
విషజ్వరంతో ఇద్దరు మృతి
చిగురుమామిడి :
మండలంలోని ముల్కనూర్‌కు చెందిన లోకిని కొమురవ్వ(30) విషజ్వరంతో బాధపడుతూ మృతిచెందింది. కొమురవ్వకు గత నెల 17వ తేదీన జ్వరం వచ్చింది. స్థానికంగా చికి త్స పొందినా తగ్గలేదు. కరీంనగర్‌లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్ష లు నిర్వహించిన వైద్యులు ప్లేట్‌లెట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించి వైద్య సేవలందించారు.
దాదాపు రూ.1.50 లక్షలు ఖర్చయ్యాయి. జ్వరం తగ్గలేదని మరింత డబ్బు కావాలని ఆస్పత్రి నిర్వాహకులు కోరగా.. తన వద్ద ఇక డబ్బు లేద ని మృతురాలి భర్త పోచయ్య తెలిపాడు. దీంతో ఆమెను ఆస్పత్రినుంచి డిశ్చార్చి చేయగా కొమురవ్వ శనివారం వేకువజామున మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
రాజాపూర్‌లో..
ముత్తారం : మండలంలోని లద్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధి రాజాపూర్‌కు చెందిన టెలుసూరి ఐలమల్లు(52) శనివారం విషజ్వరంతో మృతిచె ందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం... ఐలమల్లు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక వైద్యుడి వద్ద చికిత్స చేయిస్తున్నారు. అయినా ఎంతకీ తగ్గకపోవడంతో శుక్రవారం గోదావరిఖనిలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. రక్తకణాలు క్షీణించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య సారమ్మ, కుమారుడు చంద్రం, కూతుళ్లు రజిత,శ్యామల ఉన్నారు.
బావిలో పడి వృద్ధుడు...
యైటింక్లయిన్‌కాలనీ : కమాన్‌పూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన నీలం రాజయ్య(68) శుక్రవారం రాత్రి బావిలో పడి మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రిపూట బయటకు వెళ్లిన ఇతను ప్రమాదవశాత్తు అందులో అందులో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు గోదావరిఖని టూటౌన్ ఎస్సై విద్యాసాగర్‌రావు కేసు నమోదు చేసుకున్నారు.
నిప్పటించుకుని మహిళ...
జ్యోతినగర్ : మానసిక స్థితి సరిగా లేక ఓ మహిళ నిప్పటించుకుని మృతి చెందిన సంఘటన ఎల్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధి ఇందిరానగర్‌లో శనివారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఇందిరానగర్‌కు చెందిన చిలుముల రాజమ్మ(50)కు మానసిక స్థితి సరిగా లేదు.
నాలుగేళ్లుగా చికిత్స పొందుతూ ఇంట్లో నే ఉంటోంది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అరుపులు విన్న రాజమ్మ కుమారుడు వెళ్లి మంటలు ఆర్పి 108లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి భర్త పోశం ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ పోలీసులు కేసునమోదు చేసుకుని సంఘటననా స్థలాన్ని పరిశీలించారు.