పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన సోమవారం రంగారెడ్డి జిల్లా యాలాల మండలం పెర్కంపల్లి గ్రామ సమీపంలో జరిగింది.
యాలాల(రంగారెడ్డి జిల్లా): పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన సోమవారం రంగారెడ్డి జిల్లా యాలాల మండలం పెర్కంపల్లి గ్రామ సమీపంలో జరిగింది. వివరాలు..బషీరాబాద్ మండలం కుప్తాన్‌కోట్ తండాకు చెందిన మోహన్(30), జహీరాంనాయక్(38), కాల్యానాయక్‌లు జంతపల్లి గ్రామంలో మేక పిల్లను కొనుగోలు చేసేందుకు వెళ్లారు. మేకపిల్లను కొనుగోలు చేసి తిరిగి తమ గ్రామానికి వస్తుండగా వర్షం కురిసింది.
దీంతో మోహన్, జహీరాం నాయక్‌లు ఇద్దరి మేకపిల్లతో కలిసి ఒక చెట్టు కింద నిల్చున్నారు. వారికి కొద్ది దూరంలో ఉన్న ఒక చెట్టు కింద కాల్యానాయక్ నిల్చున్నాడు. అదే సమయంలో పిడుగు మోహన్, జహీరాంనాయక్‌లు నిల్చున్న చెట్టుపై పడటంతో మేకపిల్లతో పాటు వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఇది చూసిన కాల్యానాయక్ గ్రామస్తులకు సమాచారం అందించాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.