Corporate Hospital
-
ఉద్యోగులకు మెరుగైన హెల్త్ స్కీం తెస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై దృష్టిసారించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లినా తక్షణమే నగదురహిత ఉచిత వైద్యం అందేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే డిజిటల్ ఫ్యామిలీ కార్డుల జారీ కోసం సేకరిస్తున్న కుటుంబాల వివరాల్లో ప్రజలు ఆరోగ్య సమాచారాన్ని కూడా నిక్షిప్తం చేస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అమలుపై మంత్రి దామోదర ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ప్రభుత్వోద్యోగులకు ఇప్పటికీ నగదురహిత వైద్య సేవలు సరిగ్గా అందట్లేదు. ఈ పథకాన్ని మెరుగుపరిచేందుకు ఏం చేయబోతున్నారు? దామోదర: ఉద్యోగులు, పింఛన్‌దారులు, జర్నలిస్టులకు నగదురహిత ఆరోగ్య పథకాన్ని (ఈహెచ్ఎస్) కొత్తగా తీర్చిదిద్దేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా జీవో జారీచేసింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు. మేం అత్యంత పకడ్బందీగా ఆ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ట్రస్ట్ ద్వారా నగదురహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలా లేక బీమా పద్ధతిలో అమ లు చేయాలా అనే విషయమై ఆలోచిస్తున్నాం. ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ తీసుకోవాలా లేదా? అనే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఉద్యోగుల అభిప్రాయం తీసుకొని వారు కోరుకుంటున్నట్లుగా ఈ పథకానికి రూపకల్పన చేస్తాం. సాక్షి: తొలుత డిజిటల్ హెల్త్ కార్డులని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా అన్ని పథకాలకు వర్తించేలా డిజిటల్ ఫ్యామిలీ కార్డులు జారీ చేస్తామంటోంది. ఈ మార్పునకు కారణం ఏమిటి?దామోదర: మొదట డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు, సేవలకు ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డుంటే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా ఏకీకృతం చేయడం వల్ల ప్రజలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఒక్కో సేవకు ఒక్కో కార్డు అంటూ ఇవ్వడం వల్ల అంతా గందరగోళం నెలకొంటుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.సాక్షి: సైబర్ దాడుల ముప్పు నేపథ్యంలో ప్రజల వివరాలతో కూడిన డిజిటల్ హెల్త్ కార్డులు ఎంతవరకు భద్రం?దామోదర: సైబర్ దాడులకు గురికాకుండా, ప్రజల సమాచారం ఇతరుల చేతుల్లోకి పోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం ఆషామాషీగా వ్యవహరించదు. సాక్షి: వైద్య, ఆరోగ్యశాఖకు దాదాపు రూ. 5 వేల కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులకు ఆమోదం లభించిందా? ఈ నిధులను వేటి కోసం వాడతారు?దామోదర: ప్రపంచ బ్యాంకు నిధుల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవేళ ప్రపంచ బ్యాంకు నిధులు వస్తే వైద్య మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తాం. ప్రధానంగా 14 కాంపోనెంట్లపై కేంద్రీకరిస్తాం. ట్రామా కేర్ సెంటర్లు, డయాలసిస్ సెంటర్లు, వ్యాస్క్యులర్ యాక్సెస్ సెంటర్లు, సిములేషన్ అండ్ స్కిల్ ల్యాబ్స్ ఫర్ ఎమర్జెన్సీ కేర్, ఇంటిగ్రేటెడ్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్, డయాగ్నొస్టిక్ సర్వీసెస్ పెంపు, ఆర్గాన్ రిటీవ్రవల్ అండ్ స్టోరేజ్ సెంటర్లు, ఆరోగ్య మహిళ కార్యక్రమంతో కలిపి ఎంసీహెచ్ సర్వీసెస్ మెరుగుపరచడం, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్లు, డ్రగ్స్ డీఅడిక్షన్ సెంటర్లు, టిమ్స్, ఉస్మానియా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొత్త పరికరాల కొనుగోళ్లు, కేన్సర్ కేర్‌లపై దృష్టిసారిస్తాం.సాక్షి: ఇప్పటివరకు వైద్య నియామకాలు ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇంకెంతమందిని భర్తీ చేస్తారు?దామోదర: ఇప్పటివరకు 7,308 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేశాం. ఇంకా 6,293 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. వాటికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. -
పేద ప్రాణంపై కార్పొరేట్ ఆస్పత్రి దాష్టీకం
ఒంగోలు టౌన్: చికిత్స కోసం వచ్చిన ఒక పేద కుటుంబాన్ని నగరంలోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి చేతికందిన కాడికి దోచుకుంది. అయినాసరే కడుపునిండని వైద్యశాల నిర్వాహకులు.. అడిగినంత డబ్బు చెల్లించలేదని ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని అర్ధరాత్రి వైద్యశాల నుంచి పంపించి వేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... యర్రగొండపాలేనికి చెందిన బెల్లంకొండ ఆదిలక్ష్మిపై భర్త చినగురవయ్య, అతడి కుటుంబ సభ్యులు కలిసి ఆగస్టు చివరలో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిని ఆదిలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో పనిచేస్తున్న బాధితుడి తాలూకా బంధువు ఒకరు ఇక్కడి కంటే చికిత్స బయట ఆస్పత్రిలో బాగుంటుందని, అక్కడి డాక్టర్లు తనకు బాగా తెలుసని చెప్పి రిమ్స్ ఎదురుగా ఉన్న లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. తొలుత రూ.లక్ష ఖర్చు చేస్తే మీ అమ్మాయి కోలుకుంటుందని మధ్యవర్తి నమ్మించి వైద్యశాలలో చేర్పించారు. అసలు కథ అప్పుడు ప్రారంభమైంది. మొదట రూ.40 వేలు అడ్వాన్స్ కట్టించుకున్నారు. ఆ తర్వాత అర్జంటుగా ఆపరేషన్ చేయాలి రూ.70 వేలు కట్టమన్నారు. అలా మొదలుపెట్టిన వైద్యశాల నిర్వాహకులు రోగి నుంచి విడతలవారీగా రూ.9 లక్షల వరకూ వసూలు చేశారు. 40 రోజులు దాటిపోయినా రోగి మాత్రం కోలుకోలేదు. కానీ, మరో రూ.2 లక్షలు చెల్లించాలని, లేకపోతే వైద్యం చేయమని నిర్వాహకులు ఒత్తిడి చేయడం మొదలెట్టారు. ఆదిలక్ష్మి తలిదండ్రులు వల్లబాయి వెంకటేశ్వర్లు, నాగమ్మ కూలి పనులు చేసుకుంటూ బతుకుబండి లాగుతుంటారు. రెక్కాడితేగానీ డొక్కాడని వారు.. బిడ్డ బతుకుతుందన్న ఆశతో యర్రగొండపాలెంలోని ఇంటిని తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చారు. చివరికి మందులకు కూడా డబ్బు లేకపోవడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి ఒంగోలు ఆర్టీసీ బస్టాండుకు వెళ్లి బిక్షాటన చేసి రూ.3 వేలు తెచ్చి మందులు కొనుగోలు చేశారు. మరో రూ.2 లక్షలు చెల్లిస్తేగానీ ఇకముందు వైద్యం చేయడం కుదరదని తేల్చిచెప్పడంతో ఆందోళనకు గురైన బాధితురాలి తల్లి నాగమ్మ వైద్యశాల నిర్వాహకులను బతిమాలుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేగాకుండా నాగమ్మను వైద్యశాల నిర్వాహకుడు రాజా దూషించడంతో పాటు దురుసుగా ప్రవర్తించినట్లు కన్నీటి పర్యంతమైంది. గత సోమవారం రాత్రి అపస్మారక స్థితిలో ఉన్న ఆదిలక్ష్మికి చికిత్స చేయకుండా డిశ్చార్జి సమ్మరి ఇవ్వకుండా బయటకు పంపించారు. ఏం చేయాలో దిక్కుతోచక రోదిస్తూ స్థానికుల సలహా మేరకు 108కు ఫోన్ చేసి రిమ్స్‌కు వెళ్లారు. ఆదిలక్ష్మి పరిస్థితి విషమంగానే ఉండటంతో ఐసీయూలో చేర్చారు. అయితే రోగుల వద్ద డిశ్చార్జి రిపోర్టు లేకపోవడంతో ఆమెకు ఎలాంటి వైద్యం జరిగిందో తెలియక తదుపరి ఏం చికిత్స చేయాలో అర్థంగాక వైద్యులు గందరగోళంలో పడ్డారు. విచారణకు ఆదేశించిన కలెక్టర్ దినేష్‌కుమార్... ఆదిలక్ష్మి తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, నాగమ్మ బుధవారం కలెక్టర్ దినేష్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రూ.9 లక్షలు వసూలు చేయడంపై కలెక్టర్ ఆశ్చర్యానికి గురయ్యారు. డిశ్చార్జి రిపోర్టు ఇవ్వకపోగా మరో రూ.2 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసిన లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై వెంటనే డీఎంఅండ్‌హెచ్‌ఓను విచారణకు ఆదేశించారు. చికిత్స పేరుతో వసూలు చేసిన డబ్బు మొత్తం తిరిగి ఇప్పించాలని సూచించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆదిలక్ష్మిని గుంటూరు తరలించి మరింత మెరుగైన చికిత్స అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డబ్బు చెల్లించకపోతే రిపోర్టులు ఎలా ఇస్తామన్న ఆస్పత్రి నిర్వాహకుడు... ఆస్పత్రికి చెల్లించాల్సిన ఫీజు మొత్తం చెల్లించకపోతే డిశ్చార్జి సమ్మరి ఎలా ఇస్తామని ఆస్పత్రి నిర్వాహకుడు కృష్ణ నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. ఆదిలక్ష్మి విషయం గురించి వివరణ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం అంటేనే లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడం గమనార్హం. -
Hyderabad: హిందీ నేర్చుకుంటూ.. ఆదాయం అందుకుంటూ..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలోని రిసెప్షన్లో ఉన్న వ్యక్తుల్ని ‘‘కిత్నా రూపియా టెస్ట్ కే లియే? (పరీక్షలకు ఎంత ఖర్చవుతుంది?)’’అని ఆఫ్రికాకు చెందిన కవాంగు(25) అడుగుతోంది. కెన్యా నుంచి న్యూరో సర్జన్‌ను సంప్రదించడానికి నగరానికి వచ్చిన ముగ్గురు రోగులు తనకు కస్టమర్లుగా ఉన్నారు. వారికి అవసరమైన సంప్రదింపులు, పరీక్షల ఏర్పాట్ల నుంచి రెస్టారెంట్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడం దాకా అన్నీ కవాంగు బాధ్యతలే. విదేశీయులకు అత్యున్నత వైద్యసేవల్ని మాత్రమే కాదు ఆదాయమార్గాలను కూడా నగర వైద్యం అందిస్తున్న తీరుకు కువాంగు ఒక ఉదాహరణ. తన కుటుంబంతో నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి అలాంటి ఫెసిలిటేటర్ సహాయంతో సంక్లిష్టమైన కాలేయ సమస్యకు కవాంగు చికిత్స పొందింది. ఆ తర్వాత తానే ఫెసిలిటేటర్‌గా మారితే రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు సంపాదించవచ్చని అర్థమయ్యాక కవాంగు మూడేళ్లుగా అదే పనిచేస్తూ నగరంలోనే ఉంటున్నారు. ఆ వృత్తి కోసం కొంచెం హిందీ కూడా నేర్చుకుందామె. ‘హిందీ భాష నేర్చుకోవడం కోసం కోర్సులో చేరడంతోపాటు బాలీవుడ్ సినిమాలు చూడటం ప్రారంభించాను‘అని ఆమె చెప్పారు. టోలీచౌకి కేంద్రంగా... ఫెసిలిటేటర్లుగా వ్యవహరిస్తున్నవారికి కేంద్రంగా నగరంలోని టోలీచౌకి మారిందని ఓ ఆసుపత్రికి చెందిన మార్కెటింగ్ విభాగ ప్రతినిధి తెలిపారు. ఈ ఏరియాలోని ప్రీమియర్ అపార్ట్మెంట్లో అద్దెకుండేవారిలో అత్యధికులు ఈ తరహా సేవల్లో నిమగ్నమవుతున్నారన్నారు. చాలామంది ఇక్కడ ట్రావెల్ లేదా స్టడీ వీసాపై మాత్రమే ఉన్నారు. కాబట్టి ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌కి సంబంధించిన సమస్యల గురించి భయపడివారు తమపేరు తదితర వ్యక్తిగత వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు, ‘‘మాకు క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు నైరోబీలోని ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు మాకు సహాయం చేస్తారు’’అని నైరోబీకి చెందిన మార్గరెట్ కారీ చెప్పారు. కొన్ని ఆసుపత్రులు దేశీయ రోగులతో పోలిస్తే అంతర్జాతీయ రోగులకు ట్రీట్మెంట్ రేట్లు అమాంతం 50 శాతం మేర పెంచేసి వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులు ఫెసిలిటేటర్లకు బిల్లును బట్టి 15 నుంచి 20 శాతం కూడా ఇస్తున్నారని సమాచారం. ‘సోమాలియాలో ఆరోగ్య సంరక్షణకు సరైన మౌలిక సదుపాయాలు లేవు. దాంతో చికిత్స కోసం థాయ్‌లాండ్, మలేషియా, చైనాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు చాలామంది భారతదేశానికి, అందులోనూ హైదరాబాద్‌కు వస్తున్నారు, అందువల్ల నేనిక్కడ ఉంటూ బంధువులు, స్నేహితులకు సహాయం చేయడం ప్రారంభించాను. అలా చాలామంది నాతో కనెక్ట్ అయ్యారు’అని 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన సోమాలియా జాతీయుడైన జువేద్ అన్నారు. ఏజెన్సీలూ ఉన్నాయి... మెడికల్ టూరిజమ్ సేవలు అందించే కొన్ని అంతర్జాతీయ కంపెనీలు చట్టప్రకారం కొందరిని ఫెసిలిటేటర్లుగా నియమించుకుని రోగులకు సహాయకులుగా వినియోగిస్తాయి. ఇలాంటి సంస్థలు ఢిల్లీ, ముంబై, బెంగుళూర్లలో ఎక్కువ. వాటి సేవలు హైదరాబాద్‌కు ఇంకా విస్తృతంగా వ్యాపించలేదు. దాంతో ఇక్కడ వ్యక్తిగతంగా సేవలు అందించే ఫెసిలిటేటర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. వీటిని అందిపుచ్చుకుంటున్న విదేశీ విద్యార్థులు నగరంలోని హైదరాబాద్, ఉస్మానియా వంటి యూనివర్సిటీల్లో చదువుకుంటూ పార్ట్‌టైమ్‌గా ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. పదేళ్లు, పన్నెండేళ్ల పాటు నర్సింగ్ స్టాఫ్, ఫిజియోథెరపీ స్టాఫ్‌గా సేవలు అందించినవాళ్లు కూడా జోర్డాన్, ఇరాక్, సిరియా తదితర మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చి అక్కడి పరిచయాలను, అరబిక్ భాష మీద పట్టు లాంటి సానుకూల అంశాలతో ఫెసిలిటేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ఉభయ కుశలోపరి విధానం మా ఆసుపత్రికి నైజీరియా, కెన్యా, సుడాన్, సోమాలియా తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. వీరి కోసం మేం అధికారికంగా ఉన్న సంస్థల నుంచి ఫెసిలిటేటర్ల సేవలు అందుకుంటాం. అరుదుగా మాత్రం తెలిసిన, పరిచయస్తులను ఉపయోగించుకుంటాం. రోగులకు ఎదురయ్యే భాషా పరమైన ఇతర అవరోధాలకు పరిష్కారంగానూ, మరోవైపు ఇక్కడ విద్యార్జన తదితర పనులపై వచ్చేవారికి ఆదాయమార్గంగానూ ఈ విధానం ఉపకరిస్తోంది. –డా.కిషోర్‌రెడ్డి, అమోర్ ఆసుపత్రి -
బంజారాహిల్స్: రూ. 20 పార్కింగ్ ఫీజుకు రూ. 50 వేల జరిమానా
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి ఆవరణలో పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లుగా సోషల్ యాక్టివిస్ట్ విజయ్‌గోపాల్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సదరు ఆస్పత్రికి రూ. 50 వేల జరిమానా విధించింది. వివరాలివీ... ఈ నెల 15వ తేదీన రోగిని చూసేందుకు వచ్చిన సహాయకుడు తన స్కూటర్‌ను ఆ కార్పొరేట్ ఆస్పత్రి పార్కింగ్ ఆవరణలో పార్కింగ్ చేసి వెళ్లాడు. చదవండి: హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు అరగంటసేపు పార్కింగ్‌లో ఉంచినందుకుగాను రూ. 20 ఫీజు వసూలు చేశారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా విజయ్‌గోపాల్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ సెల్ మంగళవారం ఆస్పత్రిలో పార్కింగ్ ఫీజు వసూలు చేసినందుకు సదరు ఆస్పత్రికి రూ. 50 వేల జరిమానా విధిస్తూ ఈ–చలానా జారీ చేసింది. చదవండి: హుజుర్నగర్లో వింత కేసు.. పోలీస్‌స్టేషన్‌కు చేరిన పిల్లి పంచాయితీ.. -
చికిత్స చేసిన డాక్టర్‌కే ఒమిక్రాన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యుడికి కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ సోకింది. సూడాన్ దేశం నుంచి వచ్చిన ఓ ఒమిక్రాన్ రోగికి (44) క్యాన్సర్ చికిత్స చేస్తుండగా ఆ వైద్యుడికి వైరస్ వ్యాపించినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ డాక్టర్, పేషెంట్‌తో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లందరినీ ఆస్పత్రి యాజమాన్యం క్వారంటైన్‌కు పంపింది. ఇలా రాష్ట్రంలో ఒకరి నుంచి మరొకరికి ఒమిక్రాన్ వ్యాపించడం ఇదే తొలిసారి. డాక్టర్‌తో కలిపి మంగళవారం రాష్ట్రంలో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మిగిలిన ముగ్గురిలో ఒకరు సూడాన్ వాసి, ఇద్దరు సోమాలియా దేశస్తులు. తాజా కేసులతో రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 24కు పెరిగింది. వీళ్లందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వైద్యారోగ్య శాఖ అప్రమత్తం సూడాన్ దేశం నుంచి ఈ నెల 14న క్యాన్సర్ రోగి నగరానికి వచ్చారు. సూడాన్ నాన్ రిస్క్ కేటగిరీలో ఉండటంతో ప్రయాణికులకు ర్యాండమ్‌గా టెస్టులు చేసి పంపారు. ఆ సుడాన్ వాసికి ఇక్కడి ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. అయితే ఆయనకు కరోనా ఉందని వెల్లడవడంతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ ఉన్నట్టు 16న తేలింది. అయితే ఆ క్యాన్సర్ రోగికి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆస్పత్రి వర్గాలు జాగ్రత్తలు తీసుకొని చికిత్స చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలో వైద్యుడికి కొత్త వేరియెంట్ వ్యాపించింది. అప్రమత్తౖమైన వైద్యారోగ్య శాఖ ఆ వైద్యుడి కుటుంబీకులు, అతనితో సన్నిహితంగా మెలిగిన ఇతర వైద్య సిబ్బంది, రోగుల నుంచి నమూనాలను సేకరిస్తోంది. ఆ వైద్యుడి నుంచి ఇంకెంతమందికి వైరస్ అంటిందోనని ఆందోళన నెలకొంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరో 726 మంది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం 726 మంది ప్రయాణికులు వచ్చారు. వీళ్లలో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. వీరి నమూనాలను సీక్వెన్సింగ్‌కు పంపారు. మొత్తం 13 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో ముప్పు లేని దేశాల నుంచి వచ్చిన వాళ్లు 19 మంది ఉన్నారు. కొత్తగా 172 కరోనా కేసులు రాష్ట్రంలో కొత్తగా 172 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,79,892కు పెరిగింది. వైరస్ బారిన పడి మరొకరు కన్నుమూశారు. ఇప్పటి వరకూ 4,016 మంది మృతిచెందారు. -
కార్పొరేట్ ఆసుపత్రి ఉద్యోగి ఆడియో లీక్
-
20 లక్షల బిల్లు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తాం!
రాంగోపాల్‌పేట్: కరోనా మహమ్మారి పేరుతో దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం, హైకోర్టు హెచ్చరికలు జారీ చేస్తున్నా అవి తమకు వర్తించవన్నట్లు వ్యవహరిస్తున్నాయి. వివరాలివీ... ముషీరాబాద్‌కు చెందిన 49 సంవత్సరాల ఓ వ్యక్తి సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గత నెల 20వ తేదీన సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. అతను పనిచేసే సంస్థకు చెందిన ఇన్య్సూరెన్స్ నుంచి డబ్బు చెల్లించేందుకు వారు ఒప్పుకున్నారు. ఇలా 22 రోజులకు గాను రూ. 20 లక్షల బిల్లు వేశారు. చికిత్స పొందుతూ ఈ నెల 12వ తేదీ రాత్రి 9 గంటలకు ఆయన మరణించారు. చికిత్సకు రూ. 20 లక్షలు బిల్లు అయిందని... బీమా సొమ్ము పోను మిగతా రూ. 8 లక్షలు చెల్లించాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో నిరుపేద అయిన ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. విషయం చెప్పి మృతదేహం ఇవ్వాలని కోరినా అప్పగించలేదు. విషయం తెలుసుకున్న క్రైస్తవ సంఘాల నాయకులు అక్కడికొచ్చి ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం... జీహెచ్ఎంసీ, పోలీసులు సకాలంలో రాకపోవడంతో మృతదేహం అప్పగింతలో ఆలస్యం జరిగిందని స్పష్టం చేసింది. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం: మత్తయ్య కరోనా పేరుతో ప్రజలను దోపిడీకి గురిచేస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని క్రైస్తవ ధర్మప్రచార సమితి అధ్యక్షుడు జెరూసలెం మత్తయ్య ఆరోపించారు. చిన్నచిన్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఇలాంటి పెద్ద పెద్ద ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తమ తప్పు బయటపడకుండా బాధితులను బెదిరింపులకు పాల్పడి తమకు అనుకూలంగా రాయించుకున్నారని ఆరోపించారు. -
కార్పొ‘రేట్’పై కొరడా!
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్స పేరిట రోగుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు గుంజుతున్న ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. ఆయా ఆస్పత్రులకు ఇచ్చిన కరోనా చికిత్స అనుమతులను రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. భారీగా ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఇలాంటి ఆస్పత్రులపై రెండు, మూడు రోజుల్లో తనిఖీలు నిర్వహించి చికిత్సలు, ఫీజుల రికా ర్డులను పరిశీలించనుంది. అం దుకోసం బృందాలను సిద్ధం చేసింది. కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు సభ్యులు చనిపోయినా మానవత్వం మరిచి ఇంకా రూ. లక్షలు చెల్లించాలంటూ ఒక ఆస్పత్రి డిమాండ్ చేసిన విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి రావడం, దానిపై ఆయన స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు సూచించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాసుల కక్కుర్తి ప్రదర్శిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలకు సర్కారు రంగం సిద్ధం చేసింది. శవాలపై పేలాలు ఏరుకుంటున్నారు... రాష్ట్రంలోని చాలా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వేళ యాజమాన్యాలు కనికరం చూపట్లేదని, అధిక ఫీజు వసూళ్లు, నాసిరకం వైద్యం చేస్తున్నాయని మండిపడుతున్నారు. కరోనా చికిత్సలకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏవైనా సమస్యలుంటే తమకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం గత నెల 16న 9154170960 వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వెయ్యికిపైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా ఫీజుల దోపిడీకి సంబంధించినవే ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అలాగే ప్రైవేటు బీమా సౌకర్యం ఉన్నా ఆస్పత్రులు దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా డబ్బులు వసూలు చేస్తున్నాయని మరికొందరు ఫిర్యాదు చేశారు. కరోనా నెగెటివ్ వచ్చినా పాజిటివ్ అని చెప్పి వైద్యం చేస్తూ రూ. లక్షలు గుంజుతున్నాయని మరికొన్ని ఫిర్యాదులు అందాయి. విచిత్రమేంటంటే ఒక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రి అయితే ఒక వ్యక్తికి వైద్యం చేసినందుకు ఏకంగా రూ. 18 లక్షలకుపైగా బిల్లు వేసిందని ఫిర్యాదు అందింది. కొందరికి సాధారణ లక్షణాలున్నా ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి రూ. లక్షల్లో ఫీజు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక కుటుంబానికైతే తీవ్ర ఆవేదన కలిగించేలా ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించింది. కరోనా బాధితుడు కోలుకుంటున్నాడని, ఫీజు కింద మొత్తం రూ. 5 లక్షలు చెల్లిస్తే డిశ్చార్జి చేస్తామని చెప్పింది. తీరా ఫీజు కట్టాక ఆ కుటుంబానికి శవాన్ని అప్పగించినట్లు ఫిర్యాదు అందిందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. శవాలపై పేలాలు ఏరుకున్నట్లుగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తున్నాయని బాధితులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు నివేదిక... సర్కార్ ప్రవేశపెట్టిన వాట్సాప్ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా డీఎంహెచ్వోలను ఆదేశించింది. ఆ ప్రకారం ఇప్పటికే చాలా ఆస్పత్రులపై విచారణ జరిపారు. చిన్నచిన్న సమస్యలుంటే యాజమాన్యాలను మందలించి విడిచిపెడుతున్న అధికారులు.. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రులపై లోతైన విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారం మంత్రి కేటీఆర్ దృష్టికి రావడంతో వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం మొత్తం కదిలింది. అమానుషంగా వ్యవహరిస్తున్న కొన్ని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నెల క్రితం కొన్ని ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లు ఇష్టారాజ్యంగా, నాసిరకంగా కరోనా పరీక్షలు చేసినప్పుడు వాటికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం... ఇప్పుడు కొన్ని ఆస్పత్రులకు కరోనా చికిత్స చేసే వెసులుబాటును రద్దు చేయనుంది. దీనిపై ఇప్పటికే వాటికి నోటీసులు పంపింది. చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాట్సాప్ నంబర్‌కు ప్రైవేటు ఆస్పత్రులపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటన్నింటినీ పరిశీలిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికైనా కరోనా బాధితులు వేలాది పడకలు అందుబాటులో ఉన్న, ఉచితంగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నా. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు -
నర్సులకు ఆఫర్లే ఆఫర్లు!
‘అర్జంట్... అర్జంట్... స్టాఫ్ నర్సులు కావలెను’ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి ఇచ్చిన ప్రకటన ఇది. ‘నెలకు రూ.50 వేల జీతం, ఉచిత వసతి, కేరళ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఉచిత విమాన ప్రయాణం, చార్జీలు భరిస్తాం’ ఇది ప్రకటన సారాంశం. బీఎస్సీ, జీఎన్ఎం, ఏఎన్ఎం కోర్సులు చదివినవారు ఆరు నెలలపాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు కావాలని కోరింది. సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా కాలం.. రోగుల తాకిడి కూడా బాగానే ఉంది.. కాసులను దండిగా దండుకోవచ్చనుకున్నారు.. కానీ, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సరిపడా లేరు. తగిన వైద్యసేవలందించే పరిస్థితి లేక పడకలు చాలావరకు ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఆదాయానికి భారీగా గండి పడింది. ఫలితంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు విలవిలలాడిపోతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను ఇప్పుడు వేధిస్తున్న ప్రధానసమస్య నర్సుల కొరత. ఇతర పారామెడికల్ సిబ్బంది కూడా సరిపడాలేరు. ఈ నేపథ్యంలో నర్సులకు ఆఫర్లు, ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి కార్పొరేట్ ఆసుపత్రులు. రూ.50 వేల జీతం, ఉచిత వసతి కల్పిస్తామంటూ ప్రకటనలిస్తున్నాయి. గురువారం సర్కారు విడుదల చేసిన లెక్కల ప్రకారమే 95 ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 5,494 పడకలు కరోనా కోసం కేటాయించగా, అందులో 2,197 ఖాళీగా ఉన్నాయి. రోగులు భారీగా వస్తున్నా పడకలు లేవంటున్నాయి. సిబ్బంది కొరతతోనే తాము అలా చెప్పాల్సి వస్తుందని ఆసుపత్రుల పేర్కొంటున్నాయి. వెయ్యిమంది నర్సులకు కరోనా వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారమే దాదాపు వెయ్యి మంది నర్సులు కరోనా బారినపడ్డారు. నర్సింగ్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ప్రతీ పదిమంది నర్సుల్లో ముగ్గురు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో వంద మంది పనిచేసే ప్రైవేట్ ఆసుపత్రుల్లో 30 మంది అనారోగ్యంతో ఉంటున్నారు. దీంతో వారంతా సెలవులు పెడుతున్నారు. చాలామంది భయాందోళనకు గురవుతూ తక్కువ జీతాలకు పనిచేయబోమని రాజీనామా చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. వివిధ రాష్ట్రాల్లో ప్రకటనలు నర్సులు కావాలంటూ వివిధ రాష్ట్రాల్లో ప్రకటనలు వేసి రప్పించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రయత్నిస్తున్నాయి. ఒక గుంపుగా ఎక్కువమంది వచ్చేట్లయితే వారికోసం ఒక చార్టర్డ్ ఫ్లైట్‌ను బుక్ చేసేందుకూ కార్పొరేట్ యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలో అత్యంత పేరొందిన ఒక ఆసుపత్రికి చెందిన ఓ బ్రాంచిలో 40కిపైగా కరోనా పడకలు ఖాళీగా ఉన్నాయి. అదేస్థాయి కలిగిన మరో ఆసుపత్రికి చెందిన ఒక బ్రాంచిలో 50, మరో ప్రముఖ ఆసుపత్రికి చెందిన రెండు బ్రాంచీల్లో 160, ఇంకో కార్పొరేట్ ఆసుపత్రిలో 170కు పైగా కరోనా పడకలు ఖాళీగా ఉన్నాయి. 40కి పడకలు ఖాళీగా ఉన్న ఆసుపత్రి సరాసరి ఒక్కో రోగి నుంచి రూ.10 లక్షల చొప్పున వసూలు చేసినా పది రోజుల్లో రూ.4 కోట్లు కోల్పోయే పరిస్థితి యాజమాన్యాలకు ఏర్పడింది. ఇలా భారీగా ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో స్టాఫ్ నర్సులు, ఇతర నర్సులకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం ఇటీవల ఓ ఆసుపత్రి కేరళ నుంచి కొందరు నర్సులను ఆగమేఘాల మీద చార్టర్డ్ ఫ్లైట్‌లో తెప్పించింది. వారి అనుభవం, డిమాండ్‌ను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష ఇచ్చేందుకు కూడా సిద్ధపడింది. అలా కొందరిని ఇటీవల రిక్రూట్ చేసుకుంది. ఇంకా కొందరు కావాలంటూ తాజాగా మరో ప్రకటన జారీ చేసింది. రూ.45 వేల వేతనం, మెడికల్ కవరేజీ కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. నర్సింగ్ కోర్సు అయిపోయి కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోనివారైనా ఫర్వాలేదని ఆహ్వానించింది. -
కరోనాను క్యాష్ చేసుకుంటున్న మెడికల్ మాఫియా!
సాక్షి, అమరావతిబ్యూరో: ఒకవైపు కరోనా మహమ్మారి కృష్ణా,గుంటూరు జిల్లాలను గడగడలాడిస్తుంటే.. మరోవైపు బాధితుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా పేరుతో రూ.వేలల్లో దండుకుంటున్నారు. ఆయా మాత్రలు, సూది మందులను తయారీ కంపెనీల నుంచి మెడికల్ ఏజెన్సీల పేర్లతో తీసుకుని మందుల దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో ఇటీవల ఈ అక్రమ దందాల వ్యవహారాలు జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని ముఠాలు కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి భారీగానే సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ నుంచి దిగుమతి.. ♦ రసాయన సంస్థలు, కొన్ని కార్పొరేటు ఆస్పత్రులు మహారాష్ట్ర, గుజరాత్‌లోని భావనగర్, జునాగఢ్ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించుకుంటున్నాయి. ♦ అక్కడి కిందిస్థాయిఉద్యోగుల అత్యాశ కారణంగా అవి అక్రమార్కులకు చేరుతున్నాయి. ♦ 10 కిలోల ఆక్సిజన్ సిలిండర్ రూ.4,500 అసలు ధర కాగా.. కిందిస్థాయి ఉద్యోగులు రూ.5,500 నుంచి రూ.6,500 వరకూ విక్రయిస్తున్నారు. ♦ వీటిని తీసుకున్న అక్రమార్కులు రూ.10 వేల నుంచి రూ.11 వేలకు అమ్మేస్తున్నారు. ♦ రోజూ ఒక్కో కంపెనీకి నాలుగైదు లారీల ఆక్సిజన్ సిలిండర్ల లోడ్లు వస్తుండటం, వాటి లెక్కలు చూసేవారు కిందిస్థాయి ఉద్యోగులకు బాధ్యత అప్పగించడంతో ఇదంతా జరుగుతోందని సమాచారం. ♦ అయితే ఇలా చేస్తున్న వారికి ఒక్కరికి కూడా ఆక్సిజన్ సిలిండర్లు విక్రయించేందుకు ప్రభుత్వ అనుమతి లేదని తెలుస్తోంది. ఆస్పత్రుల వద్ద గుట్టుచప్పుడు కాకుండా.. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రెమ్డిసివెర్ తదితర మందులు తక్షణం అందజేస్తామంటూ కొందరు దుకాణాల నిర్వాహకులు, ఏజెన్సీల ప్రతినిధులు ప్రభుత్వ, కార్పొరేట్ కోవిడ్ ఆస్పత్రుల సమీపంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఢిల్లీ, ముంబైల నుంచి తెప్పించామని.. అందుకే బిల్లులు ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. ఒక్కో డోసు అమ్మినందుకు వీరికి రూ.10 వేల నుంచి రూ.20 వేలకు వరకూ లాభం వçస్తుంది. ఫ్యాబిఫ్లూ మందుల్లో మాత్రం రూ.వందల్లో గిట్టుబాటు అవుతుందని ఔషధ రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా మందులు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు.. టొసిలీజుమాబ్ ఇంజెక్షన్ అత్యవసర పరిస్థితుల్లో కరోనా రోగులకు వినియోగిస్తుంటారు. వీటి ఖరీదెక్కువు. విదేశాల నుంచి ముంబైకు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వీటిని దిగుమతి చేసుకుంటారు. ప్రతి ఇంజెక్షన్ వివరాలు మా శాఖ వద్ద ఉంటాయి. మెడికల్ ఏజెన్సీలకు, కార్పొరేట్ ఆస్పత్రులకు ఎనెన్ని ఇంజక్షన్లు సరఫరా చేశారు.. ఎన్నింటిని వినియోగించారు అన్న దానిపై నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. ఎవరైనా వీటిని అధిక ధరకు విక్రయిస్తుంటే ఔషధ నియంత్రణ శాఖకు సమాచారం ఇస్తే అక్రమార్కుల ఆట కట్టిస్తాం. – రాజాభాను, అసిస్టెంట్ డైరెక్టర్,ఔషధ నియంత్రణ శాఖ, కృష్ణా జిల్లా బ్లాక్ మార్కెట్లో ఇలా.. ♦ విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. అయితే అతనికి వైరస్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో బంధువులు అతన్ని గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రిలో చేర్పించారు. ♦ చికిత్సలో భాగంగా వైద్యులు ఆ రోగికి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే టొసిలీజుమాబ్ 400 మిల్లీగ్రాముల ఇంజెక్షన్‌ను రాసిస్తూ.. అది తమ వద్ద లేదని, బయట నుంచి తీసుకురావాలని సూచించారు. ♦ రోగి బంధువులు గుంటూరు నగరంలోని ఒక దుకాణంలో ఈ మందును తీసుకొచ్చారు. ♦ అయితే దీని ఎంఆర్పీ ధర రూ.35 వేలుగా ఉండగా ఆ దుకాణంలో రూ.90 వేలకు కొనుగోలు చేశారని తెలిసింది. ♦ అయితే సాధారణంగా ఈ మందు ప్రభుత్వ అనుమతలు పొందిన డ్రగ్ డీలర్లు.. స్పెషలిస్ట్ వైద్యుల ప్రిస్కిప్షన్ ఉంటేనే రోగులకు విక్రయిస్తారు. అయితే రోగుల అవసరాన్ని బట్టి వీటిని అధిక ధరలకు మాత్రం విక్రయించరాదు. -
10 రోజుల చికిత్సకు రూ.9.09 లక్షలు
సిలికాన్ సిటీలో రోగుల అవస్థలను కార్పొరేట్ ఆస్పత్రులు కాసులుగా మార్చుకుంటున్నాయి. అవసరం వారిది, ఎంతైనా బిల్లు చెల్లిస్తారనే ఆలోచనతో లక్షలకు లక్షలు బాదుతున్నారు. బనశంకరి: కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగికి చికిత్స అందించడానికి 10 రోజులకు రూ.9.09 లక్షలు బిల్ అవుతుందని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి స్పష్టం చేసింది. దీంతో రోగి బంధువులు కళ్లు తేలేశారు. వివరాలు.. 67 ఏళ్ల కోరమంగల వాసి శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు వైట్పీల్డ్లో ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రోగిని పరిశీలించిన డాక్టర్లు 10 రోజులు చికిత్స చేయాలి, రూ.9.09 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. అది విన్న కుటుంబసభ్యులు హడలిపోయి ఆసుపత్రిలో చేర్పించలేమని చెప్పేశారు. షాక్ తిన్నాం: బంధువులు రోగి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆదివారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితం కోసం వేచి చూస్తున్నామని, సోమవారం శ్వాసతీసుకోలేకపోవడంతో మేము కొలంబియా ఏషియా ఆసుపత్రికి తీసుకువచ్చామని, వైద్యులు ఇంత ఖర్చవుతుందని చెప్పారని వివరించారు. అది విని షాక్‌కు గురయ్యామని తెలిపారు. తరువాత ఓ స్వచ్ఛంద సేవాసంస్థవారితో మాట్లాడగా తక్కువ ఫీజులతో వైద్యం చేసే మరో ఆస్పత్రి గురించి చెప్పారని, అక్కడ మేము రూ.25 వేలు చెల్లించి చేర్పించామని చెప్పారు. వైద్యం పేరుతో రోగుల దుస్థితిని లాభంగా వినియోగించుకోరాదని వారు హితవు పలికారు. ఈ తతంగంపై వైద్య విద్యా మంత్రి సుధాకర్ మాట్లాడుతూ ఆ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక కొలంబియా ఏషియా ఆసుపత్రి మేనేజర్ మాట్లాడుతూ రోగి తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. సుగర్, బీపీ ఉన్నాయి. తక్షణం చికిత్స అందించే అవసరం ఉంది. కరోనా ఉందో లేదో తెలియరాలేదు. ఇలాంటి పరిస్థితిలో చికిత్సకు ఎంత ఖర్చవుతుందో ముందే తెలిపాము. ఇదే ఫైనల్ బిల్లు కాదు అని చెప్పారు. ఇదీ బిల్లు వెంటిలేటర్ రూ.1.40 లక్షలు, రూ.3 లక్షలు ఔషధాలు, ల్యాబ్ పరీక్షలకు రూ.2 లక్షలు, రూమ్ అద్దె రూ.75 వేలు, నర్సింగ్ చార్జ్‌లు రూ.58,500, రేడియోలజీ, ఫిజియోథెరపీకి రూ.35,000, సర్జికల్ సామగ్రికి రూ.25,000 అవుతుందని బిల్ చూపారు. -
బతికుండగానే.. చావుకబురు చల్లగా చెప్పారు!
సాక్షి, హైదరాబాద్: వైద్యుడు దేవుడితో సమానమంటూ... వైద్యో నారాయణో హరి అంటారు కదా! కానీ, ఓ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు బతికుండగానే ఓ కరోనా బాధితుడిని ‘హరీ’మనించారు. కరోనా కాలంలో ఓ కార్పొరేట్ ఆస్పత్రి లీల ఇది.. కరోనా బాధితుడు బతికుండగానే చావుకబురు చల్లగా చెప్పారు. కుటుంబసభ్యులను కంగారు పెట్టించారు. బ్యాలెన్స్ బిల్లు చెల్లించి శవాన్ని తీసుకెళ్లాలని సమాచారమిచ్చారు. చివరిచూపు కోసం ఆస్పత్రికి చేరుకున్న భార్యాపిల్లలకు, ఇతర బంధువులకు ఐసీయూలో ఉన్న పేషెంట్లో కదలికలు కన్పించాయి. ఇదేమిటని నిలదీయడంతో ఆస్పత్రి వైద్యులు నీళ్లు నమిలారు. తాము అలా చెప్పలేదని ఆస్పత్రి యాజమాన్యం బుకాయిస్తుండటం గమనార్హం. ఈ సంఘటన గురువారం సికింద్రాబాద్‌లో వెలుగుచూసింది. అసలేమైందంటే...: అంబర్‌పేటకు చెందిన బీజేపీ సీనియర్‌నేత సి.నర్సింగరావు(67) శ్వాస సంబం ధిత సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం జూన్ 27న సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నాల్రోజులపాటు ఐసీయూలో ఉంచారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఐసోలేషన్ వార్డుకు మార్చారు. ఆ తర్వాత శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది పడుతుండటంతో ఆయన్ను మళ్లీ ఐసీయూకు తరలించి వెంటిలేటర్ అమర్చారు. బుధవారంరాత్రి నర్సింగరావు ఇకలేరు.. తీసుకెళ్లాల్సిం దిగా ఆస్పత్రి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. కోవిడ్ మృతదేహాన్ని ఇంటికెలా ఇస్తారని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, సారీ... ప్యాక్ చేసి జీహెచ్ఎంసీకి అప్పగిస్తామన్నారు. చివరిచూపు కోసం వెళ్లగా... ఒకవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తూనే చివరిచూపు కోసం గురువారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన కుటుంబ సభ్యుల సంతకాలను కూడా తీసుకు న్నారు. మృతదేహం తరలింపు కోసం అంబులెన్స్ సహా జీహెచ్ఎంసీ సిబ్బంది వస్తున్నట్లు చెప్పారు. అయితే నర్సింగరావు చనిపోలేదని, ఆరోగ్యం మెరుగవుతోందని, ఇదే ఆస్పత్రిలోని ఓ వైద్యుడి ద్వారా కుటుంబసభ్యులకు సమాచారమందింది. దీంతో ఐసీయూలోని వెంటిలేటర్‌పై ఉన్న నర్సింగరావును వీడియో కాల్ ద్వారా కుటుంబసభ్యులు పలకరించారు. ఆయన శరీరంలో కదలికలు గమనించారు. ఆయన తలఊపుతూ తాను బాగానే ఉన్నట్లు సంకేతాలిచ్చారు. దీంతో బతికున్న మనిషి చనిపోయాడని సమాచారమెలా ఇస్తారని ఆస్పత్రి అధికారులను కుటుంబసభ్యులు నిలదీశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన సోదరుడు అంబర్పేట్ శంకర్ డిమాండ్ చేశారు. కాగా బీజేపీ సీనియర్ నేత నర్సింగరావు మృతి చెందారనే తొలి వార్త తెలిసి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సంతాపం తెలపడం గమనార్హం. ఇంత మోసమా: సోనియా, బాధితుడి కోడలు ప్రభుత్వవైద్యంపై నమ్మకంలేక మా మామయ్యను ఈ ఆస్పత్రికి తీసుకొచ్చాం. మామయ్య మా కుటుంబానికి పెద్దదిక్కు. ఆయన బతికుండగానే చనిపోయాడని చెప్పారు. అందరం చాలా బాధపడ్డాం. మా అత్తమ్మ స్పృహతప్పి పడిపోయింది. రూ.4 వేలు ఖరీదు చేసే ఇంజక్షన్‌కు రూ.40 వేలు చార్జీ చేశారు. రూ.8 లక్షలకుపైగా బిల్లు వేశారు. ఇప్పటికే రూ.6 లక్షలకుపైగా చెల్లించాం. ఇదో గొప్ప ఆస్పత్రి అంటారు. ఇంత చెత్త ఆస్పత్రిని ఎక్కడా చూడలేదు. ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలి. చనిపోయాడని మేం చెప్పలేదు: ఆస్పత్రి వర్గాలు నర్సింగరావు చనిపోయాడని తాము ఎలాంటి సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు. ఆస్పత్రి నుంచి ఎవరు ఫోన్ చేసి చెప్పారో తెలపాల్సిందిగా కోరితే వారి వద్ద సమాధానం లేదు. ఎవరైనా చనిపోతే ముందు ఈసీజీ తీసి డెత్ డిక్లరేషన్ ఇస్తాం. ఈ ఘటనలో అలా జరగలేదు. ఆస్పత్రి ప్రతిష్ట దెబ్బతీసేలా వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. -
మృతదేహం మీరే ఉంచుకోండి
రాంగోపాల్‌పేట్: కరోనాతో సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడు మరణించాడు. చికిత్సకు సంబంధించి ఆస్పత్రి యాజమాన్యం రూ.11.50 లక్షల బిల్లు వేసింది. ఇంకా తమకు చెల్లించాల్సిన రూ.5 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఒకానొక సమయంలో మృతదేహం అప్పగించకపోతే అంత్యక్రియలు మీరే చేసుకోండని బాధితులు కరాఖండీగా చెప్పడంతో ఆస్పత్రి వర్గాలు దిగి వచ్చాయి. యాదగిరిగుట్టకు చెందిన నవీన్‌కుమార్ (28) అనారోగ్యంతో గత నెల 23వ తేదీన సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. ఆస్పత్రి వర్గాలు 24వ తేదీన కరోనా పరీక్షలు చేయగా అతనికి నెగెటివ్‌గా వచ్చింది. 26వ తేదీ మరోమారు చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. అయితే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం నవీన్‌కుమార్ మరణించాడు. అప్పటికే కుటుంబ సభ్యులు రూ.6.50 లక్షల రూపాయలు చెల్లించగా, మరో రూ.5 లక్షల పెండింగ్ బిల్లు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఊర్లో ఉన్న పొలం అమ్మి డబ్బు చెల్లించామని, ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వకూడా లేదని బాధితులు చెప్పారు. డబ్బు చెల్లిస్తే తప్ప మృతదేహాన్ని అప్పగించేది లేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో మృతదేహం మీరే ఉంచుకోండని బాధితులు ఆస్పత్రి వర్గాలతో చెప్పడంతో మరో రూ.20 వేలు కట్టించుకుని మృతదేహాన్ని పంపించారు. ఎర్రగడ్డలోని స్మశాన వాటికలో అధికారుల పర్యవేక్షణలో మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు. బ్రతికున్నాడో లేదో చెప్పడం లేదు రూ.15 లక్షల బిల్లు వేశారు: బంధువుల ఆరోపణ కాగా, మరో కేసులోనూ ప్రైవేట్ ఆసుపత్రి దారుణం వెలుగుచూసింది. సికింద్రాబాద్ గాస్మండికి చెందిన 55 సంవత్సరాల వ్యక్తి మోండా మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా లక్షణాలతో ప్యారడైజ్ ప్రాంతంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో గత నెల 13వ తేదీన చేరాడు. అతనికి చేసిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ రాగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆ రోజు నుంచి నేటివరకు రూ.13 లక్షల బిల్లు కాగా ఇన్సూరెన్స్, నగదు కలిపి రూ.5 లక్షలు చెల్లించారు. అయితే ఆస్పత్రి వర్గాలు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయనీ, రోగి బ్రతికి ఉన్నాడో లేదో కూడా చూపించడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. రూ.8 లక్షలు చెల్లిస్తేనే రోగిని చూపిస్తామని అంటున్నారని వారు ఆరోపించారు. మూడు అందుబాటులోకి రాలేదు: ఆస్పత్రి వర్గాలు ఆరోపణలపై ఆస్పతి వర్గాలు స్పందిస్తూ, ‘ఇంతవరకు రోగికి అందించిన చికిత్సకు రూ. 16 లక్షలు బిల్లు అయింది.. మూడు లక్షల ఇన్సూరెన్స్, రూ.2 లక్షలు క్యాష్ రూపంగా చెల్లించారు. మిగతాది చెల్లించాల్సి ఉంది. మూడు రోజుల క్రితం రూ. 3 లక్షలు బిల్లు కడతానని చెప్పిన రోగి అటెండెంట్ ఇప్పటివరకు మళ్లీ అందుబాటులోకి రాలేదు. అంతకు ముందు పేషెంట్ కూతురు వస్తే పీపీఈ కిట్లు వేసి రోగిని చూపించాం. ఎప్పటికప్పుడు రోగి కండీషన్ ఫోన్ ద్వారా తెలియ చేస్తున్నాము. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం ఆయన పరిస్థితి విషమంగా ఉంది’ అని వెల్లడించాయి. -
ఒక్కరోజు ‘కరోనా’ బిల్లు రూ. 1,50,000
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులపై ప్రైవేటు ఆస్ప త్రులు అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. అసలు మందే లేని కరోనాకు చికిత్స పేరుతో లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నాయి. చెల్లించలేక నిస్సహాయత వ్యక్తం చేస్తున్న బాధితులను ఆస్పత్రుల్లో నిర్బంధిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలను పక్కనపెట్టి ఇష్టానుసారం బిల్లులు వేసి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. మలక్‌పేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి కరోనా బాధితునికి పీపీఈ కిట్ల చార్జీలను రూ.45 వేలకు పైగా వేసిన విషయం మర్చిపోక ముందే చాదర్‌ఘాట్‌లోని మరో కార్పొరేట్ బిల్లు కోసం ఏకంగా ప్రభుత్వ వైద్యురాలినే నిర్బంధించింది. (నిర్లక్ష్యమే అసలైన మహమ్మారి) అసలేమైందంటే..: మలక్‌పేటకు చెందిన డాక్టర్ హర్ష సుల్తానా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్. వారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఐదు రోజల క్రితం ఫీవర్ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. మరోసారి చేయించుకోగా కరోనా నిర్ధారణైంది. ఆమెతో పాటు భర్త, ఇద్దరు కుమారులకూ పాజిటివ్ వచ్చింది. దీంతో వారంతా హోం క్వారంటైన్లో ఉన్నారు. జూలై 1న అర్ధరాత్రి శ్వాస సంబంధ సమస్య తలెత్తడంలో ఇంట్లో ఉండటం శ్రేయస్కరం కాదని భావించిన సుల్తానా.. సమీపంలోని చాదర్‌ఘాట్ తుంబే ఆస్పత్రిలో చేరారు. అడ్మిషన్‌కు ముందే రూ.40 వేలు చెల్లించారు. ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే రూ.1.50 లక్షల బిల్లు చేతికొచ్చింది. ఒక్కరోజుకే ఇంత బిల్లు ఎలా వేస్తారని ఆమె ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. బిల్లు చెల్లించేందుకు నిరాకరిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించగా, సిబ్బంది అడ్డుకుని నిర్బంధించారు. (చచ్చినా వదలట్లేదు) దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తీసి బయటికి వదిలారు. ఓ ప్రభుత్వ వైద్యురాలు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ తీసిన ఈ వీడియోను ఆమె బంధువులు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సహా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, పోలీసు ఉన్నతాధికారుల ట్విట్టర్ ఖాతాలకు ట్యాగ్ చేశారు. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో ఆస్పత్రిపై ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికొచ్చింది. సదరు వీడియో వైరల్ కావడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. సదరు కార్యాలయం నుంచి ఫోన్ చేయడంతో సుల్తానాను తుంబే ఆస్పత్రి యాజమాన్యం డిశ్చార్జ్ చేసింది. విచ్చలవిడిగా బిల్లులు వేస్తూ పేషంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్న తుంబే హాస్పిటల్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డాక్టర్ సుల్తానా కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. (ఒక్క రోజే 1,590 కేసులు) దురుసుగా ప్రవర్తించారు కరోనాతో బాధపడుతున్న డాక్టర్ సుల్తానాకు వైద్యపరంగా అన్ని సేవలూ అందించాం. అధిక బిల్లు వేశామనే ఆరోపణల్లో నిజం లేదు. ఆమె ఐదు రోజుల క్రితం చేరారు. సిబ్బందితో ఆమె దురుసుగా ప్రవర్తించారు. స్టాఫ్‌నర్సులను అసభ్య పదజాలంతో దూషించారు. ఆమె వద్దకు వెళ్లేందుకు సిబ్బంది భయపడేవారు. ఆమెకు ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తూనే ఉన్నాం. పూర్తిగా కోలుకోవడంతోనే డిశ్చార్జి చేశాం. – తుంబే ఆస్పత్రి యాజమాన్యం ముందే చెబితే నిమ్స్‌లో చేర్చేవాళ్లం డాక్టర్ సుల్తానాకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం ఆమె చెప్పే వరకు తెలియదు. క్వారంటైన్‌కు వెళ్తానని చెప్పడంతో అనుమతిచ్చాం. ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం లేదు. ముందే చెబితే ఫీవర్‌లో లేదా నిమ్స్‌లో చేర్చి వైద్యం చేయించేవాళ్లం. ఫీవర్ ఆస్పత్రి వైద్యురాలిగా ఆమె ఆరోగ్యాన్ని కాపాడటం మా బాధ్యత. విషయం తెలిసిన వెంటనే ఆర్ఎంఓ ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. – డాక్టర్ శంకర్, ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
గాంధీ X కార్పొరేట్
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆసుపత్రి: కరోనా వైరస్‌తో మరో మహిళ మృతి చెందినట్లు తెలిసింది. శుక్రవారం ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన మరో మహిళ (54) హైదరాబాద్‌లో చనిపోయింది. అయితే, దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. ఇదిలాఉండగా.. ఈమె మృతిపై వివాదం రేగింది. గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోకపోవడం వల్లే చనిపోయిందని కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన అం బులెన్స్ టెక్నీషియన్ చెబుతుంటే.. చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చి అడ్మిట్ చేసుకొమ్మంటే ఎలా చేసుకుంటామని గాంధీ ఆస్పత్రి వర్గాలు ప్రశ్నించాయి. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచారు. అసలేమైందంటే..? ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన మహిళ (54) కూకట్పల్లి ప్రగతినగర్‌లో ఉంటున్న తన కుమారుడి ఇంటికి లాక్‌డౌన్‌కు ముందే వచ్చింది. అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను చికిత్స కోసం ఇటీవల సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. కరోనా లక్షణాలు కన్పించడంతో వైద్యులు ఆమెను ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. రెండ్రోజుల క్రితం ఆమె నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. ఆమెకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు శుక్రవారం ఉదయం రిపోర్టు వచ్చింది. అప్పటికే ఆమె పరిస్థితి పూర్తిగా విషమించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని, గాంధీ కరోనా నోడల్ కేంద్రానికి తీసుకెళ్లాల్సిందిగా ఆ ఆస్పత్రి వైద్యులు ఆమె కుమారుడికి సూచించారు. ఇందుకు ఆయన అంగీకరించడంతో ఆస్పత్రికి చెందిన అంబులెన్స్‌లోనే గాంధీకి తరలించారు. ఈ సమయంలో ఆమె వెంట అంబులెన్స్‌లో బంధువులెవరూ లేరు. పట్టించుకోకపోవడం వల్లే మృతి: అంబులెన్స్ టెక్నీషియన్ గాంధీ వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే రోగి మృతి చెందిందని కార్పొరేట్ ఆస్పత్రి అంబులెన్స్ టెక్నీషియన్ అన్నారు. ‘సికింద్రాబాద్‌లోని ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పేషెంట్‌ను తీసుకుని అంబులెన్స్‌లో బయలుదేరాం. మధ్యాహ్నం ఒంటిగంటకు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నాం. 2.30 గంటల వరకు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రోగి ఆయాసంతో బాధపడుతుండటంతో అప్పటికే సీపీఆర్ కూడా చేశాం. ఆస్పత్రి వైద్యులెవరూ రాకపోవడంతో రోగి తాలూకు మెడికల్ రిపోర్టులు తీసుకుని నేనే స్వయంగా డాక్టర్ వద్దకు వెళ్లాను. అటెండర్స్ ఎవరూ లేకుండా ఇలా ఎలా తీసుకొస్తారు..? పాజిటివ్ కేసును తీసుకురావడానికి మీరెవరూ? అంటూ ప్రశ్నించారు. సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉన్నాను. బాడీని తీసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో అంబులెన్స్‌ను అక్కడే వదిలేసి వచ్చాం..’అని చెప్పారు. చనిపోయిన వారిని ఎలా అడ్మిట్ చేసుకుంటాం ‘మధ్యాహ్నం 3 గంటలకు ఆస్పత్రికి అంబులెన్స్ చేరుకుంది. రోగిని తరలించేందుకు వార్డు బాయ్స్ వెంటనే అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు. ఎలాంటి చలనం లేనట్లు గుర్తించారు. ఇదే అంశాన్ని డ్యూటీ డాక్టర్లకు చెప్పారు. వారు కూడా వెంటనే వచ్చి చూశారు. అప్పటికే ఆమె చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చారని అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్లను సదరు వైద్యులు ప్రశ్నించగా, మెరుగైన వైద్యం కోసమే తమ ఆస్పత్రి యాజమాన్యం ఆమెను ఇక్కడికి పంపినట్లు వారు అంగీకరించినట్లు తెలిసింది. నిజానికి ఆమె ఆస్పత్రికి రాకముందే చనిపోయింది. చనిపోయిన వారి మృతదేహాలను ఆస్పత్రి ఐసోలేషన్ వార్డు ఎలా అడ్మిట్ చేసుకుంటాం? వారికేం వైద్యం చేస్తాం? కావాలనే ఆ కార్పొరేట్ ఆస్పత్రి సిబ్బంది మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చింది. ఒకవైపు మేం ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు చికిత్సలు అందిస్తుంటే.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చనిపోయిన వారిని తీసుకొచ్చి.. ఇక్కడి వైద్యులను బదనాం చేయడం ఎంతవరకు సమంజసం? తప్పుడు సమాచారం ఇచ్చిన యాజమాన్యాలపైనే కాదు.. వాటిని ప్రసారం చేసిన మీడియా చానళ్లపై కూడా కేసులు పెట్టడానికి వెనుకాడబోం..’ –శ్రవణ్‌కుమార్, గాంధీ సూపరింటెండెంట్ -
పాము కాటు కన్నా కార్పొ‘కేటు’తో రైతన్న మరణం
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : పాముకాటుకు గురైన ఓ రైతు అపస్మారక స్థితిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. జిల్లాలోని రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం లేదు. చివరకు సోమవారం వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతిచెందారు. చికిత్సలు చేస్తామని డబ్బులు గుంజుకున్న తిరుపతి లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు మూడు రోజుల తరువాత చేతులెత్తేయడంతోనే ఈ దారుణం జరిగిందని మృతుని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. బాధితుల కథనం మేరకు కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ కమతంపల్లెకు చెందిన కాకర్ల గుడ్రాజప్ప కుమారుడు రైతు కే శ్రీనివాసులు (50) వ్యవసాయం చేసుకుంటూ భార్య రెడ్డెమ్మ, ముగ్గురు కుమార్తెలను పోషించుకునేవారు. అతడు గురువారం పొలంలో పనులు చేస్తుండగా కాలుపై పాముకాటు వేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీనివాసులును కుటుంబసభ్యులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వద్ద అంబులెన్స్ నడుపుతున్న ఓ యువకుడు అతడిని రుయా ఆస్పత్రికి తీసుకెళ్లకుండా కార్పొరేట్ వైద్యులు ఇచ్చే కమీషన్‌కు కక్కుర్తిపడి తిరుపతిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చించి వచ్చేశాడు. ఆ ఆస్పత్రిలోని వైద్యులు వివిధ రకాల పరీక్షలు, చికిత్సల పేరుతో సుమారు రూ.1.50 లక్షలు వసూలు చేశారు. మూడు రోజుల తర్వాత తమవల్ల కాదని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని అపస్మారక స్థితిలో ఉన్న అతడిని పంపేశారు. మళ్లీ అతడిని మదనపల్లెలోని ప్రభుత్వాస్పత్రికి సోమవారం ఉదయం తీసుకువచ్చి చేర్పించారు. తరువాత అదే రోజు చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మరణించారు. భార్య, ముగ్గురు ఆడబిడ్డలు అనాథలయ్యారు. -
ఆరోగ్యశ్రీ వర్తించదని పిండేశారు!
సాక్షి, విశాఖపట్నం : ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేయాల్సిన ఓ కార్పొరేట్ ఆస్పత్రి.. రోగి కుటుంబాన్ని పిండేసింది. రోగికి ఆరోగ్యశ్రీ వర్తించదని.. వైద్యానికి నగదు చెల్లించాల్సిందేననడంతో విధిలేని పరిస్థితిలో అప్పుచేసి మరీ సదరు ఆస్పత్రికి చెల్లించారు. ఇదే విషయమై బాధితుని కుటుంబ సభ్యులు ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఆదేశాలతో ఆస్పత్రి అధికారులు దిగొచ్చి రోగికి అరోగ్యశ్రీ కింద వైద్యం అందించారు. విశాఖలో రెండు కిడ్నీలు చెడిపోయిన తొమ్మిదేళ్ల బాలుడి విషయంలో అక్కడి ఓమ్నీ ఆర్కే ఆస్పత్రి వైద్యులు వ్యవహరించిన తీరు ఇదిగో ఇలా ఉంది..విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని రేబాక గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ముమ్మన సత్తిబాబు కుమారుడు ధనోజ్ (9)కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో అతడిని అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నుంచి ఈనెల 9న విశాఖలోని ఓమ్ని ఆర్కే ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రిలో ఈ బాలుడికి ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యానికి నగదు చెల్లించాలని స్పష్టంచేశారు. దీంతో అప్పుచేసి రూ.70 వేలు చెల్లించారు. ఇతర పరీక్షల కోసం మరో రూ.60 వేలు చెల్లించాలన్నారు. ధనోజ్ చికిత్సకు ఆర్థిక సాయంచేసి ఆదుకోవాలని తల్లిదండ్రుల అభ్యర్థనను ఈనెల 13న ‘సాక్షి’ ప్రచురించింది. దీనిని ధనోజ్ కుటుంబ సభ్యులు వాట్సాప్‌లో మంత్రి ఆళ్ల నానికి 14 రాత్రి పంపించారు. వీటిని చూసిన మంత్రి 16న ఏలూరులో ఉన్న తన ఇంటికి రావాలని ధనోజ్ కుటుంబీకులకు ఫోన్‌చేసి చెప్పగా వారు మంత్రి ఇంటికి వెళ్లారు. బాబు పరిస్థితిని వివరించి తమ బిడ్డను బతికించాలని వేడుకున్నారు. దీంతో బాలుడికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందించాలని, ఇప్పటికే ఆస్పత్రికి చెల్లించిన సొమ్మును తిరిగిచ్చేయాలని నాని ఆదేశించారు. మరోవైపు.. సోమవారం ఉదయం జిల్లా ఉప వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ రవిచంద్ర పాడి ఓమ్నీ ఆర్కే ఆస్పత్రిని సందర్శించారు. బాలుడికి డయాలసిస్, చికిత్స కొనసాగించాలని, ఇప్పటికే వసూలుచేసిన రూ.70 వేలను వెనక్కివ్వాలని ఆస్పత్రి ఏజీఎం (ఆపరేషన్స్) గణేష్‌ను ఆదేశించారు. ఓమ్నీ ఆర్కే ఆస్పత్రికి నోటీసులు జారీచేశారు. కాగా, మెరుగైన వైద్యం కోసం ధనోజ్‌ను మంగళవారం మైక్యూర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సీఎం ఆశయ స్ఫూర్తితోనే.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సరైన వైద్యం అందాలి.. ఎంత ఖర్చయినా పర్వాలేదు.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆ మేరకే స్పందించి ఆదేశాలిచ్చాను. – ఆళ్ల నాని, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి -
మీడియా పేరుతో బెదిరింపులు
విజయవాడ: జర్నలిస్టు అసోసియేషన్ నేత, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి(సాక్షి టీవీ కాదు) ఓ కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యాన్ని బెదిరించి భారీగా డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఓ సివిల్ వివాదానికి సంబంధించి ఆ చానల్ ప్రతినిధి రూ.20లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. కార్పొరేట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. కమిషనరేట్‌లో పోలీసు ఉన్నతాధికారులు ఈ ఫిర్యాదుపై విచారణకు ఏసీపీ స్థాయి అధికారిని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న జర్నలిస్టు అసోసియేషన్ నేత జిల్లాకు చెందిన ఓ మంత్రిని ఆశ్రయించాడు. ఆయన ఆస్పత్రి యాజమాన్యం ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. మంత్రి జోక్యం చేసుకోవటంతో పోలీసు ఉన్నతాధికారులు ప్రస్తుతానికి కేసు నమోదు చేయకుండా ఇరుపక్షాలతో రాజీ చర్చలు జరుపుతున్నారు. ఇటీవల హనుమాన్‌జంక్షన్ వద్ద కొందరు గ్రామీణ జర్నలిస్టులు బెదిరింపులకు పాల్పడితే పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. విజయవాడలో ఓ జర్నలిస్టు నేత దందాపై మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విలేకరిపై పోలీసులకు ఫిర్యాదు జగ్గయ్యపేటఅర్బన్(జగ్గయ్యపేట): సింగిల్ సిటింగ్‌తో ఉన్నత చదువులకు సర్టిఫికెట్లు అందిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాడని స్థానిక సన్‌ప్లవర్ విలేకరి వల్లాపురం వెంకన్న బాబుపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసింది. ఈమేరకు బుధవారం వత్సవాయి మండలం, దేచుపాలేనికి చెందిన అన్నెపాక రాధ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. వివరాలు.. రెండేళ్ల నుంచి ఒక ప్రైవేటు సంస్థ పేరుతో సింగిల్ సిట్టింగ్‌తో ఇంటర్, డిగ్రీలకు సర్టిఫికెట్లు ఇప్పిస్తామని ప్రచారం చేసి తమ వంటి యువత నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిగ్రీ కోసం రూ.40 వేలు చెల్లించి 20 నెలలు అవుతున్నా సర్టిఫికెట్ ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పారు. తనతో పాటు మరొక విద్యార్థిని మాధవి వద్ద నుంచి ఇలాగే డబ్బులు తీసుకుని సర్టిఫికెట్ ఇవ్వటం లేదని ఫిర్యాదులో తెలిపింది. -
రైతన్నల కోసం కార్పొరేట్ హాస్పిటల్
-
బీమా లేని చికిత్సా..? బాబోయ్!!
♦ ఆరోగ్య బీమా తప్పనిసరిగా ఉండాల్సిందే ♦ రకరకాల పాలసీలను చూసి సందిగ్ధంలో పడొద్దు ∙ ♦ వయసు, అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి ♦ ముందే వైద్య పరీక్షలు బెటర్ ♦ సబ్ లిమిట్స్, కో–పే వంటి పరిమితులు లేకుంటేనే నయం రాజారావు (42) ఉన్నట్టుండి ఛాతీ భాగంలో నొప్పిగా ఉందంటూ కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గుండెకు ఆపరేషన్ చేసి రాజారావు ప్రాణాన్ని నిలబెట్టారు. కుటుంబంలో తిరిగి సంతోషం వెల్లివిరిసింది. కానీ, ఆస్పత్రి బిల్లు రూ.4 లక్షలు చూశాక ఆ సంతోషం ఆవిరైపోయింది. కారణం రాజారావుకు వైద్య బీమా లేదు. తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఆ బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఆ అప్పులు తీర్చడానికి వారికి రెండేళ్లు పట్టింది. వైద్య వ్యయాలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో బీమా లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటన్నది రాజారావును చూస్తే తెలియకమానదు. గుండె సంబంధిత చికిత్సలకు రూ.1.50 లక్షలకన్నా తక్కువ కావడం లేదు. కేన్సర్ చికిత్సకు రూ.3 లక్షల వరకు, ఫ్రాక్చర్, ఇతరత్రా చికిత్సలకూ రూ.లక్ష వరకు ఖర్చవుతున్న రోజులివి. అనారోగ్యం పాలైనపుడు ఇల్లు గుల్ల కాకూడదనుకుంటే వెంటనే బీమా పాలసీ తీసుకోవాల్సిందే... బీమా పాలసీ ఎంపిక అన్నది ఓ పెద్ద ప్రహసనం. ఎన్నో నిబంధనలు, పరిమితులు, ఓ పట్టాన అర్థం కాని టెర్మినాలజీ పరిస్థితిని సంక్లిష్టం చేస్తున్నాయి. సబ్‌లిమిట్స్, కోపేమెంట్స్, వెయిటింగ్ పిరియడ్ తదితర కీలక అంశాల గురించి వివరించడంతోపాటు, ఏ పాలసీ అనువైనదో చెప్పేదే ఈ సమగ్ర కథనం. వేచి ఉండే కాలం ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజీ కోసం వేచి ఉండాలన్న నిబంధనను చూసి వ్యాధులను దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దు. తర్వాతి కాలంలో వైద్య పరీక్షల్లో ఆ వ్యాధి అప్పుడే మొదలైంది కాదన్న విషయం బయటపడితే క్లెయిమ్‌ను కంపెనీలు తీరస్కరించే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, పాలసీ రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే బీమా పాలసీ తీసుకునే ముందే సమగ్ర వైద్య పరీక్షలకు సిద్ధం కావడం (కంపెనీ కోరకపోయినా) మంచిది. ఎక్కువ శాతం బీమా కంపెనీలు ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీని ఇచ్చేందుకు నాలుగేళ్ల పాటు వేచి ఉండాలన్న నిబంధన అమలు చేస్తున్నాయి. అదే సమయంలో అపోలో మ్యూనిచ్ ఆప్టిమా రీస్టోర్, రాయల్ సుందరం లైఫ్‌లైన్ సుప్రీమ్, సిగ్నా టీటీకే ప్రో హెల్త్ ప్లస్ పాలసీల్లో మూడేళ్లుగానే ఉంది. మ్యాక్స్ బూపా హార్ట్‌బీట్ (ప్లాటినం, గోల్డ్ ప్లస్) పాలసీల్లో వెయిటింగ్ పిరియడ్ రెండేళ్లే. కాకపోతే ప్రీమియం ఎక్కువ. యుక్త వయసులో ఉంటే... 30ఏళ్లలోపు అవివాహితులు ప్రీమియం తక్కువ ఉంది కదా అని ఏదో ఒక హెల్త్ పాలసీ తీసుకున్నారనుకోండి. 30 ఏళ్లు దాటాక ఎక్కువగా క్లెయిమ్స్ అవసరం ఏర్పడుతుంది. అప్పుడు మీరు తీసుకున్న పాలసీ ఆ అవసరాలను తీర్చకపోతే ఆర్థికంగా భారమే. ఉద్యోగం చేసే సంస్థ నుంచి గ్రూపు హెల్త్ పాలసీ ఉందన్న ధీమా పనికిరాదు. వాటిలో పలు మినహాయిం పులు ఉండొచ్చు. అందుకే వ్యక్తిగతంగా ఓ మంచి హెల్త్ పాలసీ ఉండితీరాలి. 30 ఏళ్ల వయసులో ఉన్న వారికి సాధారణ వైద్య బీమా పాలసీ సరి పోతుంది. సమ్ ఇన్సూర్డ్ రీస్టోరేషన్, నో క్లెయిమ్ బోనస్ కోసం చూడక్కర్లేదు. ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకుంటే నాలుగేళ్ల ‘ప్రీ ఎగ్జిస్టింగ్ డీసీజెస్’ నిబంధన ఉన్న పాలసీ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఏ పాలసీలు అనువు... రెలిగేర్ హెల్త్ కేర్, రాయల్ సుందరం లైఫ్‌లైన్ సుప్రీమ్, మ్యాక్స్‌బూపా హెల్త్ కంపానియన్ వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. ఈ పాలసీల్లో హాస్పిటల్ రూమ్ అద్దెలపై ఎటువంటి పరిమితులు, ఇతరత్రా ఎటువంటి చార్జీల విధింపు లేదు. రూ.5 లక్షల వైద్య బీమా కవరేజీకి ఏడాదికి ప్రీమియం రూ.5,500 – రూ.6,500 మధ్యలో ఉంటుంది. వివాహితులకు 30–40 ఏళ్ల మధ్య వయసులో, వివాహితులైన వారికి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు అనువుగా ఉంటాయి. ఇందులో పాలసీదారుడితో పాటు అతని జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు కవరేజీ లభిస్తుంది. 40 ఏళ్లు దాటితే... జీవిత భాగస్వాములు ఇద్దరూ 40 ఏళ్ల పైబడి ఉంటే... వారికి బీమా కవరేజీ తగినంత ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది. అందుకని రీస్టోరేషన్ సదుపాయం ఉన్న పాలసీని ఎంచుకోవాలి. ఒకవేళ హైపర్‌టెన్షన్ సంబంధిత సమస్యలు ఉన్న వారు ముందస్తు వ్యాధులకు కవరేజీ కోసం దీర్ఘకాలం పాటు చూసే నిబంధన ఉన్న పాలసీలను ఎంచుకోవద్దు. 60 ఏళ్లు దాటిన వారికి... కొన్ని కంపెనీలు గరిష్టంగా 65 ఏళ్ల వరకే పాలసీ తీసుకునేందుకు అనుమతిస్తున్నాయి. కొన్నింటిలో ఏ వయసు వారైనా వైద్య బీమా పొందొచ్చు. బీమా పాలసీ తీసుకున్న తర్వాత ఏ వయసు వారికైనా రెన్యువల్‌కు తిరస్కరించడానికి లేదు. ఆరోగ్యంగా ఉండి ఉంటే సీనియర్ సిటిజన్ పాలసీలకు బదులు రెగ్యులర్ హెల్త్ పాలసీలు అనువైనవి. వీటిలో సబ్ లిమిట్స్, కో–పే నిబంధనలుండవు. రాయల్ సుందరం లైఫ్‌లైన్ సుప్రీమ్, మ్యాక్స్ బూపా హెల్త్ కంపానియన్, అపోలో మ్యూనిచ్ ఆప్టిమా రీస్టోర్ పాలసీల్లో కోపే లేదు. రీస్టోరేషన్ సదుపాయం ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలో ఒక ఏడాదిలో బీమా కవరేజీ మొత్తాన్ని ఒకరు వినియోగించుకున్నా, మరో వ్యక్తి రీస్టోరేషన్ కింద తిరిగి బీమా కవరేజీని అదే ఏడాదిలో పొందవచ్చు. ఉదాహరణకు నలుగురు సభ్యులున్న కుటుంబం రూ.5 లక్షల బీమా పాలసీ తీసుకుంటే అది వారి అవసరాలకు సరిపోదు. ఏకకాలంలో ఇద్దరు అనారోగ్యం బారిన పడితే బీమా కవరేజీ సరిపోకపోవచ్చు. అదే సమయంలో అధిక బీమా కవరేజీ తీసుకుంటే ప్రీమియం భారం కావచ్చు. ఇటువంటి వారికి రీస్టోరేషన్ సదుపాయం అక్కరకు వస్తుంది. ఇందులో ఉన్న నిబంధనల్లా ఒకరు వ్యాధి బారినపడి పూర్తి బీమా కవరేజీని వినియోగించుకుంటే రీస్టోరేషన్ కింద తిరిగి అదే వ్యక్తి అదే వ్యాధి కోసం ఆ ఏడాదిలో మళ్లీ పరిహారం కోరేందుకు అవకాశం ఉండదు. సదరు వ్యక్తి మరో వ్యాధికి గురైతే పరిహారం పొందొచ్చు. అలాగే కుటుంబంలోని మిగిలిన సభ్యులు సైతం పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం వద్దనుకుంటే రూ.10లక్షల పాలసీపై ప్రీమియం రూ.1,000–2000 వరకు తగ్గుతుంది. సబ్‌లిమిట్స్ పాలసీలో సబ్ లిమి ట్, కో పే ఆప్షన్లను ఎంచుకోవద్దు. వీటిని ఎంచుకోవడం వల్ల ప్రీమియం కొంచెం తగ్గొచ్చేమో కానీ, క్లెయిమ్ ఎదురైతే అధిక మొత్తం జేబులోంచి పెట్టాల్సి వస్తుంది. రూమ్ చార్జీలు సహా ఆస్పత్రి వ్యయ భారాన్ని కొంత తగ్గించుకునేందుకు కంపెనీలు ఈ నిబంధనను అమలు చేస్తుం టాయి. ప్రభుత్వ రంగ కంపెనీల వైద్య బీమా పాలసీల ప్రీమియం ప్రైవేటు కంపెనీలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కానీ, ప్రభుత్వ రంగ బీమా కంపెనీల పాలసీల్లో సబ్‌లిమిట్స్ ఉన్నాయి. గది అద్దె, ఐసీయూ, అంబులెన్స్ ఇలా పలు రకాల చార్జీలపై పరిమితి ఉంటుంది. ఉదాహరణకు అంబులెన్స్‌కు రూ.10వేలు చార్జీ అయితే, బీమా కంపెనీ రూ.2,000కే పరిహా రాన్ని పరిమితం చేయవచ్చు. ఉదాహరణకు న్యూఇండియా అష్యూరెన్స్ ఫ్లోటర్ మెడిక్లెయిమ్ పాలసీ సమ్ ఇన్సూర్డ్ మొత్తంలో గది అద్దెను 1 శాతానికి పరిమితం చేసింది. రూ.5 లక్షల బీమా పాలసీలో రూమ్ అద్దె రూ.5 వేల వరకే కంపెనీ చెల్లిస్తుంది. ఒకవేళ ఆస్పత్రిలో గది అద్దె రూ.10వేలు ఉందనుకుంటే మిగిలిన మొత్తాన్ని పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. ఈ కోత దీనికే పరిమితం కాదండోయ్. మిగిలిన క్లెయిమ్ మొత్తానికీ దీన్నే అమలు చేస్తాయి. ఉదాహరణకు క్లెయిమ్ రూ.లక్ష ఉందనుకుంటే రూ.50వేలే చెల్లిస్తాయి. గది అద్దె రూ.10వేలలో సగమే చెల్లిస్తున్నందున అదే నిబంధన మిగిలిన క్లెయిమ్ మొత్తానికీ వర్తిస్తుంది. రెలిగేర్ హెల్త్ కేర్, అపోలో మ్యూనిచ్ ఆప్టిమా రీస్టోర్, మ్యాక్స్ బూపా హెల్త్ కంపానియన్ తదితర పాలసీల్లో ఈ తరహా సబ్ లిమిట్స్ లేవు. నో క్లెయిమ్ బోనస్ వైద్య బీమాలో ఓ ఏడాదిలో ఒక్క క్లెయిమ్ కూడా లేకుంటే కంపెనీలు కొంత బోనస్‌ను ఇస్తుంటాయి. వైద్యం ఏటేటా ఖరీదవుతున్నందున ఇది కొంత మేర ఉపశమనం ఇచ్చేదే. దాదాపు అన్ని కంపెనీలు ఈ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఓ ఏడాదిలో క్లెయిమ్ లేకుంటే మరుసటి ఏడాది సమ్ ఇన్సూర్డ్ (బీమా కవరేజీ) 10 నుంచి 20 శాతం పెరుగుతుంది. దీనికి ఎటువంటి అదనపు ప్రీమియం చెల్లించక్కర్లేదు. బేసిక్ బీమా కవరేజీకి సమాన స్థాయి వరకూ నో క్లెయిమ్ బోనస్ రూపంలో కవరేజీ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అంటే రూ.లక్ష పాలసీకి ఏటేటా 20 శాతం నో క్లెయిమ్ బోనస్ చొప్పున ఐదేళ్ల పాటు బీమా కవరేజీ రూ.లక్ష వరకు పెరిగి మొత్తం రూ.2 లక్షలు అవుతుంది. రెండేళ్లపాటు నో క్లెయిమ్ బోనస్ రూపంలో రూ.లక్ష పాలసీకి రూ.44వేల కవరేజీ పెరిగిందనుకోండి. మూడో ఏట క్లెయిమ్ వస్తే అప్పుడు సమ్ ఇన్సూర్డ్‌లో 20 శాతం తగ్గిపోతుంది. ఆ తర్వాతి సంవత్సరంలోనూ క్లెయిమ్ వస్తే మరో 20 శాతం తగ్గి బేసిక్ సమ్ ఇన్సూర్డ్ దగ్గర ఆగిపోతుంది. అయితే, మ్యాక్స్ బూపా హెల్త్ కంపానియన్, రాయల్ సుందరం లైఫ్‌లైన్ పాలసీల్లో మాత్రం నో క్లెయిమ్ బోనస్ కింద సమ్ ఇన్సూర్డ్ ఏటా 20 శాతం పెరుగుతుంది. కానీ, ఆ తర్వాతి సంవత్సరాల్లో క్లెయిమ్ వచ్చినప్పటికీ ఈ పెరిగిన సమ్ ఇన్సూర్డ్‌లో కోత విధించడం లేదు. ఇదో ఆకర్షణీయాంశం. కో పేమెంట్... అంటే సహ చెల్లింపు. క్లెయిమ్ మొత్తంలో కంపెనీతోపాటు పాలసీదారుడూ కొంత శాతాన్ని భరించడం. ఉదాహరణకు 20 శాతం కోపే ఉంటే, ఆస్పత్రి బిల్లు రూ.2 లక్షలు వచ్చిందనుకుంటే బీమా కంపెనీ రూ.1.60 లక్షల పరిహారమే చెల్లిస్తుంది. మిగిలిన రూ.40వేలను పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. హోమియో, ఆయుర్వేద చికిత్సలకూ... సాధారణంగా ఎక్కువ పాలసీలు అల్లోపతీ వైద్య చికిత్సలకే బీమా కవరేజీని పరిమితం చేస్తున్నాయి. హోమియోపతి, ఆయుర్వేదం, యునానీ తరహా వైద్య విధానాలకూ కవరేజీ కోరుకునే వారి కోసం మాక్స్ బూపా హెల్త్ కంపానియన్, రాయల్ సుందరం లైఫ్‌లైన్ పాలసీలను పరిశీలించొచ్చు. -
అవయవ దాతను పిండేశారు!
- అవయవాలను దానం చేసిన ఏడుకొండలు కుటుంబం - బాధితుడి కుటుంబానికి దక్కని స్వాంతన - అతడి వైద్యానికి రూ.1.20 లక్షల బిల్లు వేసిన కార్పొరేట్ ఆసుపత్రి - బిల్లు చెల్లించడానికి అప్పులు చేసి రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబం సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యానికి రూ.లక్షల్లో ఫీజు చెల్లించడానికి అప్పులు చేసి రోడ్డున పడింది ఓ అవయవ దాత కుటుంబం. బ్రెయిన్ డెడ్‌కు గురై ఆరు అవయవాలను దానం చేసిన వ్యక్తి కుటుంబానికి సర్కారు పైసా సాయం కూడా అందించలేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్) చరిత్ర సష్టించిందని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఆ గుండెను ఇచ్చిన కుటుంబాన్ని మాత్రం విస్మరించింది. శస్త్రచికిత్సను విజయవంతం చేసిన డాక్టర్ ఆళ్ల గోపాలకష్ణ గోఖలేను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఘనంగా సత్కరించారు. ఆరుగురికి అవయవదానం చేసిన కుటుంబాన్ని కనీసం గుర్తించలేదు. తమ లాంటి పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని, వైద్యం ఖర్చులనైనా భరించాలని అవయవదాత భార్య, బిడ్డలు కోరుతున్నారు. ఏడుకొండలు కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి ముఖ్యమంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. సహాయం అందించాలని కోరారు. పేద కుటుంబానికి చేయూతనివ్వాలని ఎమ్మెల్యే బొండా ఉమా కోరగా పరిశీలిద్దామని చంద్రబాబు ముక్తాయించారు. అసలేం జరిగిందంటే...: విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో నివసించే ఇమడాబత్తిన ఏడుకొండలు(44) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మే 13వ తేదీన మోటారుసైకిల్‌పై వెళుతూ బీఆర్టీఎస్ రోడ్డులో బస్సు ఢీకొని గాయాలపాలయ్యాడు. వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అక్కడి వైద్యం తీరుతో బెంబేలెత్తిన ఏడుకొండలు కుటుంబం అతడిని వెంటనే మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఫోన్లో వాకబు చేసిన తరువాత బ్రెయిన్ డెడ్ అని 19వ తేదీన డాక్టర్లు చెప్పారు. అవయవదానం గురించి ఏడుకొండలు కుటుంబానికి జీవన్‌దాన్ ట్రస్టు ప్రతినిధి వివరించారు. ఏడుకొండలుకు చెందిన ఆరు అవయవాలను దానం చేయడానికి అతడి భార్య నాగమణి, పిల్లలు జాహ్నవి, దీపక్ అంగీకరించారు. గుండెను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మరో డ్రైవర్‌కు అమర్చారు. ఒక మూత్రపిండాన్ని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో రోగికి అమర్చారు. మరో మూత్రపిండాన్ని విజయవాడలోని అరుణ్ కిడ్నీ సెంటర్‌కు, కాలేయాన్ని తాడేపల్లెలోని మణిపాల్ ఆసుపత్రికి, రెండు కళ్లను వాసన్ ఐ కేర్‌కు జీవన్‌దాన్ ట్రస్టు అందజేసింది. గుండె మార్పిడికి రూ.35 లక్షలు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఏడుకొండలుకు వైద్యం అందించినందుకు యాజమాన్యం రూ.1.20 లక్షలు వసూలు చేసింది. బాధితుడి కుటుంబం అప్పులు చేసి మరీ ఈ సొమ్మును చెల్లించింది. కర్మకాండలతోపాటు ఇతరత్రా ఖర్చులకు రూ.80 వేలకు పైగా అయ్యింది. ఏడుకొండలు నుంచి తీసుకున్న అవయవాలను ఇతర రోగులకు అమర్చడానికి కార్పొరేట్ ఆసుపత్రులు రూ.కోటికి పైగా వసూలు చేస్తాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో గుండె మార్పిడికి రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు అవుతుందని జీజీహెచ్ వైద్యులు చెప్పారు. ఒక మూత్రపిండం మార్పిడికి రూ.30 లక్షల నుంచి రూ.38 లక్షలు, కాలేయం మార్పిడికి రూ.30 లక్షలకు పైగా, కంటి మార్పిడికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలు తీసుకుంటున్నాయి. రోగి వయస్సు, ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్య ఖర్చుల్లో తేడాలు ఉంటాయి. అవయవ దాతను రోగి సమకూర్చుకుంటే బిల్లుల్లో మార్పులు ఉంటాయి. గొప్ప ఆశయంతో అవయవాలను దానం చేసినప్పటికీ బాధితుల కుటుంబాలు రూ.లక్షల్లో బిల్లులను చెల్లించాల్సి వస్తోంది. అవయవ దానం చేసిన పేదల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తే బాగుంటుందనే అభిప్రాయం వారి కుటుంబాల నుంచి వ్యక్తవుతోంది. మా కుటుంబం వీధిన పడింది ‘‘ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో వైద్యం, ఇతరత్రా అవసరాలకు రూ.రెండు లక్షలకు పైగా ఖర్చయ్యింది. డబ్బు లేక అప్పులు చేయాల్సి వచ్చింది. నా భర్త చనిపోవడంతో మా కుటుంబం వీధిన పడింది. మా కుమార్తె జాహ్నవి సీఏ చేయడానికి సిద్ధమవుతోంది. కుమారుడు దీపక్‌ను ఇంటర్మీడియట్లో చేర్చా ల్సి ఉంది. అవయవదానం చేసినందుకు మేము డబ్బులు ఆశించడం లేదు. ఆరు కుటుంబాలకు మేలు జరిగిందనే సంతృప్తి మిగిలింది. అవయవదానం చేసిన నిరుపేదల ఆసుపత్రి బిల్లులైనా ప్రభుత్వం చెల్లించగలిగితే మాలాంటి వారు ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు గట్టెక్కుతారు. తద్వారా అవయవదానం చేయడానికి నిరుపేద కుటుంబాలు ముందుకొస్తాయి’’ - నాగమణి, అవయవ దాత ఏడుకొండలు భార్య -
ఆ ఐదుగురిలో పునర్జన్మెత్తి..
► నిండు నూరేళ్లు కలిసుంటానంటూ ఏడడుగులు వేసిన తోడు.. అర్ధంతరంగా లోకాన్ని వీడుతున్నాడనే బాధను మునిపంటి కింద నొక్కి పట్టి..మిణుకుమిణుకుమనే ఆ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనే మహోన్నత ఆశయానికి పురుడు పోసింది. . ► నాన్న ఎక్కడమ్మా అంటూ చంటి బిడ్డలు మారం చేస్తుంటే..వారికి సమాధానం చెప్పలేక ఉబికివస్తున్న కన్నీళ్లను కళ్లలోనే దాచుకుంటూ..ఐదు కుటుంబాల్లో కల్లోలం రేపుతున్న అవే కన్నీళ్లను వారికి దూరం చేయాలనే సంకల్పానికి నడుం కట్టింది. ► కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోతున్నాననే దిగులును గుండె లోతుల్లో అదిమిపట్టి..మరెన్నో గుండెల్లో దిగులు తరిమేయాలనే భార్య త్రివేణి మనోధైర్యం ఆదర్శంగా నిలిచింది. భర్త అవయవాలను జీవన్‌దాన్‌కు అప్పగించి..తాను అంతులేని విషాదంలో మునిగిపోయింది. విజయవాడ(లబ్బీపేట): ఆయన మృతి చెందిన మరో ఐదుగురిలో సజీవంగా జీవించాలని భావించిన త్రివేణి అవయదానం చేసేందుకు ముందుకు వచ్చింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ ఇల్లాలి నిర్ణయం ముగ్గురికి పునర్జన్మను ప్రసాదించగా, మరో ఇద్దరికి ఈ రంగుల లోకాన్ని చూసేందుకు చూపునిచ్చింది. జీవన్‌దాన్ ద్వారా సూర్యారావుపేటలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బ్రెయిన్‌డెత్ యువకుడి నుంచి సేకరించిన రెండు కిడ్నీలు, లివర్, కళ్లు వేర్వేరు ఆస్పత్రులకు సోమవారం తరలించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై... ఖమ్మం జిల్లా ముచ్చర్లకు చెందిన కే సురేష్(25) వ్యవసాయ కూలీ. ఈ నెల 20న రోడ్డు ప్రమాదానికి గురి కాగా తొలుత జిల్లాలో స్థానికంగా ఉన్న పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం నగరంలోని మెట్రో ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో మెదడు వాపు వచ్చి బ్రెయిన్‌డెత్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇలాంటి స్థితిలో కోలుకోవడం కష్టమని, అవయవదానం ద్వారా మరికొందరికి పునర్జన్మను ప్రసాదించవచ్చునని వైద్యులు శ్రీనివాసరావు, వినయ్‌బాబు కుటుంబ సభ్యులతో చెప్పడంతో నిరుపేదలైనా మహోన్నత హృదయంతో అంగీకరించారు. జీవన్‌దాన్‌తో అవయవాల సేకరణ రాష్ట్రంలో అవయవదానం చేసేందుకు అమలులో ఉన్న జీవన్‌దాన్ పథకం ద్వారా యువకుడి అవయవాలు సేకరించారు. యువకుడి ఊపిరితిత్తులు, గుండె పనికి రావని వైద్యులు నిర్ధారించారు. రెండు కిడ్నీలను సేకరించి వాటిని సన్‌రైజ్ హాస్పిటల్, అరుణ్ కిడ్నీకేర్ సెంటర్లకు తరలించారు. లివర్‌ను మణిపాల్ ఆస్పత్రికి, రె ండు కళ్లు వాసన్ ఐ కేర్‌కు అప్పగించారు. రెండు కిడ్నీలను వేర్వేరు వ్యక్తులకు విజయవంతంగా అమర్చినట్లు వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం.. ఆదుకోండి బ్రెయిన్‌డెత్‌కు గురైన సురేష్‌కు ఏడాదిలోపు వయసున్న పాపతో పాటు, మూడేళ్ల బాబు ఉన్నారు. దినసరి కూలి పనులకు వెళితేనే పూటగడిచే ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం పెను విషాదం నింపింది. తన భర్త మృతి చెందడంతో ఇద్దరు చంటి పిల్లలతో తన పరిస్థితి ఏమిటంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది భార్య త్రివేణి. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది. ఒక మహోన్నత ఆశయంతో భర్త అవయవాలను దానం చేసిన ఆ ఇల్లాలి వేదనను అర్థం చేసుకుని దాతలు సహకరించాలని కోరుకుందాం. -
గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నం
► నర్రవాడ పీహెచ్సీలో అందని వైద్యం ► ఉదయగిరిలో మృత్యువుతో ► పోరాడి ఓడిన వైనం ఉదయగిరి : భర్తకు తెలియకుండా అప్పు చేసిన ఓ గిరిజన మహిళ భర్త మందలిస్తాడని భయపడి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రాణాపాయంతో నర్రవాడ పీహెచ్‌సీకి వస్తే వైద్యం అందక మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టకు తార్కాణంగా మిగిలిన విషాద ఘటన శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. కలిగిరి మండలం నరసారెడ్డిపాళెంకు చెందిన కావేటి నాగరాజు, భార్య చెంచమ్మ(23) నాలుగు నెలల క్రితం పచ్చిశనగ పైరు వద్ద కాపలా కోసం దుత్తలూరు మండలం కమ్మవారిపాళెం వచ్చారు. పొలాల్లోనే కాపలా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చెంచమ్మ భర్తకు తెలియకుండా తన సోదరుడికి వేరే వారి వద్ద కొంత నగదు అప్పు ఇప్పించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు శుక్రవారం ఆమె వద్దకు వచ్చి కూతురిని మందలించారు. ఈ విషయం తెలిస్తే తన భర్త మందలిస్తాడన్న భయంతో పొలానికి పిచికారీ చేసేందుకు తెచ్చిన మోనోక్రొటోపాస్ పురుగు మందు తాగింది. అప్పుడే పొలం నుంచి వచ్చిన భర్త అపస్మారక స్థితిలో ఉన్న భార్యను గుర్తించి సమీపంలో ఉన్న నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తీసుకువచ్చాడు. అక్కడ ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉన్నా ఒక్కరూ లేరు. ఉన్న ఏఎన్ఎంలు కూడా ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయలేదు. కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లే స్థోమత లేని ఆ గిరిజనులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గంటకుపైగా వైద్యశాల ముందే ప్రాణం కాపాడాలంటూ ప్రాధేయపడ్డారు. కానీ వారిని కనికరించిన వైద్య సిబ్బంది లేరు. అక్కడున్న వారు 108కు సమాచారం అందించడంతో రెండు గంటల ప్రాంతంలో 108 వచ్చింది. వారు సెలైన్ కట్టి వాహనంలో 2.50కి ఉదయగిరి సీహెచ్‌సికి తీసుకుచ్చారు. సీహెచ్‌సీలో వైద్యుడు సంధాని బాషా చికిత్స చేసేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న మరో దంత వైద్యురాలి సాయంతో ఆమె ప్రాణాలు కాపాడేందుకు శతధా ప్రయత్నించారు. అప్పటికే పరిస్థితి విషమించిపోవడంతో 3.45 గంటల ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయింది. సరైన సమయంలో వైద్యం అందక ఆ పేద మహిళ శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. మృతురాలికి ఏడాదిన్నర బిడ్డ ఉంది. సూపర్‌వాస్మోల్ తాగిన మరో మహిళ.. గిరిజన మహిళ ఓవైపు మృత్యువుతో పోరాడుతుండగానే సీతారామపురం మండలం నారాయణప్పపేటకు చెందిన మరో మహిళ షేక్ జానీ సూపర్‌వాస్మోల్ తాగడంతో 108 ద్వారా వైద్యశాలకు తీసుకుచ్చారు. వైద్యుడు ఒక్కరే ఉండటంతో ఇద్దరికీ ఒకేసారి చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. సహాయం చేసేందుకు ఏఎన్‌యంలు ఎవరూ లేకపోవడంతో వైద్యం అందించడంలో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఆమెను ఆత్మకూరు ఏరియా వైద్యశాలకు 108 ద్వారా తరలించారు. డ్యూటీలో ఉండవలసిన ఏఎన్ఎం తమ పై అధికారికి సమాచారం ఇవ్వకుండానే విధులకు గైర్హాజరు కావడంపై జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ సుబ్బారావును సాక్షి అడగ్గా విధులపట్ల నిర్లక్ష్యం వహించే వారిని క్షమించేది లేదన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యాధికారి నివేదిక ఇస్తే ఆమెపై చర్య తీసుకుంటామన్నారు. -
ఐసీయూలో ఆస్పత్రులు
మారుమూల పల్లెటూళ్లు మొదలుకొని దేశ రాజధాని న్యూఢిల్లీ వరకూ ఆస్పత్రులన్నీ ఒక్క తీరుగానే ఉన్నాయి. అవి సాధారణ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్య విధ్వంసం ఏ స్థాయిలో జరుగుతున్నదో, అందులో సామాన్యులెలా సమిథలవుతున్నారో ‘సాక్షి’ ఈ నెల 7వ తేదీనుంచి ఆరు రోజులపాటు వెలువరించిన ధారావాహిక కథనాలు కళ్లకు కట్టాయి. సర్కారు దవాఖానాలు నిలువెల్లా చీడపట్టి రోగులకు ఏ స్థాయిలో నరకాన్ని చూపిస్తున్నాయో... కార్పొరేట్ ఆస్పత్రులు డబ్బు జబ్బు ప్రకోపించి ఎలా నిలువు దోపిడీ చేస్తున్నాయో ఆ కథనాలు వెల్లడించాయి. ఈ రకమైన దుస్థితిపై అన్నిచోట్లా ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒక్క విధంగానే ఉన్నదని ఢిల్లీ మహా నగరంలో గత వారం రోజుల్లో చోటు చేసుకున్న రెండు విషాద ఘటనలు నిరూపించాయి. మొదటిది దక్షిణ ఢిల్లీలో ఒకటో తరగతి చదువుతున్న ఏడేళ్ల అవినాష్ రౌత్ ఉదంతం. ఢిల్లీలో అడ్డూ ఆపూ లేకుండా స్వైర విహారం చేస్తున్న డెంగీ వ్యాధికి ఇంతవరకూ బలైపోయిన 11మందిలో అవినాష్ ఒకడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అవినాష్‌ను అత డి తల్లిదండ్రులు ఆరు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అందరికందరూ అతన్ని చేర్చుకోవడానికి నిరాకరించారు. చివరిలో చేర్చుకున్న ఆస్పత్రి వైద్యులు అప్పటికే ఆలస్యమైపోయిందని తేల్చారు. ఆ బాలుడు నిస్సహాయ స్థితిలో మరణించాడు. కుమారుడికి సకాలంలో వైద్యం అందించలేకపోయామని కుమిలిపోతున్న అతని తల్లిదండ్రులు అవినాష్ అంత్యక్రియలు పూర్తికాగానే తిరిగొచ్చి తమ ఇంటిపైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత మేల్కొన్నట్టే కనబడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రులన్నిటికీ హెచ్చరికలు జారీచేశాయి. వైద్యాన్ని నిరాకరించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నాయి. ఇదంతా కొనసాగుతుండగానే మరో బాలుడు ఆరేళ్ల అమన్ శర్మ కూడా ఇలాంటి దుర్మార్గానికే బలయ్యాడు. అమన్ తల్లిదండ్రులు కూడా మహా నగరంలో సర్కారీ పెద్దాసుపత్రి సఫ్దర్‌జంగ్ మొదలుకొని నాలుగు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. తెల్లవార్లూ ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి ఆత్రంగా పరుగులెడుతూనే ఉన్నారు. అయినా అవినాష్‌కు ఏం జరిగిందో అమన్‌కూ అదే అయింది. సకాలంలో చికిత్స అందక పోవడంతో అమన్ కన్నుమూశాడు. రాష్ట్రపతి మొదలుకొని ప్రభుత్వాధినేతలందరూ... అత్యున్నత స్థాయి అధికారగణమంతా కొలువుదీరిన ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఇద్దరు పిల్లలను పొట్టనబెట్టుకున్న ఉదంతాలివి. మీడియా దృష్టి పడింది గనుక ఇవి బయటికొచ్చాయిగానీ రాని ఉదంతాలు ఎన్ని ఉంటాయో అంచనా వేయలేం. దేశ రాజధాని నగరంలోని ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు లేవని, చాలినన్ని పడకలు లేవని, అక్కడి వైద్యులకు మానవతా దృక్పథం కొరవడిందని... ప్రాణం మీదికొచ్చిన రోగినైనా నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేయగల దుర్మార్గం అక్కడ రాజ్యమేలు తున్నదని అందరికీ తెలియడం కోసం ఇద్దరు పిల్లలు కడతేరవలసి వచ్చింది. ఒక కుటుంబం మొత్తం ప్రాణార్పణ చేయాల్సివచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు కావస్తున్నది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ సారథ్యాన్ని స్వీకరించి ఏడు నెలలవుతోంది. ఇద్దరూ వైద్య రంగాన్ని గాలికొదిలారని ఈ ఉదంతాలు రుజువు చేశాయి. ఇది ఢిల్లీకి పరిమితమైన ధోరణి మాత్రమే కాదు. కొంత హెచ్చుతగ్గులతో దేశమంతా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉన్నదని తరచు బయటపడుతున్న దారుణ ఉదంతాలు తెలియజెబుతున్నాయి. ఈమధ్యే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మూషికాలు కొరికేసిన కారణంగా నెలలు నిండని బాలుడు మృత్యువాత పడ్డాడు. ‘సాక్షి’లో వెలువడిన ధారావాహిక కథనాలకు స్పందించిన ఎంతోమంది ప్రభుత్వాసుపత్రుల్లోని నిర్లక్ష్యాన్ని, కార్పొరేట్ ఆస్పత్రుల్లోని నిలువు దోపిడీని కళ్లకుగట్టారు. ఆ అనుభవాలను చదివిన వారెవరైనా ఆసుపత్రి గడప తొక్కే దుస్థితి తమకెదురుకావొద్దని మొక్కుకుంటారు. లాభార్జనపై దృష్టి పెరగడం, ఆ క్రమంలో నైతిక విలువలకు తిలోదకాలొదలడం దాదాపు అన్ని రంగాల్లోనూ పెరిగినా వైద్య రంగంలో ఇది శ్రుతిమించిన దాఖలాలు కనబడుతున్నాయి. మనుషులు సహజాతాలను కోల్పోయి, రోబోలుగా మారుతున్న వైనం వెల్లడవుతోంది. వైద్య విద్య అంగట్లో సరుకయ్యాకే వైద్యులు వ్యాపారులయ్యారు. కార్పొరేట్ వైద్యం లాభాలార్జించిపెట్టే పెద్ద బిజినెస్‌గా మారింది. లాభం తప్ప ప్రాణం గురించి పట్టని కార్పొరేట్ ఆస్పత్రుల బారి నుంచి ఇక జనానికి విముక్తి లభించే అవకాశం లేదని ఈమధ్యే నీతి ఆయోగ్ కేంద్ర ఆరోగ్య శాఖకు రాసిన లేఖ చదివితే అర్ధమవుతుంది. ప్రస్తుతం ప్రజారోగ్య రంగానికి జీడీపీలో ఖర్చుచేస్తున్న ఒక శాతం మించి నిధులు వెచ్చించడం సాధ్యంకాదని ఆ లేఖ చెబుతున్నది. 2020 నాటికి జీడీపీలో 2.5 శాతాన్ని ప్రజారోగ్యానికి కేటాయించాలన్న తాజా జాతీయ ఆరోగ్య విధానం ముసాయిదా లక్ష్యాలను సవరించుకొమ్మని ఆ లేఖ సూచిస్తున్నది. రోగులకు మందులు, చికిత్స, ఇతర పరీక్షలు...అన్నీ బీమా రంగంద్వారానే సాగాలంటున్నది. అంటే ఇప్పుడు ఢిల్లీలోనూ, దేశంలోని ఇతరచోట్లా వైద్య రంగంలో కనిపిస్తున్న జాడ్యం రాగలకాలంలో మరింత ముదురుతుందన్న మాట! వాస్తవానికి వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్రజారోగ్యంపై పెట్టే పెట్టుబడులు చాలా తక్కువని జాతీయ ఆరోగ్య విధానం ముసాయిదా గణాంకాలతో సహా వివరించింది. దీన్ని పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పింది. నీతి ఆయోగ్‌లో ఘనులు మాత్రం అందుకు విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ విషయంలో జనం మేల్కొని ప్రభుత్వాలను గట్టిగా నిలదీయకపోతే ఈపాటి వైద్య సదుపాయాలు కూడా భవిష్యత్తులో దుర్లభమవుతాయి. -
అడుగడుగునా దగా పడ్డాం!
* కార్పొరేటు వైద్యంపై జనాగ్రహం * ‘సాక్షి’ వరుస కథనాలకు విశేష స్పందన * కార్పొరేట్ ధనదాహానికి అంతులేదని ఆవేదన * అవసరం లేకున్నా ఆపరేషన్లు, టెస్టుల పేరుతో జేబులు ఖాళీ చేస్తున్నారని ధ్వజం * వైద్యుల అనైతిక పోకడలపై మండిపాటు సాక్షి ప్రత్యేక బృందం: అప్పుడే పుట్టి... మూడు ఆసుపత్రులు మారిన పసిపాప.. ధనదాహానికి బలై వెంటిలేటర్‌పై పడి ఉంది..! పరీక్షలంటూ 9 నెలల పాటు ఓ ఆసుపత్రి చేసిన నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణమే పోయింది! గుండె ఎన్లార్జ్ అయిందని అనవసర పరీక్షలు, చికిత్సతో ఆరు నెలలు లాగించేసింది మరో ఆసుపత్రి. యాక్సిడెంటయి ఆసుపత్రిలో చేరితే పరీక్షలకే రూ.40 వేలు గుమ్మరించిన ఓ పేద కుటుంబం.. ఆ కార్పొరేట్ ఆసుపత్రి డిమాండ్ చేసిన రూ.5 లక్షలు ఇవ్వలేక నిస్సహాయంగా వెనుదిరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే.. వీటికి అంతుండదు. ‘వైద్య విధ్వంసం’ శీర్షికతో కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల అనైతిక విధానాలపై ‘సాక్షి’ ప్రచురిస్తున్న కథనాలకు పాఠకుల నుంచి వచ్చిన స్పందన చూస్తే... బాధితుల వేదన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. వీటన్నిటినీ చూస్తే.. కోట్ల రూపాయలు కేవలం డొనేషన్ల రూపంలోనే గుంజే ప్రైవేటు మెడికల్ కాలేజీల దగ్గర మొదలయ్యే ఈ ధనదాహం.. అక్కడ్నుంచి కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు, బీమా సంస్థలు... ఇలా వైద్యం రంగంలో భాగమయ్యే ఏ ఒక్కదాన్నీ వదిలిపెట్టలేదన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఇంజెక్షన్లు తప్ప మరో చికిత్స లేని ఒక రకమైన కేన్సర్‌కు... రూ.2,65,000 ఖరీదు చేసే ఇంజెక్షను నెలకోసారి ఇవ్వాలని ఓ ఆసుపత్రి చెబితే... మరో మంచి వైద్యుడు దాన్ని నేరుగా రూ.1,95,000కు డీలర్ నుంచి తెప్పించి ఇచ్చాడంటే ఏమనుకోవాలి? ఒక్కో ఇంజెక్షన్‌పై ఏకంగా రూ.75 వేలు లాభమంటే అది ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? కొన్ని మందుల షాపులు వెయ్యి రూపాయల మందులపై 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయంటే అసలు మందులపై ఎంత లాభం ఉందనుకోవాలి? ఇవన్నీ ఇలాగే కొనసాగితే ఇక సామాన్యుడికి వైద్యమెక్కడ అందుతుంది? పెద్దఎత్తున స్పందన.. ‘కాసు’పత్రులపై అర్థవంతమైన చర్చ జరిగేలా కలసి రండంటూ ‘సాక్షి’ ఇచ్చిన పిలుపునకు స్పందనగా ప్రజల నుంచి పెద్దఎత్తున ఈ-మెయిళ్లు, లేఖలు వెల్లువెత్తాయి. పలువురు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేయగా... ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సమస్యల్ని కొందరు ప్రస్తావించారు. దాదాపు అందరూ ఏ ఆసుపత్రిలో ఎలా మోసపోయారో వివరించారు. అయితే తమ వైద్యంతో మన్ననలు అందుకుని, ‘వైద్యోనారాయణో హరి’ నానుడిని నిజం చేసిన మంచి డాక్టర్ల గురించి కూడా కొందరు ప్రస్తావించారు. నిజానికి చికిత్సలో అనైతిక కార్యకలాపాలనేవి చాలా ఆసుపత్రుల్లో కొనసాగుతున్నాయి. లేఖ లు రాసినవారు తమకు సంబంధించిన కొన్ని ఆసుపత్రుల్నే ప్రస్తావించారు. దానర్థం మిగతావన్నీ సచ్ఛీలమైనవని కాదు. అలాగే కొందరు మంచి వైద్యుల గురించి ప్రస్తావించారు. వాటి అర్థం మిగతావారంతా మంచివారు కాదని కూడా కాదు. అందుకే ఆసుపత్రులు, వైద్యుల పేర్లను ప్రస్తావించకుండా... బాధితుల ఆవేదనను మాత్రం అందజేస్తున్నాం. మా పాప పరిస్థితికి కారణం ఎవరు? నా భార్యకు గతనెల 15న విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పాప పుట్టింది. తల్లీబిడ్డా క్షేమం. కాకపోతే మూ డో రోజున పాపకు జ్వరం. మర్నాటికి అది యూరిన్ ఇన్ఫెక్షన్కు దారితీసింది. అక్కడి వైద్యుల సూచన మేరకు... బాగా పేరున్న ఓ పిల్లల వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాం. ఆయన కార్పొరేట్ ఆసుపత్రికి రిఫర్ చే శాడు. స్థానికంగా ఉండే బడా కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చాం. పాపకున్నది యూరినేషన్ సమస్య. రెండ్రోజులకు అది సర్దుకుంది. హమ్మయ్య! డిశ్చార్జి చేసేస్తారనుకున్నాం. కానీ కాసుల దాహంతో వారు డిశ్చార్జి చేయకుండా అలా ఐసీయూలోనే ఉంచారు. పాప బ్లడ్‌కు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. తరవాత మరో ఇన్ఫెక్షన్. అవి రెండూ ఐసీయూలో ఎక్కువ కాలం ఉంచటం వల్ల సోకే ఇన్ఫెక్షన్లి తరవాత తేలింది. ఇప్పుడు మా పాప వెంటిలేటర్‌పై ఉంది. ఇప్పటికే 3 లక్షలు బిల్లయింది. ఇంకా రూ.60 వేలు ఆసుపత్రికి బాకీ కూడా ఉన్నాం. పాప పరిస్థితి చూస్తే బతుకుతుందన్న గ్యారంటీ ఎంతమాత్రం లేదు. కానీ ఆశ చావకుండా చికిత్స కొనసాగిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి!! తప్పెవరిది? నా పాపకు ఏమైనా అయితే బాధ్యత వాళ్లది కాదా? - ప్రవీణ్, విజయవాడ తప్పుడు సమాచారం ఇచ్చారు.. మా బంధువు ఒకరు తరచూ తలనొప్పి, ఛాతీ నొప్పి వస్తే గైనకాలజిస్ట్‌ను సంప్రదించారు. ఆ డాక్టర్ గుంటూరులోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో న్యూరో ఫిజిషియన్‌ను కలవాలని సూచించారు. అక్కడికి వెళ్తే.. సీటీ స్కాన్‌తోపాటు రకరకాల పరీక్షలు చేసి, కార్డియాలజిస్ట్ వద్దకు వెళ్లాలని చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్తే రక్తపరీక్షలు, 2డీ ఎకో పరీక్షలు చేసి, ‘మీ గుండె ఎన్లార్జ్ అయింది. దీర్ఘకాలంపాటు మందులు వాడాలి’ అని చెప్పారు. ఆమె చాలా ఆందోళనకు గురైంది. నేను ఆమెను హైదరాబాద్ పిలిపించుకొని నా డాక్టర్ మిత్రుడికి చూపించాను. ఆయన 2డీ ఎకో పరీక్ష మా ముందే చేసి ఏమీ లేదని, అంతా సరిగ్గానే ఉందని చెప్పారు. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఛాతీ నొప్పి అని వెళ్తే.. కేవలం డబ్బులు కోసం ఆమెతో రకరకాల పరీక్షలు చేయించి, తప్పుడు సమాచారం ఇచ్చారు. - వెంకట్, గుంటూరు ఒక్క ఇంజెక్షన్‌కు రూ.2.65 లక్షలు చెప్పారు మాది ఖమ్మం. మా నాన్నకు లివర్‌లో గడ్డ ఉన్నట్టు తేలితే 2010లో హైదరాబాద్ పంజగుట్టలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తీసుకువెళ్లాం. వాళ్లు అక్కడ అన్ని పరీక్షలు చేసి నెల రోజులకు కేన్సర్ అని తేల్చారు. అంకాలజీ విభాగానికి రిఫర్ చేశారు. అక్కడ అది ఏ టైప్ కేన్సరో తేల్చడానికి 10 నెలల సమయం తీసుకున్నారు. చివరికి ఆ కేన్సర్‌కు ట్రీట్మెంట్ లేదని చెప్పారు. నాన్న బతకాలంటే రూ.2.65 లక్షల విలువజేసే ఇంజెక్షన్ ప్రతినెలా ఇవ్వాలని చెప్పారు. తర్వాత మరికొన్ని ఆసుపత్రులకు తిరిగాం. చివరికి ఆ ఇంజెక్షన్‌ను ఓ డాక్టర్ రికమెండేషన్‌తో రూ.1.95 లక్షలకు కొన్నా. పంజగుట్టలోని అదే ఆసుపత్రికి తీసుకువెళ్లి ఇస్తే కీమోథెరపీ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. కానీ నాన్న చనిపోయాడు. ఈ ఆసుపత్రిలో కేవలం టెస్టుల పేరుతోనే దాదాపు 10 నెలల కాలాన్ని వృథా చేశారు. ఇంత దారుణమా? ట్రీట్మెంట్ తొందరగా మొదలుపెట్టి ఉంటే మా నాన్న బతికేవారేమో! - మహమ్మద్ జానిమియా, సాఫ్ట్వేర్ ఇంజనీర్, జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా ఎమ్మారైలో ఇంత మోసమా? నాకు భుజం నొప్పి రావడంతో హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాను. డాక్టర్ పరీక్షించి ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.50 వేలు ఖర్చవుతుందని చెప్పారు. అలాగే ఎమ్మారై చేయాలని, ఓ డయగ్నస్టిక్ సెంటర్ అడ్రస్ ఇచ్చారు. మా స్నేహితుడి వద్ద చేయించుకుంటా అని చెప్పినా వినలేదు. తీరా ఆ డాక్టర్ చెప్పిన చోటుకే వెళ్లా. రూ.12 వేలు అవుతాయన్నారు. కాస్త తగ్గించాలని నేను అక్కడి వ్యక్తిని కోరా. మాటల్లో మాటగా ఆయన మా ఊరి వాడేనని తెలిసింది. ఎమ్మారైకి ఇచ్చే రూ.12 వేలల్లో 40 శాతం దాకా ఇక్కడికి పంపిన డాక్టర్‌కే వెళ్తాయని, అందుకే అంత ఎక్కువగా తీసుకుంటారని ఆయన చెప్పారు. డాక్టర్లు ఇలా చేయడం అన్యాయం కాదా? - నాయుడు, హైదరాబాద్ ఆ డాక్టర్ మాట విని ఉంటే.. కొందరు కేవలం డబ్బు కోసమే డాక్టర్ కోర్సు చదువుతున్నారు. సేవా దృక్పథం పూర్తిగా కనుమరుగైంది. నేను ఫుట్‌బాల్ ఆడుతుండగా కాలికి గాయమైంది. ఓ ఆర్థోపెడిక్ డాక్టర్ వద్దకు వెళ్లగా.. మోకాలు కీలుకు స్క్రూ వేయాలని చెప్పారు. తర్వాత మా అమ్మ మరో డాక్టర్ వద్దకు తీసుకెళ్లింది. ఆయన 15 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. నాకు మూడ్రోజుల్లోనే తగ్గిపోయింది. ఆ డాక్టర్ మాట విని ఉంటే అనవసరంగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చేది! - ఓ బాధితుడు (పేరు వెల్లడించలేదు) అనవసరంగా కోసేస్తున్నారు.. చాలామంది గర్భిణులకు అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారు. దాదాపు 95 శాతం మందికి సహజంగానే ప్రసవం జరుగుతుంది. కానీ నొప్పులతో ఒక మహిళను ఆసుపత్రికి తీసుకురాగానే ఆమెకు ఆ నొప్పులు తెలియకుండా ఉండేందుకు సెలైన్లు ఎక్కిస్తారు. అందులో నొప్పి తెలియని మందు కలుపుతారు. కాసేపటికి ‘నొప్పులు రావడం లేదు.. ఆపరేషన్ చేయాల్సిందే’ అని చెప్పి అవసరం లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారు. బిడ్డ పుట్టాక ఆరోగ్యం బాగోలేదంటూ అలా కూడా వేల రూపాయలు దండుకుంటున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణి పేదలు, మధ్యతరగతి వారికి శాపంలా మారింది. - సయీద్ మాజ్, ఖతార్(నిజామాబాద్ వాసి) కాళ్లపై పడ్డా వినలేదు.. మా బాబాయ్‌కి, స్నేహితుడికి మెదక్‌లో యాక్సిడెంట్ అయితే వెంటనే వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తీసుకెళ్లాం. నాలుగు గంటల్లోనే రకరకాల టెస్టులు చేసి రూ.40 వేలు తీసుకున్నారు. రాత్రి 11 గంటలకు వచ్చి రూ.5 లక్షలు కడితేనే ట్రీట్మెంట్ మొదలుపెడతామని, ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పారు. ఇప్పుడు రూ.2 లక్షలు క ట్టి, మిగతావి పొద్దున్నే ఇస్తామని చెప్పి, కాళ్ల మీద పడినా కరుణించలేదు. దేవుడి మీద భారం వేసి వారిని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ ట్రీట్మెంట్తో ఇద్దరు బతికారు. - దత్తు, మెదక్ ఇదీ.. డాక్టర్ల మాట ‘సాక్షి’ వరుస కథనాలపై బాధితులతో పాటు కొందరు వైద్యులూ స్పందించారు. వైద్య వృత్తిలో తామెదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ... నాణేనికి రెండోవైపు కూడా చూడాలని సూచించారు. నిజానికి ‘సాక్షి’ కథనాల్లో ఎక్కడా వైద్యుల పనితీరును తప్పుబట్టలేదు. అనైతిక వ్యాపారం తప్ప మరొకటి తెలియని కొన్ని శక్తుల ప్రవేశంతో వైద్య వ్యవస్థ భ్రష్టుపట్టిన తీరును మాత్రమే ప్రశ్నించింది. జనం లేఖల్లోనూ తాము దోపిడీకి గురవుతున్నామనే వేదన కనిపించింది తప్ప... వైద్యులపై వ్యక్తిగతంగా ఆగ్రహించిన వారెవ్వరూ లేరు. కొందరు వైద్యులు తమ మెయిల్స్‌లో ఏమన్నారో కూడా సంక్షిప్తంగా ఇస్తున్నాం... వారేమన్నారంటే.. అవినీతి, నైతికత లోపించటం అనేది అన్ని రంగాల్లోనూ ఉంది. మతంతో పాటు చట్టం, న్యాయం, ప్రభుత్వం, రాజకీయాలు, మీడియా, మిలిటరీ... ఇలా ఏ ఒక్కటీ మినహాయింపు కాదు. అలాంటిదే వైద్య వ్యవస్థ కూడా. కాకుంటే ఏ వ్యవస్థలోనైనా ఉండే కొద్దిమంది ఇలాంటివారి గురించి మొత్తం వ్యవస్థనే తప్పుబట్టడం సరికాదు. కష్టపడి చదివి, మెరిట్లో సీట్ సంపాదించి, సేవ చేయాలనే తలంపుతోనే ఎవరైనా ఈ వృత్తిలోకి వస్తారు. ఏ సమయంలోనైనా చికిత్స చేయడానికి రెడీగా ఉంటారు. మిగతా ఉద్యోగాల్లాగే ఈ వృత్తిలోనూ డబ్బు సంపాదించాలని భావిస్తారు. అదేమీ తప్పు కాదుగా? ఇక ట్రీట్మెంట్ కొస్తే ఎవరైనా మంచి చికిత్స చేయాలనే అనుకుంటారు. కావాలని నిర్లక్ష్యం చేయరు. కానీ వందల మందికి చక్కని చికిత్స చేసినా పొరపాటున ఒక రోగికేదైనా జరిగితే కోట్ల కొద్దీ జరిమానా వేస్తున్నారు. ఇది సమంజసమా? కొన్ని సందర్భాల్లో రోగుల బంధువులు వైద్యులపై దాడులు కూడా చేస్తున్నారు. వారికి రక్షణ ఎక్కడుంది? ఈ వ్యవస్థలో కొన్ని లోపాలున్న మాట నిజం. కానీ అవి ఏ ఒక్కరివల్లో, కొందరివల్లో రాలేదు. ఒకవేళ ఏ ఒక్కరైనా మార్చడానికి ప్రయత్నించినా సాధ్యం కాదు. అలాంటివారిని సదరు ఆసుపత్రుల యాజమాన్యాలే బాయ్‌కాట్ చేస్తున్నాయి. దీనికి బదులు ప్రతి డాక్టరూ సొంత ఆసుపత్రి పెట్టుకోవాలనుకున్నా సాధ్యం కాదు. ఇక నియంత్రణ సంస్థల సంగతికొస్తే అవి తమకు అనుకూలమైన రీతిలోనే నడుస్తాయి. కావాల్సిన వారిని వదిలిపెట్టి.. ఎవరిని టార్గెట్ చేయాలో ఎంచుకుని మరీ చేస్తాయి. ఇన్ని లోపాలున్నప్పుడు డాక్టర్లను టార్గెట్ చేయటం కరెక్టు కాదు. కదులుదాం.. కదిలిద్దాం సర్కారీ, కార్పొరేట్ వైద్యంలో మీకెదురైన చేదు అనుభవాలను.. మీరు చూసిన మంచి డాక్టర్ల గురించి ‘సాక్షి’తో పంచుకోండి. వైద్య దుస్థితిని మార్చడానికి సూచనలు కూడా తెలియజేయండి. వీటిని ప్రచురించటం ద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశమిద్దాం. మీ అనుభవాలు, ఆలోచనలను ఈమెయిల్స్, లేఖల ద్వారా ‘సాక్షి’కి పంపేటపుడు... మీ పేరు, మీకు చికిత్స చేసిన ఆసుపత్రి లేదా డాక్టరు పూర్తి పేరును, మొబైల్ నంబర్లను తప్పనిసరిగా తెలియజేయండి. మీ పేరు రహస్యంగా ఉంచాలని భావిస్తే అది కూడా రాయండి. లేఖలు, మెయిల్ పంపాల్సిన చిరునామా: ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 sakshihealth15@gmail.com -
టీచర్ కొట్టడంతో విద్యార్థి మృతి
కంకిపాడు(కృష్ణా): టీచర్ కొట్టడంతో ఓ విద్యార్థి ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని గోడవర్రు గ్రామానికి చెందిన ఇంటూరి. చింటూ, 8 వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 9 వ తేదీన ట్యూషన్ మాస్టర్ కొట్టడంతో చింటూ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుడు హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులు చికిత్స పొందాడు. తర్వాత చికిత్స ఖర్చు భరించే స్తోమత లేక గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఈ రోజు చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. -
ప్రీమియమూ చెల్లించాలి బిల్లులూ కట్టాలి
