్మాయిలు నార్త్‌లో జరుపుకునే పండగ) ఫెస్టివల్‌ను జరుపుకున్నారు. రోజంతా ఉపవాసం ఉన్నారు కాజల్. పండగ చేసుకున్న ఫొటోలను ‘ఫస్ట్ తీజ్.. హర్యాలీ తీజ్’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు కాజల్. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘ఉమ’, ‘ఘోస్టీ’, ‘కరుంగాప్పియమ్’, ‘హే సినామిక’ షూటింగ్‌లను పూర్తి చేసిన ఆమె చిరంజీవితో ‘ఆచార్య’, నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నారు. -
మంగ్లీ ‘తీజ్’ మార్
సాక్షి, మెదక్ : యాంకర్‌గా.. సింగర్‌గా మంగ్లీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. టీవీల్లో మాత్రమే కనిపించే మంగ్లీ ఒక్కసారిగా మనదగ్గరకే వచ్చిందంటే ఇంకేముంది.. పట్టరాని సంతోషంతో పరుగులు పెట్టాల్సిందే. సింగర్ మంగ్లీ ‘తీజ్’ పాట చిత్రీకరణ కోసం మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని రాయిలొంక తండాకు తనబృందంతో శనివారం చేరుకున్నారు. ఎత్తైన గుట్టలు.. పచ్చని చెట్లు.. స్వచ్ఛమైన ప్రకృతి మధ్యన షూటింగ్ చేశారు. లంబాడ వేషధారణలో తీజ్ సాంగ్‌ను చిత్రీకరించారు. మెదక్ జిల్లాలోనే మారుమూల మండలం రాయిలొంక తండాకు ఆమె రాకతో ఆయా తండాల వాసులు, గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. -
తీజ్ వేడుకల్లో అపశృతి
నల్లగొండ: తీజ్ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నేరుడుగోమ్ము మండలం పడమటితండాలో గురువారం వెలుగుచూసింది. తండాలో తీజ్ పండుగ జరుపుకుటున్న సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నారు. -
నేపాల్‌లో ఘనంగా తీజ్ వేడుకలు
-
తీజ్ ఆన్‌పడిఓచ్..
కాలం మారుతున్నా.. అనాదిగా వస్తున్న తమ ఆచార వ్యవహారాలను మాత్రం గిరిజనులు వీడడం లేదు. సంప్రదాయ పండగలు, జాతరలు, ఉత్సవాలు నిర్వహిస్తూ తమ సంసృ్కతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. అలాంటి ఉత్సవాల్లో తీజ్ (మొలకల) పండగ ఒకటి. శ్రావణమాసంతో ప్రారంభమయ్యే తీజ్ ఉత్సవాలు ఇప్పటికే తండాల్లో మొదలయ్యాయి. పండగ జరిగే తొమ్మిది రోజులు తండాల్లోని గిరిజన యువతులు ఆడిపాడతారు. గురువారం చందంపేట మండలం తెల్దేవర్పల్లిలో కూడా తీజ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పండగ విశేషాలు, విశిష్టతలను గుర్తు చేసుకుందాం. తీజ్ పండగొచ్చింది(ఆన్‌పడిఓచ్).. తండాల్లో సంబరాలు నింపింది. లంబాడీలు ఘనంగా నిర్వహించే పండగల్లో తీజ్ ఒకటి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండగకు బతకుదెరువ ు కోసం, ఇతర పనుల కోసం, ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారు కూడా తమ స్వస్థలాలకు వస్తారు. పంటలు బాగా పండాలని, పెళ్లికాని యువతులకు వివాహాలు జరగాలని, మంచి భర్తలు దొరకాలని గిరిజన కుటుం బాలు తమ ఇష్టదైవమైన మేరమ్మను కొలుస్తూ ప్రతిఏటా శ్రావణమాసంలో తీజ్ జరుపుకుంటారు. కాలక్రమంలో సమాజంలో, గిరిజనుల్లో మార్పులు చోటు చేసుకున్నా తీజ్ విషయంలో మాత్రం వారు ఆనాటి సంప్రదాయాన్నే పాటిస్తుండటం విశేషం. ప్రధానంగా పెళ్లీడుకొచ్చిన యువతులకు ఈ పండగ ప్రత్యేకం. మంచి జరుగుతుందని.. గిరిజనుల ఆరాధ్యదైవమైన శీతల భవానీలు(ఏడుగురు దేవతలు) మేరమ్మతల్లి, తుల్జాభవానీ, ద్వాళంగర్ అమ్మవారు, పెద్దమ్మతల్లి, ముత్యాలమ్మతల్లి, ఎల్లమ్మ తల్లి దేవతలను తలుచుకుంటూ ఈ తీజ్ పండగను నిర్వహిస్తుంటారు. దీంతో తండాకు ఎలాంటి కీడు రాదని, మంచి జరుగుతుందని గిరిజనుల నమ్మకం. అదే విధంగా పెళ్లి కాని యువతులు మాత్రమే ఈ పండగను నిర్వహించడం వల్ల వారికి మంచి గుణగణాలు కల్గిన భర్తలు దొరుకుతారనేది వారి విశ్వాసం. వర్షాలు కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని కూడా నమ్ముతారు. తీజ్ పండగకు వారి ఆర్థిక స్థోమతను బట్టి గిరిజన యువతులకు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అంతేగాక ఇంటి ఆడపడుచులు ఇళ్లకు రావడంతో తండాల్లో సందడి నెలకొంటుంది. ప్రత్యేక పూజలు ప్రతిరోజు యువతులు స్నానమాచరించి ఆగరబత్తులతో తీజ్ బుట్టలకు మూడు సార్లు పూజలు చేస్తారు. అంతేగాక ప్రతిరోజు వారివారి బుట్టలలో నీళ్లు పోసి, కొబ్బరికాయలు కొట్టిమొక్కులు చెల్లిస్తారు. ఇలా ఎమిదవరోజు డంబోలి పండగను నిర్వహిస్తారు. ఆ రోజున ప్రతి ఇంటి నుంచి పూజారి బియ్యం, బెల్లం సేకరించి తీజ్ బుట్టలు ఏర్పాటు చేసిన చోట అన్నింటినీ కలిపి పాయసం తయారుచేస్తాడు. అంతేగాక తండా నుంచి గొర్రె పొట్టేళ్లను ఒకేచోట కోసి ప్రతి ఇంటికి ఆ మాంసాన్ని భాగాలుగా చేసి పంపిస్తారు. పాయసాన్ని ముద్దలుగా చేసి ప్రతి ఇంటికి అంద జేస్తారు. 9వ రోజు సాయంత్రం పందిరిపై నుంచి బుట్టలను తీసి కింద ఉంచి వాటి చుట్టూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతారు. అదేవిధంగా తండాకు చెందిన పురుషులు తీజ్ బుట్టల వద్ద వరుసగా కూర్చుంటారు. అనంతరం యువతులు పెరిగిన గోధుమ గడ్డిని తెంచి పురుషుల తలలు, చెవులలో పెడతారు. అనంతరం ఆ బుట్టలను చెరువులో నిమజ్జనం చేసి అక్కడే సోదరుని వరుసయ్యే పురుషులు యువతుల కాళ్లను కడిగి వారిని ఇళ్లలో చేసుకొచ్చిన పంటలను(కేత్) తినిపించడం ఆనవాయితీ. పురుషులపై వేసిన ఆకులను ఇంటికి తీసుకెళ్లి దేవుని వద్ద భద్రపరుస్తారు. రోజూ వాటికి పూజలు చేస్తుంటారు.