ప్రచారం ప్రారంభించిన ప్రశాంత్‌రెడ్డి | Vemula Prashanth Reddy Start Election Campaign In Nizamabad | Sakshi
Sakshi News home page

ప్రచారం ప్రారంభించిన ప్రశాంత్‌రెడ్డి

Published Tue, Nov 13 2018 7:54 PM | Last Updated on Tue, Nov 13 2018 7:54 PM

Vemula Prashanth Reddy Start Election Campaign In Nizamabad - Sakshi

శంఖం పూరించి ప్రచారం ప్రారంభిస్తున్న ప్రశాంత్‌రెడ్డి

సాక్షి,మోర్తాడ్‌(నిజామాబాద్‌): ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడం, నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో బాల్కొండ తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రశాంత్‌రెడ్డి సోమవారం నుంచి ప్రచారం ప్రారంభించారు. తడపాకల్‌ గోదావరి నది తీరంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం గ్రామంలోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం దోంచంద, గుమ్మిర్యాల్, తాళ్లరాంపూర్‌లలో ప్రశాంత్‌రెడ్డి రోడ్‌ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశానని తెలిపారు. మరోసారి టీఆర్‌ఎస్‌కు అవకాశం కల్పిస్తే మరిన్ని సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఆదరించి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, నాయకులు కొత్తూర్‌ లక్ష్మారెడ్డి, కోటపాటి నర్సింహానాయుడు, డాక్టర్‌ మధుశేఖర్, డీసీసీబీ డైరెక్టర్‌ సోమ చిన్న గంగారెడ్డి, ఎంపీపీ చిన్నయ్య, ఎంపీటీసీ సభ్యుడు గడ్డం లింగారెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాజాపూర్ణనందం, కల్లెడ ఎలియా, కే.చిన్న రాజేశ్వర్, జైడి చిన్న గంగారెడ్డి, వడ్ల గంగాధర్, డాక్టర్‌ మధు, ఉప్లూర్‌ చిన్నారెడ్డి, బద్దం ప్రభాకర్, గంధం మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement