దివంగత సీఎం వైఎస్ పాలసీని అమలు చేయాలి: టీపీసీసీ
హైదరాబాద్ : పెండింగ్‌లో ఉన్న రైల్వే గేట్ల నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యే నిధులను వినియోగించేలా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి అభిప్రాయపడ్డారు. పెన్షన్లు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రేషన్‌కార్డులుసహా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని శుక్రవారం ఆయన ఆరోపించారు. ఒకే కుటుంబంలో వికలాంగుడు, వృద్ధుడు, వితంతువు ఉంటే..
అందులో ఒక్కరికే పెన్షన్ ఇవ్వడంవల్ల మిగిలిన ఇద్దరి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో అర్హులైన వారందరికీ పెన్షన్లుసహా ప్రభుత్వ పథకాలన్నింటినీ వర్తింపజేశారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం సైతం అదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైల్వేగేట్లకుఎంపీ, ఎమ్మెల్యే నిధులు వాడాలి
Published Sat, Jul 26 2014 2:39 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement