సాక్షి, మెదక్ : యాంకర్‌గా.. సింగర్‌గా మంగ్లీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. టీవీల్లో మాత్రమే కనిపించే మంగ్లీ ఒక్కసారిగా మనదగ్గరకే వచ్చిందంటే ఇంకేముంది.. పట్టరాని సంతోషంతో పరుగులు పెట్టాల్సిందే. సింగర్ మంగ్లీ ‘తీజ్’ పాట చిత్రీకరణ కోసం మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని రాయిలొంక తండాకు తనబృందంతో శనివారం చేరుకున్నారు. ఎత్తైన గుట్టలు.. పచ్చని చెట్లు.. స్వచ్ఛమైన ప్రకృతి మధ్యన షూటింగ్ చేశారు. లంబాడ వేషధారణలో తీజ్ సాంగ్‌ను చిత్రీకరించారు. మెదక్ జిల్లాలోనే మారుమూల మండలం రాయిలొంక తండాకు ఆమె రాకతో ఆయా తండాల వాసులు, గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment