హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరింది. ఆర్టీసీ ఎండీతో కార్మిక సంఘాలు శుక్రవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మెను మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. అందులోభాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్నీ ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముషీరాబాద్ డివిజన్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టనున్నారు.
అలాగే నేటి ఉదయం 11 గంటలకు ఎన్ఎంయూలోని కార్మిక సంఘాలు ప్రెస్మీట్ ఏర్పాటు చేయనుంది. ఆర్టీసీ కార్మికులతో ఆ సంస్థ జేఎండీ రమణారావు భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఫిట్మెంట్పై చర్చించే అవకాశం ఉందని తెలిసింది.