బిల్లుల కోసం 22 వేల మంది ఎదురు చూపులు ♦ ప్రహసనంగా నగదు రహిత వైద్యం ♦ ప్రీమియం చెల్లిస్తున్నా వైద్యానికి తప్పని నగదు చెల్లింపు ♦ జబ్బు నయమయ్యాక ఎనిమిది నెలలకుగానీ డబ్బు రాని పరిస్థితి ♦ ఉద్యోగులు, పెన్షనర్ల వెతలు.. సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు జబ్బు చేస్తే ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్లి రూపాయి కూడా చెల్లించకుండా వైద్యం చేయించుకోవచ్చునని రాష్ట్రప్రభుత్వం చెబుతుండగా.. పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లకోసం కల్పించిన ‘నగదు రహిత వైద్యం’ ఏమాత్రం సక్రమంగా అమలవట్లేదు. ఒకవైపు ప్రీమియం చెల్లిస్తూనే మరోవైపు ఆస్పత్రుల్లో చేతినుంచి డబ్బులు చెల్లించే పరిస్థితి ఉద్యోగులు, పెన్షనర్లకు ఏర్పడుతోంది. గడిచిన ఐదున్నర నెలల్లో.. అంటే 2015 జనవరి 1 నుంచి ఇప్పటివరకు వివిధ ఆస్పత్రుల్లో వైద్యంకోసం వెళ్లి చేతి నుంచి డబ్బులు చెల్లించిన వారి సంఖ్య 22 వేలకు పైనే. వీరంతా మెడికల్ రీయింబర్స్మెంట్ కోరుతూ వైద్యవిద్యా సంచాలకుల(డీఎంఈ) కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంతస్థాయిలో దరఖాస్తులు వచ్చాయంటే నగదు రహిత వైద్యం ఎంత ప్రహసనంగా సాగుతున్నదో అర్థమవుతోంది. ఉద్యోగుల స్థాయినిబట్టి కొందరు నెలకు రూ.90, మరికొందరు రూ.120 చొప్పున ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇలా ప్రీమియం చెల్లిస్తూనే మరోవైపు ఆస్పత్రుల్లో చేతినుంచి డబ్బులు చెల్లిస్తున్న పరిస్థితిపై ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. జబ్బు నయమయ్యాక ఎనిమిది నెలలకు డబ్బు.. ఉద్యోగికి జబ్బు చేస్తే జేబులో పైసా లేకుండా ఆస్పత్రికి భరోసాగా వెళ్లొచ్చునని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. కానీ జబ్బు నయమైన ఎనిమిది నెలలకుగానీ ఆ డబ్బు రావట్లేదని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఖర్చు రూ.50 వేలు దాటితే జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు లేదా పెన్షనర్లు ఆ బిల్లును హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి పంపించాలి. అక్కడనుంచి డీఎంఈ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ అనుమతి పొంది తిరిగి పేరెంట్ విభాగానికి రావాలి. అక్కడనుంచి జిల్లాకు రావాలి.. ఇదీ తంతు.అలా ఐదారునెలల్లో రావచ్చు. లేదా ఏడాదికీ రావట్లేదు. పైగా వైద్య సేవలకైన ఖర్చు మొత్తం రీయింబర్స్మెంట్ కింద రాదు. ఒక్కోసారి రూ.3 లక్షలైతే.. రూ.లక్ష కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్యాకేజీ సెటిల్మెంట్ ఏదీ?.. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులు సుమారు 35 లక్షలమందికి సంబంధించిన అంశమిది. దీనిపై ప్రభుత్వం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తుండడంపై వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్యాకేజీ రేట్లు గిట్టుబాటు కాదని ప్రైవేటు ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ ప్యాకేజీ రేట్లకే చేయాలని ప్రభుత్వం.. ఇలా ఇరువర్గాలు పట్టుదలకు వెళుతుండడంతో పథకం వెనక్కు వెళ్లింది. యాజమాన్యాలను పిలిచామని, నగదురహిత పథకం ఇదిగో.. ఇప్పుడు.. రేపూ.. అంటూ చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఏమీ చేయలేకపోయింది. దీంతో ఓవైపు ప్రీమియం చెల్లిస్తూ, మరోవైపు ఆస్పత్రుల్లో డబ్బు చెల్లిస్తూ, ఈ డబ్బు రీయింబర్స్మెంట్ ఎంతొస్తుందో తెలియక ఉద్యోగులంతా అయోమయంలో ఉన్నారు. ఇక పెన్షనర్ల బాధ చెప్పనలవి కాదు. ఇదిలావుంటే.. డీఎంఈ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులకు కమీషన్లు ఇస్తేగానీ అక్కడి సిబ్బంది అనుమతివ్వని పరిస్థితి. ఇదీ నగదు రహిత వైద్యం దుస్థితి. -
బాబోయ్.. కార్పోరేట్ వైద్యం..!
-
విషజ్వరంతో ఇద్దరు మృతి
చిగురుమామిడి : మండలంలోని ముల్కనూర్‌కు చెందిన లోకిని కొమురవ్వ(30) విషజ్వరంతో బాధపడుతూ మృతిచెందింది. కొమురవ్వకు గత నెల 17వ తేదీన జ్వరం వచ్చింది. స్థానికంగా చికి త్స పొందినా తగ్గలేదు. కరీంనగర్‌లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్ష లు నిర్వహించిన వైద్యులు ప్లేట్లెట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించి వైద్య సేవలందించారు. దాదాపు రూ.1.50 లక్షలు ఖర్చయ్యాయి. జ్వరం తగ్గలేదని మరింత డబ్బు కావాలని ఆస్పత్రి నిర్వాహకులు కోరగా.. తన వద్ద ఇక డబ్బు లేద ని మృతురాలి భర్త పోచయ్య తెలిపాడు. దీంతో ఆమెను ఆస్పత్రినుంచి డిశ్చార్చి చేయగా కొమురవ్వ శనివారం వేకువజామున మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రాజాపూర్‌లో.. ముత్తారం : మండలంలోని లద్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధి రాజాపూర్‌కు చెందిన టెలుసూరి ఐలమల్లు(52) శనివారం విషజ్వరంతో మృతిచె ందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం... ఐలమల్లు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక వైద్యుడి వద్ద చికిత్స చేయిస్తున్నారు. అయినా ఎంతకీ తగ్గకపోవడంతో శుక్రవారం గోదావరిఖనిలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. రక్తకణాలు క్షీణించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య సారమ్మ, కుమారుడు చంద్రం, కూతుళ్లు రజిత,శ్యామల ఉన్నారు. బావిలో పడి వృద్ధుడు... యైటింక్లయిన్‌కాలనీ : కమాన్‌పూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన నీలం రాజయ్య(68) శుక్రవారం రాత్రి బావిలో పడి మృతి చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రిపూట బయటకు వెళ్లిన ఇతను ప్రమాదవశాత్తు అందులో అందులో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు గోదావరిఖని టూటౌన్ ఎస్సై విద్యాసాగర్‌రావు కేసు నమోదు చేసుకున్నారు. నిప్పటించుకుని మహిళ... జ్యోతినగర్ : మానసిక స్థితి సరిగా లేక ఓ మహిళ నిప్పటించుకుని మృతి చెందిన సంఘటన ఎల్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధి ఇందిరానగర్‌లో శనివారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఇందిరానగర్‌కు చెందిన చిలుముల రాజమ్మ(50)కు మానసిక స్థితి సరిగా లేదు. నాలుగేళ్లుగా చికిత్స పొందుతూ ఇంట్లో నే ఉంటోంది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అరుపులు విన్న రాజమ్మ కుమారుడు వెళ్లి మంటలు ఆర్పి 108లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి భర్త పోశం ఫిర్యాదు మేరకు ఎన్టీపీసీ పోలీసులు కేసునమోదు చేసుకుని సంఘటననా స్థలాన్ని పరిశీలించారు. -
కిడ్నీ రాకెట్ కలకలం
సెవెన్ హిల్స్ ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టుతో వెలుగులోకి నకిలీ పత్రాలతో అక్రమాలు యథేచ్ఛగా అవయవమార్పిడి కిడ్నీ రాకెట్ వ్యవహారం నగరంలో సంచలనమైంది.ఒడిశా-విశాఖ కేంద్రంగా నడుస్తున్న ఈ వ్యవహారం సెవెన్‌హిల్స్ ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. కార్పొరేట్ ఆస్పత్రుల మాయాజాలంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నం, మెడికల్ : ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్లో సాగుతున్న కిడ్నీ కుంభకోణ ఛాయలు విశాఖ నగరాన్ని తాకాయా?.. నగర పరిధిలోని కిడ్నీ మార్పిడులు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్చగా జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. దీనికి నిదర్శనంగా మంగళవారం విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టు ఉదంతం నిలుస్తోంది. దీంతో విశాఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకోవాలంటే ప్రజల్లో భయం పట్టుకుంటోంది. విశాఖ నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రులు ఉత్తరాంధ్ర సరిహద్దు రాష్ట్రాలకు వైద్యపరంగా పెద్దదిక్కు. ఎటువంటి వైద్యానికైనా విశాఖపైనే ఆధారపడుతుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు డబ్బు యావకు లోనై రోగుల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నాయన్న అనుమానాలను సెవెల్‌హిల్స్ నిజం చేసింది. కిడ్నీ మార్పిడి సంఘటనలో ఆస్పత్రి డెరైక్టర్ అరెస్టు ఇప్పుడు కలకలం రేపింది. అవయవ మార్పిడికి సంబంధించి రక్త సంబంధీకులు, ఇతర బంధు వర్గాల నుంచి అవయవాలను దానంగా పొందాలంటే ఏపీ అవయవమార్పిడి చట్టం నిబంధనల ప్రకారం స్థానికంగా ఉండే బోధనాస్పత్రి పరిధిలోని ఆథరైజేషన్ కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. భార్యాభర్తల విషయంలో అనుమతుల్లో అస్పష్టత ఉండడంతో దీనిని ఆసరాగా తీసుకొని కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు దండుకుంటున్నాయన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నగరంలో చాలా కార్పొరేట్ ఆస్పత్రులు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ దొడ్డిదారిన యథేచ్ఛగా అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా నగరంలోని కేర్, అపోలో ఆస్పత్రుల్లో గుండె, కాలేయం, కిడ్నీ, కళ్లు తదితర అవయవాలను మార్పిడి చేసేందుకు అనుమతులున్నాయి. కీలక అవయవాల మర్పిడికి సంబంధించి ఏపీ జీవన్‌దాన్ అనుమతులను అవయవదాతలు, స్వీకరణకర్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కళ్లు, కిడ్నీ వంటి అవయవదానాలకు స్థానికంగా ఉండే ఆథరైజేషన్ కమిటీ అనుమతులు తప్పనిసరి అయినప్పటికీ ఎవరూ పాటించడం లేదు. ఈ అనుమతుల కోసం ఆథరైజేషన్ కమిటీ కూడా భారీ మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తుండడంతో, కమిటీకి తెలియకుండా అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండడం విశేషం. -
పసిడిపురి.. ఆరోగ్య సిరి
బంగారం వ్యాపారంలో రెండో ముంబైగా ప్రసిద్ధి చెందిన ప్రొద్దుటూరు ‘పసిడి పురి’గా పేరుగాంచింది. అంతటి కీర్తి సంపాదించిన ప్రొద్దుటూరు ‘ఆరోగ్యం’ విషయంలోనూ ఏమాత్రం తీసిపోకూడదనుకున్నారు. 30 పడలక ఆస్పత్రిని వంద.. తరువాత 350కు పెంచారు. జిల్లా స్థాయి ఆస్పత్రి హోదా కల్పించారు. అలా అన్ని హంగులతో రూపుదిద్దుకున్న ఇక్కడి ఆస్పత్రిలో అన్ని రోగాలకూ అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. అందుకు ఆరోగ్యశ్రీ తోడ్పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే అందరికీ ఆరోగ్యసిరి పంచారు. పురిటి పిల్లలకు కార్పొరేట్ వైద్యం ప్రొద్దుటూరులోని 30 పడకల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల ఒకప్పుడు ప్రొద్దుటూరుతో పాటు రాజుపాళెం, దువ్వూరు, ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల ప్రజలకు ‘పెద్ద దిక్కు’గా ఉండేది. పైన పేర్కొన్న ప్రాంతాల్లో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలే అధికంగా నివసించేవారు. తమకు ఏ చిన్న రోగమొచ్చినా ప్రొద్దుటూరు ఆస్పత్రికి వచ్చి వైద్య చికిత్స చేయించుకునేవారు. జనాభా పెరిగింది. రోగులూ పెరిగారు. ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్యా అంతకంతకు పెరిగింది. వంద పడకలకు పెంచినా... రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆస్పత్రి స్థాయిని పెంచాలని అనేక విన్నపాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రోగులు, వైద్య సిబ్బంది అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2000 సంవత్సరంలో ప్రొద్దుటూరు ఆస్పత్రిని వంద పడకల స్థాయికి పెంచారు. పొద్దుటూరు సహా పరిసర ప్రాంతాల్లో ప్రమాదాలు నిత్యకృత్యం. ఇక్కడి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఘర్షణలు ఇతర కేసుల్లో గాయపడ్డ బాధితుల్నైనా ప్రొద్దుటూరు ఆస్పత్రికే తీసుకువచ్చేవారు. మరోవైపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సైతం తరచూ నిర్వహించేవారు. దీంతో కొన్ని సందర్భాల్లో పడకలు చాలక రోగులు ఇబ్బంది పడేవారు. ఈ పరిస్థితుల్లో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గుర్ని పడుకోబెట్టేవారు. ఎవరెన్ని చెప్పినా.. కడపలో రిమ్స్ ఉండగా.. జిల్లా స్థాయి ఆస్పత్రిని మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఎంతో మంది ఎన్నో విధాలుగా అప్పటి ప్రభుత్వాన్ని కోరారు. ఒత్తిడీ తెచ్చారు. అయితే వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా జిల్లా వాసులకు అవసరమైన మరో పెద్దాస్పత్రిని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసింది అప్పటి ప్రభుత్వం. 350 పడకల ఆస్పత్రిని 2005 ఆగస్టు 3న భూమి పూజ చేశారు. రూ.11 కోట్లతో అధునాతనమైన భవంతులతో దీన్ని నిర్మించారు. 2011 ఆగస్టు 12న దీన్ని ప్రారంభించారు. నాడు మూడు విభాగాలే.. ఏరియా ఆస్పత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కేవలం మూడు విభాగాలు మాత్రమే పని చేసేవి. జిల్లా ఆస్పత్రిగా స్థాయి పెరిగాక అనేక విభాగాలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఆర్థో, ఆప్తాలమిక్, ఈఎన్టీ, మత్తుకు ప్రత్యేక విభాగం, చిన్నపిల్లల విభాగం, ఏఆర్టీ, టీబీతో పాటు అనేక విభాగాలు ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో నడుస్తున్నాయి. ఆయా విభాగాల్లోని వైద్యులు నిత్యం ఇక్కడ శస్త్ర చికిత్సలు చేస్తుంటారు. ఆరోగ్యశ్రీతో అందుబాటులోకి శస్త్ర చికిత్సలు జిల్లా ఆస్పత్రి స్థాయి పెరిగాక ప్రభుత్వం ఇక్కడ ఆరోగ్యశ్రీ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీంతో ప్రతి రోజూ ఆర్థో, స్త్రీల వ్యాధులు, చిన్న పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు కూడా జరగుతున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ నియోజక పరిధిలో సుమారు 3,500 ఆపరేషన్లు జరిగాయి. జిల్లా ఆస్పత్రిగా రూపుదిద్దుకున్న ప్రొద్దుటూరు ఆస్పత్రిలో నవజాత శిశు కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఎస్ఎన్సీయూ విభాగాన్నీ ప్రారంభించారు. సాధారణంగా పురిటి పిల్లలకు ప్రొద్దుటూరు సహా పరిసర ప్రాంతాల్లో చికిత్సా విభాగాలు లేవు. అయితే జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఎస్ఎన్సీయూ విభాగం నలుగురు చిన్నపిల్లల వైద్యులు పర్యవేక్షణలో విజయవంతంగా నడుస్తోంది. తాజాగా ఇక్కడ సీ పాప్, వెంటి లేటర్ ద్వారా పురిటి పిల్లలకు చికిత్సలు అందిస్తున్నారు. ఇక్కడ లభిస్తున్న సేవలు చూస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఇలాంటి సేవలు ఉండవనే అభిప్రాయం అందరిదీ. వైఎస్ చలవతోనే పెద్దాస్పత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చలవతోనే మా ప్రాంతానికి ఇంత పెద్ద ఆస్పత్రి వచ్చింది. ఇక్డకి అస్పత్రి భవనాలు చూస్తుంటే కళ్లు తిరుగుతాయి. వైఎస్ లేకుంటే ఇన్ని లక్షలు పెట్టి ఎవరు కట్టిస్తారు? ఆయన మా జిల్లా వాసి కావడం మా అదృష్టం. అందుకే 350 పడకలతో ఆస్పత్రి వచ్చింది. ఆయనే ఉన్నింటే ఆస్పత్రి ఇంకా అభివృద్ధి చెందేది. - లక్ష్మీదేవి, సంజీవనగర్ ఆరోగ్యశ్రీ కాపాడుతోంది మా ఊరి ఆస్పత్రికి వైఎస్ జిల్లా స్థాయి హోదా కల్పించారు. ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నారు. ఏ ప్రమాదం జరిగినా, ఎంత పెద్ద రోగమొచ్చినా లక్షలు విలువ చేసే వైద్యం ఉచితంగా అందుతోంది. ఇంతకు ముందు ఏ చిన్న ప్రమాదం జరిగినా దూర ప్రాంతాలకు వెళ్లే వాళం. ఇప్పుడా అవసరం లేకుండా పోయింది. జగన్ సీఎం అయితే ఆస్పత్రి ఇంకా బాగుపడుతుంది. - యాడికి సుబ్బమ్మ, ప్రొద్దుటూరు మెడికల్ కాలేజీ వచ్చేది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతి ఉన్నింటే ప్రొద్దుటూరుకు మెడికల్ కాలేజీ వచ్చేది. ఆయన అకాల మరణంతో జిల్లా అభివృద్ధితో పాటు ఆస్పత్రి అభివృద్ధి కూడా కుంటుపడింది. వైద్యులు, అనేక వ్యాధుల విభాగాలు ఉన్నా తగినన్ని పరికరాలు లేక, కొన్ని రకాల చికిత్సలకు ఇబ్బంది కలుగుతోంది. జగన్ అధికారంలోకొస్తే ఆ సమస్యా తీరుతుంది. - సిరిశెట్టి నరసింహులు, పెన్నానగర్ వైఎస్ వల్లే బతికా నాకు గుండెజబ్బు వచ్చింది. డాక్టర్లను కలిస్తే స్టంట్స్ వేయాలన్నారు. అందుకు రూ.లక్ష ఖర్చవుతుందన్నారు. అంత స్థోమత నాకు లేదు. ఈ సమయంలో వైఎస్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ నాలో ధైర్యం నింపింది. హైదరాబాద్ నాంపల్లెలోని కేర్ ఆస్పత్రిలో 2008 మే 18న ఆపరేషన్ చేయించుకున్నా. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. ఆయనే లేకుంటే నేనీ రోజు మీతో ఇలా మాట్లాడేవాడ్ని కాదు. అందుకు వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నా. - కుప్పం శ్రీణివాసరావు, కె.రాజుపల్లె, చక్రాయపేట మండలం -
ఆరోగ్యశ్రీకి అర్హత లేదు
కరిచర్లగూడెం (గోపాలపురం), న్యూస్‌లైన్ : రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబమది. ఆ కుటుంబంలోని ఏడాది వయసున్న బాలుడికి పెద్దకష్టం వచ్చింది. తలలోని నరం పనిచేయకపోవడం వల్ల రోజురోజుకూ తల భాగం పెరుగుతోంది. దీంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు తీసుకుని హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లారు. ఆరోగ్యశ్రీ కార్డులో పేరున్నా ఫొటో లేదని పొమ్మన్నారు. దీంతో వారు తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న వారు లేరు. కరిచర్లగూడెంకు చెందిన ఉపాధి కూలీ జమ్ము పైడిరాజు, సుభద్రలు తమ మూడో కుమారుడు బబ్లూకి ఏడు నెలల క్రితం గౌరీపట్నం మేరీమాత ఆలయంలో తలనీలాలు సమర్పించారు. అనంతరం బబ్లూ తల పెరుగుతుండటాన్ని వారు గమనించి రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా తలలో నరం పనిచేయడం లేదని, హైదరాబాద్‌లోని రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లగా ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డులో బబ్లూ ఫొటో లేదని పంపించేశారు. ప్రైవేట్‌గా చికిత్స చేయించుకోవాలంటే రూ. 1.20 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు స్వగ్రామం వచ్చి బబ్లూ ఫొటో, పేరు నమోదు చేయించేందుకు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అదిగో చేస్తాం.. ఇదిగో చేస్తాం. అంటున్నారేకానీపట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆరోగ్యశ్రీకి ఉరి
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జిల్లెలగూడకు చెందిన సుధాకర్‌కు శనివారం అర్ధరాత్రి ఉన్నట్టుండి గుండెనొప్పి వచ్చింది. చికిత్స కోసం బంధువులు ఆయన్ను మలక్‌పేటలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనకు ఆరోగ్యశ్రీతో పాటు ఈఎస్ఐ కూడా ఉంది. అయినా రూ.50 వేలు అడ్వాన్స్‌గా చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని స్పష్టం చేశారు. ఒకేసారి అంత డబ్బు కట్టడం తమ వల్ల కాదని, తెల్లవారిన తర్వాత చెల్లిస్తామని బాధితుని బంధువులంతా వేడుకున్నా ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో ఆయన్ను బైరామల్‌గూడలోని మరో కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా అదే అనుభవం ఎదురైంది. ఇక చేసేది లేక రూ.40 వేలు అడ్వాన్స్‌గా చెల్లించి అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా బేగంపేట సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర ంగా గాయపడిన ఐటీ ఉద్యోగి హేమంత్ వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి చేరుకున్నాడు. తన వద్ద ఉన్న న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కార్డును ఆస్పత్రి సిబ్బందికి చూపడంతో చికిత్సకు వారు విముఖత చూపారు. అత్యవసర విభాగంలో పడకలు ఖాళీ లేవంటూ అక్కడి నుంచి తిప్పి పంపారు. మహబూబ్‌నగర్‌కు చెందిన నారాయణకు కిడ్నీలో రాళ్లు పేరుకుపోయాయి. చికిత్స కోసం తన వద్ద ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని మలక్‌పేటలోని ఓ కిడ్నీ సెంటర్‌ను ఆశ్రయించాడు. ఆరోగ్యశ్రీ జాబితాలో ఆ శస్త్రచికిత్స లేదని పేర్కొంటూ అడ్మిషన్‌కు నిరాకరించారు. ఇలా ఒక్క సుధాకర్, హేమంత్, నారాయణలకు మాత్రమే కాదు.. ఆరోగ్యశ్రీ, ఈఎస్ఐ, ఇతర ఆరోగ్య భద్రత కార్డులను కలిగి ఉన్న లబ్ధిదారులందరికీ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఆస్పత్రికి గిట్టుబాటయ్యే శస్త్రచికిత్సలైతే సరి.. లేదంటే పడకలు ఖాళీ లేవనే పేరుతో చికిత్సలకు నిరాకరిస్తుండటంతో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు సైతం డబ్బు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. అసలే అంతంత స్తోమత కలిగిన వీరికి ఆరోగ్యం అందని ద్రాక్షే అవుతుంది. ఆరోగ్యశ్రీ రోగులపై కార్పొరేట్ల చిన్నచూపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 400కి పైగా ఆస్పత్రులు ఉండగా, వీటిలో హైదరాబాద్‌లోనే వందకుపైగా ఉన్నాయి. అత్యధిక శస్త్రచికిత్సలు ఇక్కడే జరుగుతున్నాయి. లబ్ధిదారులందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామని హామీ ఇచ్చిన కార్పొరేట్ ఆస్పత్రులు తీరా అక్కడికి చేరుకున్న రోగులను చిన్నచూపు చూస్తున్నాయి. ఆస్పత్రి ఆవరణలో దూరంగా ఇరుకైన గదుల్లో ఓ చిన్నవార్డు ఏర్పాటుచేసి, వారికేదో ఉచిత సేవలు చేస్తున్నట్లు హడావుడి చేస్తున్నాయి. ఆస్పత్రికి ఆర్థికంగా గిట్టుబాటు అయ్యే గుండె, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సర్ వంటి పెద్ద శస్త్రచికిత్సలు మినహా తక్కువ ఖర్చుతో కూడిన సర్జరీలను చేసేందుకు నిరాకరిస్తున్నాయి. ఖరీదైన కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే కాదు ఉస్మానియా, నిమ్స్, గాంధీ వంటి ప్రభుత్వాస్పత్రుల్లోనూ రోగులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. చేతిలో కార్డున్నా పర్సులో పైసల్లేకపోతే అక్కడ కనీస చికిత్సలు అందడం లేదు. నిజానికి ఆరోగ్యశ్రీ కార్డుంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయించుకోవచ్చని చాలామంది రోగులు భావిస్తుంటారు. కానీ ప్రభుత్వాసుపత్రుల్లో సైతం చికిత్సల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈసీజీ తీయించాలన్నా.. ఎక్సరే కావాలన్నా.. రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలన్నా డబ్బులు విధిగా చెల్లించాల్సి వస్తోంది. మందులూ బయటే కొనాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కో బాధితుడు రూ.20వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెద్ద శస్త్రచికిత్సలకే అనుమతి వైద్యం ఖరీదు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ కార్పొరేషన్లు, కంపెనీల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు ఆరోగ్య భద్రత కోసం వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల్లో పాలసీలు పొందుతున్నారు. మిధాని, ఈసీఐఎల్, సీజీహెచ్ఎస్ స్కీమ్‌లు కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న నెట్వర్క్ ఆస్పత్రులన్నీ ఉచితంగా చికిత్సలు చేయాలి. ఇందుకు అయిన ఖర్చులను ఆయా కంపెనీల నుంచి తీసుకోవాలి. కానీ ఆర్థికంగా గిట్టుబాటు కాని శస్త్రచికిత్సలను వదిలేసి, అధిక బిల్లులు వసూలు చేసుకునేందుకు అవకాశం ఉన్న ఓపెన్‌హార్ట్, క్యాన్సర్, కిడ్నీ, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను మాత్రమే అనుమతిస్తున్నారు. చిన్నచిన్న శస్త్రచికిత్సల కోసం వచ్చిన బాధితులను పడకలు ఖాళీ లేవంటూ తిప్పి పంపుతున్నారు. ఒక వేళ ఈ శస్త్రచికిత్సలు చేసేందుకు అంగీకరించినా.. నిబంధనలకు విరుద్ధంగా రోగుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆరోగ్యశ్రీ అనగానే బెడ్స్ లేవన్నారు నేను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని ఆదివారం సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లాను. బెడ్స్ ఖాళీ లేవని చెప్పారు. పడక దొరికే వరకు ఉంటానని చెప్పినా సిబ్బంది విన్పించుకోలేదు. సెక్యూరిటీని పిలిపించి బయటికి గెంటేశారు. ఎటుపోవాలో తెలియక ఉదయం నుంచి ఆస్పత్రి ముందే ఇలా గడుపుతున్నా. - జయమ్మ, సంగారెడ్డి ఈఎస్ఐ కార్డు ఉందన్నా చేర్చుకోలేదు మా ఆయన జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ డ్రైవర్. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి ఆయనకు గుండె నొప్పి వచ్చింది. ఈఎస్ఐ కార్డు తీసుకుని మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఈఎస్ఐ అని చెప్పగానే బెడ్డు ఇచ్చేందుకు నిరాకరించారు. రూ.50 వేలు చెల్లిస్తేనే చికిత్స చేస్తామన్నారు. అర్ధరాత్రి అంత చెల్లించే స్తోమత లేకపోవడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడా ఇదే అనుభవ ం ఎదురైంది. చేసేది లేక అడిగినంత చెల్లించి వైద్యం చేయిస్తున్నా. - జ్యోతి సుధాకర్, జిల్లెలగూడ -
గాయాలపాలైన మార్జాల మేయర్
ఆ మార్జాలం గత పదహారేళ్లుగా అలాస్కా పట్టణానికి ఆనరరీ మేయర్‌గా ఉంది. అలాంటిది మొన్నీమధ్య... కుక్కకాట్లు తిని చావుతప్పి కన్నులొట్టబోయినంత పనై, కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్సపొందింది. ఇంతకీ... మార్జాలమేంటీ, మేయర్‌గా ఉండటమేంటీ? పాశ్చాత్యదేశాలలో ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు గనక స్థానికులకు నచ్చకపోతే వారు పాలుతాగే పసివారి దగ్గరనుంచి పశుపక్ష్యాదుల వరకు... ఎవరికైనా సరే ఓటేసి గెలిపించే సంప్రదాయం ఉంది. అలా గెలిచిన పసివారికి లేదా పశువులు, పక్షులు, జంతువులకు గౌరవ బాధ్యతలు కట్టబెట్టి, ఆ స్థానంలో ప్రజలందరూ కలిసి తమను తామే పాలించుకుంటారన్నమాట. ఆ కోవలో పదహారేళ్లక్రితం ఎన్నికైనవారే మన మార్జాల మేయరుగారు. అప్పట్లో అన్ని పత్రికల్లోనూ పతాక వార్తల్లోకెక్కింది కూడా. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దాని పెత్తనాన్ని సహించలేని జాతివిరోధి అయిన ఓ ఊరకుక్కకు మేయర్‌గారు ఒంటరిగా దొరికారు. దాంతో అది కసితీరా కరవడంతో గాయాలతో రోడ్డుమీద పడిపోయింది. అటుగా వెళుతున్న స్థానికులెవరో చూసి, దానిని మేయర్‌గా గుర్తించి పశువులాస్పత్రిలో చేర్పించారు. పశువైద్యులు నానాతంటాలుపడి నాలుగైదు గంటలపాటు శ్రమించి, దాని ఒంటికి, ఊపిరితిత్తులకు అయిన గాయాలకు ఆపరేషన్లు చేసి, ఎలాగో బతికించారు. దాంతో కాస్త కోలుకున్న తర్వాత తిరిగి ఇప్పుడు ఇలా ఫోజులిచ్చి మళ్లీ పేపర్లకెక్కింది మేయర్ మార్జాలం. -
గాయాలపాలైన మార్జాల మేయర్
ఆ మార్జాలం గత పదహారేళ్లుగా అలాస్కా పట్టణానికి ఆనరరీ మేయర్‌గా ఉంది. అలాంటిది మొన్నీమధ్య... కుక్కకాట్లు తిని చావుతప్పి కన్నులొట్టబోయినంత పనై, కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్సపొందింది. ఇంతకీ... మార్జాలమేంటీ, మేయర్‌గా ఉండటమేంటీ? పాశ్చాత్యదేశాలలో ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు గనక స్థానికులకు నచ్చకపోతే వారు పాలుతాగే పసివారి దగ్గరనుంచి పశుపక్ష్యాదుల వరకు... ఎవరికైనా సరే ఓటేసి గెలిపించే సంప్రదాయం ఉంది. అలా గెలిచిన పసివారికి లేదా పశువులు, పక్షులు, జంతువులకు గౌరవ బాధ్యతలు కట్టబెట్టి, ఆ స్థానంలో ప్రజలందరూ కలిసి తమను తామే పాలించుకుంటారన్నమాట. ఆ కోవలో పదహారేళ్లక్రితం ఎన్నికైనవారే మన మార్జాల మేయరుగారు. అప్పట్లో అన్ని పత్రికల్లోనూ పతాక వార్తల్లోకెక్కింది కూడా. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దాని పెత్తనాన్ని సహించలేని జాతివిరోధి అయిన ఓ ఊరకుక్కకు మేయర్‌గారు ఒంటరిగా దొరికారు. దాంతో అది కసితీరా కరవడంతో గాయాలతో రోడ్డుమీద పడిపోయింది. అటుగా వెళుతున్న స్థానికులెవరో చూసి, దానిని మేయర్‌గా గుర్తించి పశువులాస్పత్రిలో చేర్పించారు. పశువైద్యులు నానాతంటాలుపడి నాలుగైదు గంటలపాటు శ్రమించి, దాని ఒంటికి, ఊపిరితిత్తులకు అయిన గాయాలకు ఆపరేషన్లు చేసి, ఎలాగో బతికించారు. దాంతో కాస్త కోలుకున్న తర్వాత తిరిగి ఇప్పుడు ఇలా ఫోజులిచ్చి మళ్లీ పేపర్లకెక్కింది మేయర్ మార్జాలం. -
గాయాలపాలైన మార్జాల మేయర్
ఆ మార్జాలం గత పదహారేళ్లుగా అలాస్కా పట్టణానికి ఆనరరీ మేయర్‌గా ఉంది. అలాంటిది మొన్నీమధ్య... కుక్కకాట్లు తిని చావుతప్పి కన్నులొట్టబోయినంత పనై, కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్సపొందింది. ఇంతకీ... మార్జాలమేంటీ, మేయర్‌గా ఉండటమేంటీ? పాశ్చాత్యదేశాలలో ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు గనక స్థానికులకు నచ్చకపోతే వారు పాలుతాగే పసివారి దగ్గరనుంచి పశుపక్ష్యాదుల వరకు... ఎవరికైనా సరే ఓటేసి గెలిపించే సంప్రదాయం ఉంది. అలా గెలిచిన పసివారికి లేదా పశువులు, పక్షులు, జంతువులకు గౌరవ బాధ్యతలు కట్టబెట్టి, ఆ స్థానంలో ప్రజలందరూ కలిసి తమను తామే పాలించుకుంటారన్నమాట. ఆ కోవలో పదహారేళ్లక్రితం ఎన్నికైనవారే మన మార్జాల మేయరుగారు. అప్పట్లో అన్ని పత్రికల్లోనూ పతాక వార్తల్లోకెక్కింది కూడా. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత దాని పెత్తనాన్ని సహించలేని జాతివిరోధి అయిన ఓ ఊరకుక్కకు మేయర్‌గారు ఒంటరిగా దొరికారు. దాంతో అది కసితీరా కరవడంతో గాయాలతో రోడ్డుమీద పడిపోయింది. అటుగా వెళుతున్న స్థానికులెవరో చూసి, దానిని మేయర్‌గా గుర్తించి పశువులాస్పత్రిలో చేర్పించారు. పశువైద్యులు నానాతంటాలుపడి నాలుగైదు గంటలపాటు శ్రమించి, దాని ఒంటికి, ఊపిరితిత్తులకు అయిన గాయాలకు ఆపరేషన్లు చేసి, ఎలాగో బతికించారు. దాంతో కాస్త కోలుకున్న తర్వాత తిరిగి ఇప్పుడు ఇలా ఫోజులిచ్చి మళ్లీ పేపర్లకెక్కింది మేయర్ మార్జాలం.