రైల్వే ట్రాక్పై ఇద్దరు ఆత్మహత్య | Two suicide in railway track in karimngar district | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రాక్పై ఇద్దరు ఆత్మహత్య

Published Tue, Mar 29 2016 2:26 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Two suicide in railway track in karimngar district

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం రాఘవాపూర్ సమీపంలో రైల్వే ట్రాక్పై ఇద్దరు వ్యక్తులు ఆత్మహ్యత చేసుకున్నారు. ఆ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా మృతులు ముత్తారం మండలం లద్నాపూర్కు చెందిన రామిళ్ల కుమార్ (40), ఇదునూరి మల్లమ్మ (45)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ బంధువులని... వారి మధ్య  వివాహేతర సంబంధం ఏర్పడిందని...ఈ నేపథ్యంలో వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.  వారం రోజుల క్రితమే వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement