Medical bill
-
సిరివెన్నెల కుటుంబానికి అండగా నిలిచిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నమూసిన సంగతి తెలిసిందే. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ.. నవంబర్ 24న సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ.. మంగళవారం సాయంత్రం సిరివెన్నెల మృతి చెందారు. ఈ క్రమంలో సిరివెన్నెల కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. సిరివెన్నెల వైద్యం ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. (చదవండి: సిరివెన్నెల గారు అలా నా జీవితాన్ని దిశా నిర్ధేశం చేశారు: రాజమౌళి) ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇదివరకే కుటుంబ సభ్యులతో మాట్లాడారు అధికారులు. ఆస్పత్రి ఖర్చుల భారం సిరివెన్నెల కుటుంబంపై పడకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సీఎం ఆదేశాల మేరకు ఆస్పత్రితో మాట్లాడమని, మొత్తం ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చెల్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అలానే సిరివెన్నెల కుటుంబానికి స్థలం కేటాయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. (చదవండి: అందరూ పోతారు కానీ.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు) ఇటువంటి సమయంలో సీఎం జగన్ తమకు అండగా నిలిబడినందుకు గాను సిరివెన్నెల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. సిరివెన్నెల అంత్యక్రియలకు హాజరైన మంత్రి పేర్ని నాని ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: కళావెన్నెల, కళాతపస్విల బంధం.. వారి అంతరంగం మీకోసం -
పంటినొప్పి..!
-
వైద్య బిల్లుల చెల్లింపునకు అనుసరించిన విధానం ఏమిటి?
పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిపాలన ట్రిబ్యునల్ (ఏపీఏటీ) విశ్రాంత సభ్యులకు వైద్య బిల్లుల చెల్లింపు విషయంలో అనుసరిస్తున్న విధానం ఏమిటో తెలియచేయాలని హైకోర్టు మంగళవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఏటీ విశ్రాంత సభ్యులకు వైద్య బిల్లుల చెల్లింపు విషయంలో బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాయంటూ న్యాయవాది కె.శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, వైద్య బిల్లుల చెల్లింపునకు విశ్రాంత సభ్యులు అర్హులే కదా? మరెందుకు వారికి బిల్లులు చెల్లించడం లేదని ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులను ప్రశ్నించింది. వారు దీనికి సమాధానం చెప్పకుండా పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యంలో అభ్యర్థన గురిం చి ప్రస్తావించారు. అయితే ధర్మాసనం అటువంటి వాటి గురించి చెప్పొదని, ఏ రాష్ట్రంలో పెన్షన్ పొందుతుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వమే వారికి వైద్య బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలిపింది. పెన్షన్ పొందుతున్న వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం, ఏపీలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం వైద్య బిల్లులు చెల్లించాల్సి ఉందని, మరి ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. రేపు ఇదే పరిస్థితి తమకూ రావొచ్చని, అప్పుడు తాము కూడా ఇలానే కోర్టుకు రావాల్సిందేనా? అంటూ వారిని ప్రశ్నించింది. అసలు వైద్య బిల్లుల చెల్లింపు విషయంలో అనుసరించిన విధానం ఏమిటో చెప్పాలని ఇరువురు న్యాయవాదులకు స్పష్టం చేసింది. ఇందుకు వారు గడువు కోరడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సమస్య మనవరకూ వస్తేకానీ తెలియదం టూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
అక్రమ మెడికల్ బిల్లు : ముగ్గురి సస్పెన్షన్
దామరచర్ల (నల్లగొండ) : మెడికల్ బిల్లు విషయంలో అవినీతికి పాల్పడిన ఓ ఏఎన్ఎం సహా ఇద్దరు ఉపాధ్యాయులను తొలగిస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో మెడికల్ బిల్లు విషయంలో అవినీతికి పాల్పడిన ఏఎన్ఎం సహా ఇద్దరు ఉపాధ్యాయలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. -
అంబరీష్ వైద్య ఖర్చుల చెల్లింపుపై వివాదం
బెంగళూరు: శ్యాండిల్‌వుడ్ రెబల్‌స్టార్, కర్ణాటక రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ వైద్యానికి కోటి 16 లక్షల రూపాయలు చెల్లించాలని రాష్ట్రప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై వివాదం చెలరేగింది. 62 ఏళ్ల అంబరీష్ సింగపూర్‌లోని ఎలిజబెత్ మెడికల్ సెంటర్లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబం సింగపూర్ ప్రయాణానికి, చికిత్సకు అయిన ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. నటి సుమలత భర్త అయిన అంబరీష్ శ్వాస కోశానికి ఇన్ఫెక్షన్ కారణంగా తొలుత ఇక్కడి విక్రమ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో సింగపూర్‌కు తరలించారు. అక్కడ ఎలిజబెత్ మెడికల్ సెంటర్లో చేర్చారు. అక్కడ చికిత్స తీసుకొని, అనంతరం మలేషియాలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అంబరీష్ ఏప్రిల్‌లో నగరానికి తిరిగి వచ్చారు. వైద్య చికిత్సకు అయిన మొత్తాన్ని చెల్లించమని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆ మొత్తం చెల్లించడానికి ప్రభుత్వం తీర్మానించింది. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అంత మొత్తాన్ని ప్రభుత్వం ఏ విధంగా చెల్లిస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విధమైన చెల్లింపులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంగా వారు వాదిస్తున్నారు. శాసనసభ్యులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే, చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించే అవకాశం ఉంది. అయితే అంబరీష్‌కు వైద్యం చేయించడాన్ని ప్రభుత్వం ప్రత్యేక కేసుగా భావించిందని, అందువల్ల వైద్య ఖర్చులు మొత్తం చెల్లించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య తెలిపారు. నటుడుగా అంబరీష్ కర్ణాకటకకు గొప్ప ఆస్తి అని, అటువంటి వ్యక్తికి చికిత్స నిమిత్తం ప్రభుత్వమే సింగపూర్‌కు పంపించే ఏర్పాట్లు చేసినట్లు మంత్రి శివకుమార్ చెప్పారు. ఇదేమీ కొత్త నిర్ణయం కాదని, గతంలో కూడా ప్రభుత్వాలు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాయని బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ చెప్పారు. -
మెడికల్ బిల్లుల్లో పైరవీల హవా
టీటీడీలో పలుకుబడి ఉంటే రూ.లక్షల్లో బిల్లులు సాధారణ ఉద్యోగులకు భారీగా కోత తిరుపతి సిటీ : టీటీడీ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన మెడికల్ బిల్లుల(రీయింబర్స్మెంట్) చెల్లింపులు వివాదాస్పదంగా మారుతున్నాయి. పలుకుబడి, పైరవీలు చేయిస్తున్న ఉద్యోగులకు రూ.లక్షల్లో బిల్లులు ముట్టజెబుతున్నారని, చిన్న ఉద్యోగులకు జబ్బు చేస్తే పెట్టిన ఖర్చులను సైతం చెల్లించకుండా ఆంక్షలు విధిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆపరేషన్లకు ఖర్చు చేసిన చిన్నస్థాయి ఉద్యోగులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రూ.2 లక్షలు దాటితే.. సాధారణంగా అటెండర్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు వ్యక్తిగతంగానూ, కుటుం బసభ్యులకైనా గరిష్టంగా టీటీడీ రూ.2 లక్షల మేరకు మెడికల్ బిల్లులకు పరిమి తి ఇచ్చింది. స్విమ్స్, నిమ్స్ ఆస్పత్రుల్లో తప్ప ఇతర ఆస్పత్రుల్లో వెద్యం పొందేవారికి ఇది వర్తిస్తుంది. బయట వైద్యం పొందడానికి గల కారణాలు తెలుపుతూ స్విమ్స్, నిమ్స్ వైద్యుల రెఫరల్ ఫాం అందించాల్సి ఉంటుంది. రూ. 2 లక్షల వరకు చెల్లించడానికి టీటీడీ ఈవోకు అధికారం ఉంది. ఈ పరిమితి దాటితే పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల పాలక మండలి ఇద్దరికి పెద్దమొత్తంలో మెడికల్ బిల్లులు చెల్లించినట్లు సమాచారం. ఈ వ్యవహారాలపై బాధిత సామాన్య ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు తమ దగ్గరకు వస్తేనే వర్తిసాయా? పెద్దస్థాయిలో పైరవీలు చేసే వారికి నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నిస్తున్నారు. పరిమితిని దాటితే తిప్పలే పరిమితిని మించే మెడికల్ బిల్లుల వ్యవహారంలో తిప్పలు తప్పడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. రూ.2.50 లక్షలు బిల్లు వస్తే అందులో నాలుగో వంతు మాత్రమే ఇస్తున్నారని సమాచారం. అదేమని ప్రశ్నిస్తే నిబంధనల ప్రకారమే చెల్లిస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్లిన సమయంలో గుండె పోటు లాంటివి సంభవిస్తే అకస్మాత్తుగా అయ్యే ఆపరేషన్ల విషయంలోనూ కొర్రీలు వేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. టీటీడీ కొన్ని సర్జరీలకు బాధితులకు రూ.2 లక్షలు చెల్లిస్తుంది. ఇదే తరహాలో కొందరు ఉద్యోగులు మహానగరాలలో అడ్వాన్స్ టెక్నాలజీల ద్వారా కోతలేని ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఇవి ఓపెన్‌హార్ట్ కిందకు రావని.. కేవ లం రూ.50 వేలు మాత్రమే మంజూరవుతుందని చెబుతున్నట్లు సమాచారం. నిబంధనల మేరకే బిల్లులు.. టీటీడీ నిబంధనల మేరకే మెడికల్ బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయి. వంద రకాల జబ్బు లు ఉన్నాయి. వాటిలో కొన్ని రూ.10 వేల బిల్లు కూడా మించనివి ఉన్నాయి. వాటన్నింటికీ నిర్ణయించిన మేరకే చెల్లిస్తున్నాం. ఎంత పరిమితి ఉంటే అంతా చెల్లించలేం కదా.. వైద్యులు ధ్రువీకరించిన మేరకే నిర్ణయాలు ఉంటాయి. - డాక్టర్ ఎన్.వికాస్, సీఎంవో, టీటీడీ