దామరచర్ల (నల్లగొండ) : మెడికల్ బిల్లు విషయంలో అవినీతికి పాల్పడిన ఓ ఏఎన్‌ఎం సహా ఇద్దరు ఉపాధ్యాయులను తొలగిస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో మెడికల్ బిల్లు విషయంలో అవినీతికి పాల్పడిన ఏఎన్‌ఎం సహా ఇద్దరు ఉపాధ్యాయలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.